విశేషముగాఁ బరిశీలించుచున్నారు. ఒక్కవంశములోని వ్యాధులు మఱియొక్క వంశములో నికి సంక్రమించుట కవకాశము కలుగకుండుటకే మనవారు పరిణయ నిర్ణయపూర్వమునం దింత పరిశోధన చేయుచున్నారు. ఇట్టి పరిశోధనము రోగవ్యాప్తి నివారణమునకే కాక, దుష్ప్రవర్తన వ్యాప్తి నివారణమునకుఁగూడ నైయున్నది. అందుచేఁ బిడ్డలప్రవర్తనము కూడ వంశానుక్రమ సూత్రమున కధీనమై యున్న దనియే స్పష్టపడుచున్నది.
అయ్యా! దేహసంబంధములగు కొన్ని లక్షణములు బిడ్డలయందు గానబడవచ్చును గాని జగత్తునేల గలట్టియు, జగత్తునకు బానిసయగు నంతటి తుచృత్వము గలయట్టియు మనస్సులోని సుగుణ పరంపర గాని దుర్గుణపరంపర కాని Herediry వలన రాదని మీరు స్పష్టముగఁ జెప్పినారు. మీకుఁ గోపమువచ్చినను సరే కాని యిది వట్టి తెలివితక్కువ మాటయని చెపుచున్నాను. ప్రవర్తనము (Character) దేహముతోఁ జేరినదా మనస్సుతోఁ జేరినదా? దేహముతోఁ జేరినదని మీ రనుటకు సాహసింపలేరుకదా! మనస్సుతోఁ జేరినదని యొుప్పకొనక తప్పదు కదా! Heredity వలననే మనస్సు సత్ర్పవర్తనము గలదిగాని దుప్ర్పవర్తనము కలది కాని యగుచున్నదని యిప్పడే నిర్ణయింప బడినదా కాదా? ఆ నిర్ణయము నేను జేసినదగుటచే మీకు నచ్చ లేదందురా? పోనిండు. Heredity మనస్సుపై బనిచేయునని మహాశాస్త్రవేత్తలు చేసిచూపిన నిర్ణయమును విందురా? (Idiocy) జన్మమందత్వము, (Insanity) పిచ్చి యివి మనస్సుతో, జేరినవా? దేహముతోఁ జేరినవా? దేహముతోఁ జేరినవని మీ రనునెడల మి మ్మేమనవలయునో మాకుఁ దెలియదు. ఇదివఱ కైదుతరముల నుండి Idiocy తీగ సాగుచున్న వంశములు రెండు Franceలో నున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పినారు. తాతకుఁ బిచ్చి, తండ్రికి బిచ్చి, యన్నకుఁ బిచ్చి, చెల్లెలికిఁ బిచ్చి, తనకుఁ బిచ్చిమైన కుటుంబములు తఱచుగ లేకున్న విరళముగ నున్నట్టు వినుచున్నాము. తండ్రికిఁ బిచ్చిలేదు కాని తీవ్రమైన కోపము, పెద్దకొడుకునకు సామాన్యపుబిచ్చి, రెండవకొ డుకున కంతకంటె నెక్కువపిచ్చి, మూడవకొడుకునకుఁ బూర్తిగా బిచ్చిగల యొక్క కుటుంబము గోదావరీ తీరమందుండుట నే నెఱుఁగుదును. ఇప్ప డేమందురయ్యా! ఇంకను మనస్సునకు Heredity కి సంబంధము లేదని యందురా? అటులైన నొక మనశ్శాస్త్ర పరిశోధకుఁ డగు మహావైద్యుడు చెప్పినమాటలను విందురా? “The heredity Transmission of a liability to mental disease must be reckoned as the most important among all predisposing causes of insanity” & “oëo, Heredity & Cooges కారణములలోఁ బ్రబలతమమైన దని తెలిసినదా? మఱి యింకను వినుఁడు. “It probably well within the mark to say that at least 50 percent of the insance have a direct or collateral heredity tendency towards insanity” ఇక్కడకు బిచ్చివారిలో నధమము నూటి కేంబదుగురవఱకీ తరగతిలోనివారే యని స్పష్టపడినదా?
మూర్చ వంశానుక్రమమగు వ్యాధి యగుటచేతను, మూర్చ ముదిరి పిచ్చికావచ్చును గావునను, మూర్చయున్న కుటుంబములో నుండి పిల్టను దెచ్చుకొనగూడదు. ఆకుటుంబ ములోనికిఁ బిల్ల నీయగూడదు. చెడద్రాగెడు వారికుటుంబముతో నెన్నఁడును సంబంధము చేయ దగదు. ఆసంబంధమువలన నున్మాదము మఱియొక్క కుటుంబములోనికి రాగలదు. ఏదో యొక్క విషయముననే యత్యద్భుతప్రజ్ఞ కలవాఁడును హద్దుమీఱిన