-సమృద్ది పండ్రెండు స్నానము లొనర్చువాఁడు పరిపూర్ణ స్నాననిష్ణాగరిష్టడు. ముంజేతు లకు మొగమునకు మాత్రమే యుష్ణోదకస్పర్శము కాని యొడలి కేది? వారు నాగరికత కలవారు కారా? అట్టని వారి పద్దతి మనమవలంబించు నెడల భారత దేశమంతయు బదిమాసములలో నిర్జన మగుట కేమైన సందేహమా?
అమ్మా! France దేశమునకు బోయి యచ్చటి యొకనటిని నీ వీ వృత్తినేల యవలంబిం చితివని యడుగుము. 'ఈవృత్తిలోఁ జాకచక్య మగపఱచి, ధనము సంపాదించు నెడల మగ డెవ్వఁడైన లభించునేమో యను నాసతో నిందు దిగితి’ నని యామె ప్రత్యుత్తరము చెప్పను. ముప్పది రెండేండ్ల కన్య మొగమునకు బూడిద రాచుకొని యర్దడదిగంబర వేషముతో నాట్యమాడుచు, వలతోఁ జిగురుగండెలతో, పక్షికూతలతో మగలకైవేటాడుచు, నెవ్వనినో యొకని గ్రహించి వానిని కొంత కాలము పరీక్షించి నచ్చనియెడల విడిచిపెట్టుచు, మఱియొుకని గ్రహించి, వాడు చేసిన మోసమువలనఁ గలిగిన ఫలముల కేడ్చుచు, మఱల మఱి యొకనికై ప్రయత్నించుచు, నాందోళన పడుచు, నల్గాడుచు, మిడుక వలసిన స్థితి భారతదేశ స్త్రీ కెన్నఁడైన నేమాత్రమైనఁ గలుగుటకు సాధ్యమగునా? ముప్పది రెండేండ్ల వలకెందులకు? పదునెనిమిదేండ్లు దాఁటిన కన్యను సాధారణముగా భారతదేశమందుఁ జూపఁగలమా? అంతవఱకుఁ గూడ నెందులకు? పదియేండ్లకుఁ బెండ్లి , పదునొకండేండ్లకు సమర్త, పండ్రెండేండ్లకు లొడితెడుబిడ్డయు గల గృహిణి భరతశాస్త్రాభ్యాసము చేయుటెప్పడు? ప్రసన్న యాదవములో నూర్వశియై తాండవించు పెప్పడు? అమ్మా, Germany లో మఱియొక్క నటిని నీ వీవృత్తిలో నేల చేరితి వని యడిగెదవా? ఆమె యేమి ప్రత్యుత్తర మిచ్చుచున్నది. Excitement కొఱకని చెప్పచున్నదా? అమ్మా! అనంగ నేమో నీకర్ణమై నదా? ఉత్సాహమునకు–ఉబికిన యుద్రేకమునకు-నరముల కదలికకు ఆమె యీవృత్తిలో జేరినదంట! ఇంట బండపనిచే, భర్తృసేవచే, బంధువుల యాదరణముచే, నతిథిజన సన్మానముచే, దేవపూజా ద్రవ్య సమార్జనముచే, బిల్లల కొనర్పవలసిన మొదలు తుదిలేని, తెఱపి తెంపులేని యుపచార పరంపరచే నిత్య ముత్సాహతోఁ గదలికతో మెలఁగవలసిన మననారీమణుల కెప్పడైన నట్టి Excitement కావలసి యుండునా? పరదేశనట శిఖామణులు బ్రహ్మచారి ణులగుటచే నేవిధమైన జంజాటము నెఱుఁగని హేతువున వారి కట్టి యుద్రేకస్థితి యావశ్య కము కాని, యూఁపిరి విడుచుటకైన దెఱపిలేని యుద్రేక స్థితిలోఁ దఱచుగా నుండవలసిన మననారీమణుల కది యెట్టన్వయింపఁ గలదు? ఒకవేళ నెప్పడైన నే కారణమునైన రవంత మాంద్యముగా నున్న యెడలఁ దోఁపకుండ నుండునెడలఁ గదలిక కొఱకు గ్రచ్చకాయ లాడుకొందురు; చతురంగ మాడు కొందరు; పాటలు పాడుకొందురు; పదిమంది చేరి యేదైన గ్రంథమును జదువుకొందురు. అంతేకాని యంతకంటె నుద్రేక మిచ్చుపను లొనర్చుటకు మనవారు పాల్పడఁగలరా? పట్టపగలు, భర్తతోనైన రవంత యే కాంతముగ మాటలాడిన యెడల నత్తగారు రొసరొర లాడునే ఆఁడుబిడ్డ మూఁతి విరుచునే పరపురుషుని స్పృశింపఁ దగదు; చూడఁదగదు; తలఁపఁదగదని ముప్పేట యేనుఁగు మెలికలబంధముతో జాతితత్త్వ పరిశుద్దనిమిత్తమై పరమ సంతోష పూర్వకముగ బంధించుకొన్న మన సోదరీమణులు నాటకములలోఁ బర పురుషులచే నాలింగన మొనర్పఁబడుటకుఁ గాని, ముద్దు పెట్టుకొనఁబ డుటకుఁగాని యంగీకరించుట యెన్నఁడైన సాధ్యమగునా? పదవయేఁట గట్టుకొని, యెనిమిదేండ్ల నుండి కాంపురము చేయుచు నల్వురు బిడ్డలను గన్నమగం డింటిలో నుండగా