పుట:SaakshiPartIII.djvu/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుపన్యాసములు విని యెంతకాలమో యైనది. ఆతఁడు మమ్మెంత యధిక్షేపించినను మా కెవ్వరికి నాతనిపై నిసుమంత యైనఁ గోపము రాలేదు. ఆతనిని మా సోదరునివలెఁ జూచుకొనుచున్నాము. ఆతడు బదరీనారాయణము నుండి వచ్చి నూతన సంఘమును స్థాపించి యాంధ్రదేశము నందు సమంజసమైన సంచలనము, సంతోషము నెప్పడు సమకూర్చునో యని సముత్కంఠచే నిరీక్షించుచున్నాము.

(భారతినుండి పునర్ముద్రితము)