4. కవి
కవి ఎలా ఆలోచిస్తాడు? ఎలా ప్రతిస్పందిస్తాడు? ఎందుకు, దేనిగురించి ఆరాటపడతాడు? - అనే విషయాలను తరిచి జంఘాలశాస్త్రి ఈ ఉపన్యాసం ఇస్తున్నాడు. -
కవి, ఒక గడ్డిపరకలో సైతం పరమేశ్వరుడి కరుణ, పరమేశ్వరుడి లీల, పరమేశ్వరుడి జ్ఞానం, పరమేశ్వరుని ఆనందం, పరమేశ్వరుడి మహిమ, భావించి ఆమూర్తిని సేవించి సేవించి, ఆశక్తిని ధ్యానించి ధ్యానించి, ప్రకృతిలో సహజతకు సంతోషించి, వలచి, వశుడై సౌందర్యగీతాలను అరచిఅరచి, వ్యక్తిత్వాన్నిమరచి, తన్మయుడవుతాడు. నవ్వితే ఒక సొగసు, బెదిరిస్తే వేరొకసొగసు, తల ఊగిస్తే మరోసొగసు, రౌద్రంగా ఝాంకరిస్తే ఇంకొకసాగసు, బతిమాలితే మరోసొగసు కనిపించే ప్రకృతికిలొంగి, సౌందర్యం అనే పాలసముద్రంలో చేతులు బారలువిసిరి ఈదుతూ-మరొకసారి ఏచిరు కెరటంమీదనో తలవాల్చి మైమరచి పడివుండే మనిషి కవి. బాహ్యప్రకృతే ఎంతో ఆశ్చర్యంగా వుందనుకుంటే, మరిలోపలి ప్రకృతి ఇంకా ఆశ్చర్యకరమైంది. అక్కడ తలెత్తే ఉత్పాతాలు బాహ్యప్రకృతిలో వాటికంటె తీవ్రమైనవి. మనం రకరకాల వ్వవధానాలతో చరిత్రలో సాగిన అనేక యుద్దాలగురించి వినివున్నాంగాని, సృష్టిప్రారంభంనుంచే అరిషడ్వర్గం (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్పర్యాలు) తో మనిషికి లోపలి ప్రకృతిలో జరిగే యుద్దం దాని సంక్షోభం వాటికంటె బీభత్సమైంది. ఈరెండు విధాల ప్రకృతులలో విశేషాలను తన అనుభవంతో పట్టజాలినవాడు కవి. అతనికి మాటల్ని బొమ్మలుగాచేసే శక్తివుంది. కవి ఒక విధమైన పిచ్చివాడు. కోటి విధాల పరమార్థగ్రహణ మార్గాలలో ఒక మార్గమే ఆపిచ్చి, అటువంటి వెర్రితో, తాను ధన్యుడై లోకాన్ని ధన్యంచేసేవాడు కవి. |
జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.
ఎక్కడఁ జూచిన జిగజిగ, ఎక్కడ జూచిన మిలమిల, ఎక్కడం జూచిన నీరు, ఎక్కడ జూచిన పరిమళము, ఎక్కడ జూచిన వెలుఁగు, ఎక్కడఁ జూచిన బయలు, ఎక్కడఁ జూచిన