పుట:SaakshiPartIII.djvu/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొనర్చెడివాఁడు. పంచభూతములకు భాషావిషయ కోపన్యాసము లిచ్చువాఁడు; ఇతడు పూర్తిగాఁ బిచ్చివాఁడు జన్మమందత్వమే కాదు, పెద్దపెద్ద యున్మాదములే కాదు, చిట్టచివరకు మనుజులకు సర్వసాధారణముగా నున్న కొసవెట్టలు గూడ మెదటితో, నరముల కూటుమితో సంబంధించినవే కాని, వేఱు కాదు. ఇవియన్నియు దేహపరిణామములే కాని మనఃపరిణామములు కావు. కాని మనస్సునకు మెదడు ప్రధానావయవము కావున మనస్సులో బరిణామము Heredity వలనఁ గలిగి నట్టు కానబడుచున్నది. కాని మఱియొు కటి కాదు. అది కేవలము భ్రమము. మనస్సు చెడిపోయినట్టగపడుట కనేక కారణములుండును. పచ్చకామిల గలవాని కంటికిఁ బికిలిపిట్ట పసపుపొత్తి పిట్ట. సర్పదష్టుని జిహ్వకు లవణము కలకండ. అధర్మాయచెవియందు నిర్ధాతమునకు నిశ్వబ్దత్వము. సన్ని పాతరోగియె & Socrates కు , శంకరాచార్యుల వారికి, జగన్మిథ్యాత్వవాదము జరుగచుండును. అలవాటు లేనివానికి అరయవున్సు Exshaw గొంతుక దిగుటయేమి? యప్సరస లెదుటఁ దాండవించుటకై యమరలోకమునుండి దిగుటయేమి? ఇట్టి వన్నియు దాత్కాలి కోన్మాద ములు. వీనికి మహోన్మాదములకుఁ దత్త్వమందు భేదమేమియులేదు. నిలుకడలో మాత్రమే భేదమున్నది. సన్నిపాతరోగికి జ్వరహర మగువెంటనే యున్మాదము వదలును. అటులే యశ్వినీదేవతలు వచ్చి జన్మమందునిఁ జిన్నతలను బెద్దతలగాఁ జేయునెడల Idiot కున్మా దము వదలును. అదియులేదు; యిదియు లేదు, కాని కొన్ని కొన్ని యున్మాదము లౌషధసాధ్యములనుట సత్యమే; ఏ యౌషధమైనను శరీరమునకుఁగాని చిత్తమునకుఁ గాదని యంద ఱెఱిగిన యంశమే. అందుచే నున్మాదము లన్నియు దేహపరిణామములు కాని మనఃపరిణామములు కావు.

ఆమ్మా! Heredity మనస్సుపై బనిచేయునని నీ వెన్నఁడు నమ్మవలదు. నీయభిప్రా యమును సిద్ధాంతీకరించు కొనుటకు మనశ్శాస్త్రజ్ఞ డైన పాశ్చాత్యమహావిద్వాంసుని మాటలు గొన్నింటిని ఉదహరించినావు. అవి.ఏమనగ: ..... The heredity transmission of a liability to mental disease must be reckoned as the most important of all predisposing causes of insanity”ఈ మాటలను బట్టి mental disease (పిచ్చి) Heredity వలననే వచ్చుచున్నదని నీ వనుకొంటివి. అమ్మా! అట్టనుకొనుట తప్ప. పిచ్చికి Herediry యే కారణమని యావాక్యముల వ్రాసిన పండితుని యభిప్రాయము కాదు. పిచ్చికి Liability యున్నదే. అదే Heredity వలన వచ్చునని యాతని యభిప్రాయము. ఆ Liability యెప్పడుకూడ దేహపరిణామమే కాని మలకియొకటి కాదు. అందుచే Heredity దేహముమీ దనే కాని మనస్సు మీద బనిచేయదు; చేయలేదు.

అమ్మా! ఒకమాటు చెప్పచున్నాను; శ్రద్దగా వినుము. మనమార్షమతస్థులము. పరమాత్మను, జీవాత్మను, బునర్జన్మమును నమ్మిన వారము. మనదేశము నందుఁ బుట్టిన చార్వాకమతము నందుమాత్ర మివి యేవియు లేవు. బుద్దుడు దైవమును గూర్చి మూకీభావము వహించినను జీవాత్మతత్త్వమును గూర్చి కొంతవేఱుగాఁ జెప్పినను బునర్జన్మము నొప్పకానినాఁడు. అమ్మా! పాశ్చాత్య శాస్త్రజ్ఞలలో ననేకుల నాత్మవాదులు. ఆత్మలేనప్పడు పునర్జన్మము దేనికి? అందులోఁ బ్రకృతిశాస్త్రజ్ఞానము పరిపూర్ణముగ నున్న మహావిద్వాంసు లలో నూటికిఁ దొంబదియైదుగురు నిరీశ్వరవాదులు. మిగిలిన యయిదుగురు Agnositcs