పరంపరకాని, కాతరత, లాఘనము, లోభము, శాంతి రాహిత్యము, తామసము, నాస్తికత మొదలగు దుర్గుణ పరంపరకాని Heredity వలనఁ గలుగుట కవకాశములేదు."
ఇది మీ ప్రధాన వాక్యము. ఈవాక్యమువలన మీప్రపంచజ్ఞానము మిక్కిలి యల్పమని స్పష్టపడుచున్నది. వాక్యము బారెడేగాని పసగలది కాదు. 'తండ్రి సంబంధమైన ముక్కుపొడుగో సంతానమందు సంక్రమింపవచ్చునని మీరు వ్రాసినారు. సంక్రమింపవచ్చుననియే కాని సంక్రమించునని మీరు స్పష్టముగ వ్రాయలేదు. అంతేకాక, దానికి వెనుక'గాదాచిత్కముగ’ నని యొక్కబంధ మంటగట్టినారు. ఇందువలన మీకు Heredity యందు విశ్వాసము లేనట్టు స్పష్టమగుచున్నది. ఈవిషయమున మీకుఁ బూర్వజన్మమే శరణ్యముగ నున్నది. “పూర్వజన్మమునందు నాకుగల విశ్వాసమువలన నార్యమతమునకు బలము కాని, యవిశ్వాసమువలన నీరసతకాని లేదనీ మీరు నన్నధిక్షేపించి తిరికాదా? Heredity యందు మీకుఁగల విశ్వాసమువలన సృష్టి శాస్త్రమునకు బలముకాని యవిశ్వాసమువలన నీరసత కాని లేదని మిమ్ము నేను దిరుగ నధిక్షేపించవచ్చును గదా! మీ యధిక్షేపణమునకుఁ బ్రత్యధిక్షేపణమును మీకప్పఁజెప్పితినిగదా! ఇంక మాటలాడ కూరకుండుడు. విడిచినవాద మును దిరుగ నందుకొని సాగింతము.
కాంకరగింజ నాటినయెడలఁ గాకరతీఁగయే పుట్టుచున్నది కదా? "కాదాచిత్కముగ గాఁకరతీగ పుట్టవచ్చునని మీరనరు కదా! తరులతాజాతియందు సహజమైన, సత్యమైన ధర్మము పరిణామని శ్రేణికలో మొదటి మెట్టుపైనున్న మనుష్య సంతానమునకేల సత్యము కాదు? మనుజ దంపతులకుఁ బుట్టిన సంతానము గూర్చి యింక ననేక విచిత్ర పరిస్థితులు, చిరకాల సంప్రదాయములు, ననేక వ్యక్తిలక్షణ సముదాయములు, ననేక లక్షణముల యన్యోన్య సమ్మేళనమువలనఁ గలిగిన లక్షణము లెన్నో పరిశీలింపవలయునుగాని తరులతాదిజాతియందుం బరమార్దముగ జరుగుచున్న సామాన్యధర్మమే యిచ్చటగూడ జరుగుచున్నది కదా? అంతకంటె భేద మేమియు లేదే? కాని యిక్కడ నల్లిక లెక్కువ యున్నవి. చికిబికు లెక్కువయున్నవి. క్రొత్తకూర్పులున్నవి. దూరమాలోచింప వలసియు న్నది.
బిడ్డలక్షణములు పరిశీలింపవలసివచ్చినప్పడు తల్లిదండ్రుల లక్షణములు మాత్రమే పరిశీలించి యూరకుండ జనదు. ఆబిడ్డని పితామహి లక్షణములు, పితామహిలక్షణములు, వారి యితర సంతానలక్షణములు గూడఁ బరిశీలింప వలయును. అంతేకాదు, మాతామహ లక్షణములు, మాతామహిలక్షణములు, వారి యితరసంతానలక్షణములు గూడ బరిశీలింపవల యును. ఇట్టింక బై రెండుమూఁడు తరములవఱకైనఁ జూడఁ దగినది. బిడ్డలోని యనేక లక్షణములు తల్లిదండ్రుల లక్షణముల బట్టియే నిర్ణయింపదగును. తల్లిదండ్రులలో లేని లక్షణములేవైన బిడ్డయందుఁ గానఁబడినయెడల వానికొఱకు వంశవృక్షములోని పైకొమ్మల నెక్కీ పరీక్షించినయడల వానికిఁ గారణము లగపడితీఱును.
ఒకయాడుపిల్ల పుట్టిననిముసము మొదలుకొని ముసలిది యగు వఱకు నడుమ జరుగు ప్రధాన చేష్టలను బరిశీలింతము. పిల్లచేఁటలోఁ బడగనే కేరుకేరున నేడువవలయును గదా! అటు లీ పిల్ల యేడువలే దనుకొనుము. ఎందుచేత? ఆపిల్లతల్లియో, తండ్రియో భూపతనమగుటతోడనే యేడువకపోయి యుండ వలయును. ఆసంగతి వారితల్లితండ్రుల