పుట:SaakshiPartIII.djvu/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏది యెటులున్నను Heredity వలన బిడ్డలోని స్టూలదేహ లక్షణములన్నియుఁ గలుగ వచ్చుననియు, గొన్నియైన గలుగవచ్చుననియు, నా కంగీకృతమే. దేహపరిణామ మందే Herediry పనిచేయుటకు శక్తికలది కాని మనస్సుపై దానికి లేశముకాని, యధికార ములే దని నా యభిప్రాయము. ఈ నా యభిప్రాయమును ఖండించుటకు మీరు కొన్ని వాక్యములు వ్రాసినారు; అవి యేవనంగా—"ఇదివఱ కైదుతరములనుండి Idiocy తీగ సాగుచున్న వంశములు రెండెచ్చటనో యున్నట్టోక మనశ్శాస్త్రజ్ఞుడు చెప్పచున్నాడు. తండ్రికిఁ బిచ్చి లేదుకాని తీవ్రమైన కోపము, పెద్దకొడుకునకు సామాన్యపుబిచ్చి, రెండవకొడుకున కంతకంటెఁ బిచ్చి, మూడవకొడుకునకు బూర్తిగాఁ బిచ్చియున్న కుటుంబము నొకదానిని గోదావరీ తీరమందు నే నెఱుఁగుదును.” మీరిట్లు వ్రాసినారు. అమ్మా! గోదావరీ తీరమందలి కుటుంబము నే నెఱుంగునది కాదు. Heredity మనస్సు మీఁదఁగూడఁ బనిచేయునని నిర్ధారణ చేయటకై మీరు చెప్పిన యీ రెండుదాహరణములు గూడ మీ కనుకూలించునని కావని తెలియఁజేయ వలసివచ్చి నందులకు విచారించుచున్నాను. అమ్మా! మెదడు (Brain) మనస్సుయొక్క అవయవము (Organ) అని పాశ్చాత్యులతోపాటు మనముకూడ నొప్పకొవనిన యంశమే కాని వేఱుకాదు. Brain అనునది తలలో నుండు నని మీఱిగినయంశమే కదా! ఈతల తగినయేత్తుతో, దగినపొడవుతోఁ, దగిన వెడలుపుతో, దగిన యాకృతితోఁ దగిన చుట్టుకొలతతో గోధుమరంగు గల తగిన యంత ర్వస్తువుతో నుండవలయును. అప్పడే తలలోని మెదడు మనస్తత్త్వమునకుఁ దగిన యవయవ మగును. వీనిలో లోపములు కలుగుటచేతనే మనస్సు శక్తిహీనమై చెడినట్లుండును. ఎదిగినమ గవానితల సర్వసాధారణముగా 22 అంగుళముల చుట్టుకొలత కలిగియుండును. ఆడుదాని తల యిరువదియొకటికి నిరువదిరెంటికి నడిమికొలతకలదై యుండును. మహాబుద్దిశాలు లగువారి తలలు 23, 24 అంగుళముల చుట్టుకొలత కలవియై యుండును. ఎట్టి యద్వితీయ మేధాసంపన్నుని తలయైనను 24/2 అంగుళముల కొలతకంటె హెచ్చుకొలత గలిగియుం డదు. అంతకంటెఁ బెద్దతల రోగచిహ్నమని యెంచవలయును. మందుల తలలు 19 అంగుళములను, idiots తలలు 18 అంగుళముల కొలతకలవియై యుండును. అమ్మా! జన్మమందత్వము Idiocy అయిదుతరములనుండి తీఁగ సాగుచున్న కుటుంబములు రెండున్నవి చెప్పితివే! వారంద ఆకిట్టి తలలు గలవారే. తలలనుబట్టియే వారు Idiots అయిరి. తండ్రికోలమొగము Heredity వలన బిడ్డకు నెట్టు సంక్రమించునో తండ్రిబుద్దిహీనమైనతల కొడుకున కట్టు సంక్రమించుచున్నది. ఇది దేహపరిణామమే కాని మనః పరిణామ మెంతమా త్రము గాదు. అమ్మా! గోదావరీతీర మందలి పిచ్చికుటుంబమును గూర్చిరవంత చెప్పెదను. తండ్రి, తల్లి, ముగ్గురు కొడుకులా కుటుంబమున నుండిరి. తండ్రినరముల కత్యంత మైన యుద్రేకము. వాకిటిలో గుక్క రవంత మొఱగినయెడల భూకంప మైనంత తహతహ లాడిపోవును. అట్టి యాతనికి వెనుక వ్రాలుతలగల (Pyramidal-forehead) యిల్గాలు సిద్దించెను. వా రిద్దఱకు ముగ్గురు కొడుకులు పుట్టిరి. మొదటివాఁడు పాముతలవాఁడు. ఇతనికి నుదుటిసంబంధమగు మెదడు (Frontel brain) లేదు. రెండవకొడుకు మిక్కిలి చిన్నతలతో బుట్టెను. ఇతడు జన్మమందుడు. చిన్నయన్న గారి చిన్నతలతోఁ దల్లివ్రాలు తలతో, దండ్రి నరముల యుద్రేకముతో మూఁవకొడుకు పుట్టినాఁడు. ఈత డీగను జూచి యెగిరి యెగిరి పడువాఁడు. పిల్లిని గాంచి యేడ్చెడువాఁడు; కాకిని గాంచి గాన