Jump to content

పుట:SaakshiPartIII.djvu/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుఱుకుదనమును గలవాఁడున్న కుటుంబముతో సంబంధము చేయఁగూడదు. అట్టి ప్రజ్ఞావంతుని తరువాత రూపాయకుఁ బదణాలవఆకుఁ బిచ్చివారు కలుగవచ్చును. మేన మామ కూతునకు మేనత్తకొడుకునకు, మేనమామ మేనకోడలికి, మేనత్తకూతునకు మేనమామకొడుకునకు వివాహసంబంధము లొనర్చి లొడితెడైన యావరణములో గుడుగుడుగుంచము లాడుచు ముళ్లపై ముళ్లు దగుల్చుకొనువారి కుటుంబములలోఁ దఱచుగాఁ బిచ్చివారు పట్టుదురని చెప్పదురు.

Heredity వలననే దేహలక్షణములన్నియు గలుగుచున్నవి. మనోలక్షణము లన్నియుఁ గలుగుచున్నవి. ఇట్టిలక్షణములు సంక్రమింపఁ జేయుటలో తల్లి దండ్రులతరమువారి కెంతశక్తియున్నదో, వారి పైతరములవారి కెంతశక్తియున్నదో వారిపై పైతరములవారి కెంతశక్తియున్నదో యను నంశములు కూడ శాస్త్రవేత్తలు సంతతపరిశోధ నమువలనఁ గనిపట్టినారు. తల్లికాని తండ్రికాని (0.5); పితామహుడు కాని మాతామహుడు కాని (0.5); యేడవతరములోని పురుషుఁడు (0.5)'*; x తరములోని పురుషుఁడు (0.5)* గా, దైహిక మానసికలక్షణములు పిల్లలకు సంక్రమింపజేయుదురని వారు చెప్పినారు. కాని యీసూత్రము మాత్రము ప్రత్యేకవ్యక్తిపరముగా గాక, సాంఘికసాముదాయిక పరముగా సత్యమని వారు చెప్పినారు.

కావుననేమి తేలిన దనంగా; ఒక కుటుంబములోఁ గలిగిన బొమ్మతల్లిదండ్రులు మాత్రమే చేసినని కాదు. వారు, వారిపై వారు, వారి పైవారు నేబదుగురో యఱువదుగురో చేసిన బొమ్మయని తెలియ దగినది. దేహలక్షణములు సంతానమునందుఁ 'గాదాచిత్క ముగ గానబడుననియు, మనోలక్షణములు మొదలే కానబడవనియు మీరు చెప్పిన మాట యాచారవిరుద్దమైనదియు, నశాస్త్రీయమైనదియు, నసత్యమైనదియునైయున్నది. తల్లిదండ్రుల లక్షణములే కాదు; వారి పూర్వుల లక్షణములే కాదు; మనుష్యజాతికి బూర్వులైన యన్ని ప్రాణుల లక్షణములు గూడ మనలో నున్నవి. ఇలకోడికూఁత యెఱుఁగుదువా? దాని కెదురు పడిన ప్రేయసిని సంతసింపజేయుట కది కూయుచున్నది. కప్పయు నందుకొఱకే కూయుచున్నది. మగవాఁడు తన కిష్టమైన కాంతను జూచి యట్టే కూనురాగ మీడ్చుచున్నాడు. మగనెమిలి యాడునెమిలి సంతసము కొఱకుఁ బురివిప్పి తాండవించును. మగవాఁడు దనకిష్టమైన మగువ ప్రీతికై తల యెగురవైచుకొని యొడలు విరుచుకొని యొయ్యారమునఁ దిరుగులాడి మిడికిమిడికి మొత్తుకొనుచున్నాడు. క్రూరజంతువుల హింసా సాధనములు మననోటఁ గోరలుగ నిల్చియున్నవి. కోఁతితోఁక మన వెన్నుపాము చివర Coccyx రూపమున నిల్చియున్నది. కోఁతి కిచకిచలే మననవ్వులైనవి. కోతి వెక్కిరింపులే మన యధిక్షేపణములు. కోఁతి చాంచల్యమే మన మనస్సులో శాశ్వతముగ నిల్చియున్నది. అయ్యా! ఇక జాలు. నామాటలు నచ్చినవానికి నిఁకఁ జెప్పనక్కఱలేదు. నచ్చనివానికి నిఁకఁ జెప్పనక్కఱలేదు. అందుచే విరమించుచున్నాను.

కాని మఱియొక్కమాట. మునుపటివలెనే యీసారికూడ దొందరపడి జంఘాలశా స్త్రీపక్షమున మీరు ప్రత్యుత్తర మీయవలదు. రాదలఁచిన జంఘాలశాస్త్రీ వచ్చి, స్థాపింపదలచిన సంఘమేదో స్థాపించిన తరువాత, నీయవలసిన యుపన్యాసములలోఁ బ్రథమసాంఘికోప న్యాసమే నాకుఁ బ్రత్యుత్తరముగా జంఘాలశాస్త్రి యీయవలయును. అది నాకోరిక. ఆతని