పుట:SaakshiPartIII.djvu/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయ్యా! నాయుపన్యాసముపై విమర్శనము జంఘాలశాస్త్రీ పక్షమున మీరు వ్రాసినట్టు వ్రాసితిరే! ఆయన బదరీనారాయణము నుండి వచ్చి యీప్రాంతముల నేదోసంఘము స్థాపించి యుపన్యాసము లారంభించుదనుక వేచియుండక యింతలోఁ ద్వరపడి మీ రాతనిపక్షమున నేల వ్రాయ వలసివచ్చినది. ఇంతలో లోకములు ముంచుకొని పోవునని మీరు భయపడితిరా? నేను తొందరపడుట తప్పని మీ రెఱిఁగి నప్పడు మీరేల తొందరపడ వలయునయ్యా! కాక, జంఘాలశాస్త్రి సాంఘిక విమర్శనము కంటె మీవిమర్శన మెక్కువ సందర్భముగా, సొగసుగా నుండునని వ్రాసితిరా? పాపము! నాయుపన్యాసమును బాగుగా ఖండించితినని యను కొనుచున్నారు. కాబోలు! ఆనందించు చున్నారు కాబోలు! అన్యోన్యమభినందించు కొనుచున్నారు కాబోలు! అల్పసంతుష్ఠులైన మిమ్ముఁ గాంచ మాకు జాలియగుచున్నదే! మీ విమర్శన మెంత నీరసముగ, నెంత పేలవముగ, నెంత యుక్తి శూన్యముగ, నెంత యశాస్త్రీయముగ నున్నదో మీరు గ్రహించు కొనలేకుండ నున్నారు. అవును! మా తప్పలు గ్రహించుటలో మీరు మహావిద్వాంసులు కాని మీ తప్పలు గ్రహించుకొనుటలో మీరు మందబుద్దులే కాదా? తప్పలు లేనిచోటుల నైనను జిలువలకుఁ బలవలు, పలవలకుఁ గొమ్మలు, కొమ్మలకు గుత్తులు కల్పించి వేయితప్పలు మాలోఁ జూపగలరు కాని లక్షలకొలది తప్పలున్న మీవారి వ్రాతలకుఁ గనులుమూసికొవని, నోరుమూసికొవని పడియుండువారే కాదా? ఆడుదాని యణువంత తప్ప హిమవత్పర్వతముగా మీదయ్యపుఁ గంటికిఁ గనబడునే అట్టి మీకన్ను మీకెంత మాత్రమును వినియోగింప కుండ నున్నదే! మీ పాండిత్యము మమ్మల్లరిపెట్టుటకే కాని మిమ్ము బాగుపఱచు కొనుట కేమాత్రము తోడుపడకుండ నున్నదే! మీ విమర్శన జ్ఞానము మా వ్రాఁతలలోని కలుపుతీఁతకే మీ మనస్సులలోని గర్వోపశాంతికి వినియోగపడకుండ నున్నదే! ఇంతటి నుండియైనఁ దెలివి తెచ్చుకొని మిమ్ము మీరు మొదట విమర్శించుకొని పిమ్మట మమ్ము విమర్శింప మొదలిడుడు. మిమ్ము మీరు విమర్శించుకొన్న యెడల మా జోలికెన్నడు మీరు వచ్చుటయే సిద్దించియుండదు. కురూపుండు తన రూపదేశాష్ట్ర్య మెఱింగినపిమ్మట సామాన్యస్వరూపమును వెక్కిరించునా? మొగముమీద మొటిమలుగల మగువను గుష్టరోగి యధిక్షేపించప గలడా?

అయ్యా! ఎంతయో యుత్సాహపడి, యెంతయో తొందర జెంది, యెంతయో కష్టపడి మీరు వ్రాసిన విమర్శనము, నిస్సారమై యున్నదన్న హేతువుచేత దానిని విమర్శింపక, నిరాదరణ మొనర్చి యావలఁ బారవైచినచో, మీవాక్యములే సిద్ధాంతములని మీవారనుకొ నిపోవుదురేమో యని, మమ్ము మీరు గెల్చినారని బుజము లెగుర వైచి గంతులు వేసెదరేమో యని మీ విమర్శనకుఁ బ్రతి విమర్శనము వ్రాయ వలసివచ్చినది. మీవిమర్శనమున విమర్శింప వలసిన దొక్క యంశమే యున్నది. అందుగూడ నొక్క వాక్యము మాత్రమే విమర్శింపదగి యున్నది. అది యేదన:- -

"Heredity యనుదానివలనఁ దండ్రిసంబంధమైన ముక్కు పొడుగో, తల్లిసంబంధ మైన కంటిసోగయో, మేనమామ సంబంధమైన మూఁతివంకరయో సంతానమందుఁ గాదాచిత్కముగ సంక్రమింపవచ్చునుగాని జగత్తు నేలుటకు సామర్ద్యము గలయట్టియు జగత్తునకు బానిసయగునంతటి తుచ్చముగల యట్టియు మనస్సులోని శౌర్యము, గాంభీర్యము, త్యాగము, నాపత్సహనము, భూతదయ, దైవభక్తి బ్రహ్మజ్ఞానము మొదలగు సుగుణ