పుట:SaakshiPartIII.djvu/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లయు ననియు, నామె భగవంతున కెల్లప్పడు మొక్కుకొనుచునే యుండును గదా! ఇది సత్యమని నిరూపించుటకు నిదర్శనములున్నవి కాని లేకపోలేదే! అట్టిచో నిడ్డెనపాత్రము పొరుగింటి నుండి తెచ్చుకొని యిడ్జెనలు చేసికొన్న పిమ్మట వారిపాత్ర వారికిఁ బాఱవైచినట్టు భర్తతో నవసరము తీఱినవెంటనే యాతనిఁ బైకిఁ బొమ్మనుటకు నీ కధికార మున్నది యనుకొనుట తప్ప కాదా! పట్టరాని కోపముచే నటులంటివి కాని నీమనస్సులో నట్టియుద్దేశము లేదని పెద్దవాఁడనైన నేను గ్రహింపలేనా? అడువేసములు వేసిన పురుషులవలన సంకర స్వరూపులు పుట్టుదురని స్వప్నమందైన ననుకొనకుము.

అమ్మా! మఱియొక్క మాట. మీకున్న భావనను బట్టియే మీకుఁ బుత్రులు కలుగు దురు. ఈయంశమునుగూర్చి జంఘాలశాస్త్రి చెప్పియే యున్నాఁడు. ఆతని మాటలనే చెప్పెదను. 'భర్తయందు మీకున్న భావనా గౌరవమును బట్టియే మీకు సంతానము కల్గును. తెలిసినదా? భర్త పర దేవతయని యెంచి మీ రాతనిని సేవింపుడు. మీభావనా బలముననే మహాపురుషులు మీ గర్భమున నవతరింతురు. భర్త మీకు బానిసయని యెంచి యాతనిపై నధికార మొనర్పఁకుడు. మీరు బానిస క్రింద బానిస వంటిపిల్లల గందురు. అది నిశ్చయము. అభిమన్యుని సుభద్రయే కనవలయును. భరతుని శకుంతలయే కనవలయును. ఈ కాలములో నభిమన్యులు, భరతు లెందుకు లేరు? సుభద్రలు, శకుంతలలు లేకపోవుట వలన. భర్తలను దైవములుగ సేవించుటకు భగవత్సము లైన భర్తలిప్పడున్నారా యని తెలివితక్కువ ప్రశ్న మొనర్చకుడు. ఒకప్పడు మాత్రము భగవత్సము లైనవారుండిరా? లేరు. ఇప్ప డింతకంటె లేరు. లేకపోయి నప్పటికి మీ భావన కభ్యంతరమేమి? మగలు కాని మట్టిబొమ్మలు కారే. మట్టి బొమ్మనే ద్రోణాచార్యుండుగ భావించి సేవించిన వాఁడు ధానుష్క శిఖామణి కాలేదా? అంవఱ కెందులకు? గాజులతట్టతోఁ గలుప బడిన గోడిగ యరేబియా గుఱ్ఱమును గనుటలేదా? భావనయే ప్రధానమా? అంతకంటె నేమైన నున్నదా? అట్టి మీ భావనలోపము వలననే జాతిలో బానిసతన మెక్కువ యగుచున్నది. మీయొద్ద మీ భర్తలు గడగడలాడి నప్పడు మీరు కన్నకొడుకు లెలుకలను జూచి, పిల్లులను జూచి యేడ్చినారనగ వింతయేము న్నది? సోదరీమణులారా! బాహుబల సంపన్నులు, ప్రజ్ఞాశాలులు, క్షాత్రవంతులైన పుత్రులఁ గని భారతదేశ ప్రాచీన గౌరవమును గాపాడుదురు గాక!'

విమర్శింపఁ దగినయంశ మింకొక్కటియున్నది. నాగరకతగల యితర దేశములందలి పద్దతి ననుసరించి స్త్రీలకే స్త్రీపాత్రము లిచ్చి నాటక కళను బరిపోషింప వలసినదని మీరు నాటకసంఘాధికారుల కొసంగఁ దలంచిన యాజ్ఞాపత్రములో నున్నది. అమ్మా! అవశ్యకమైన యెడల నన్యదేశీయ పద్దతి నవలంబించ వచ్చును. కాని, దాని నవలంబించుటకు బూర్వము మనదేశ శీతోష్ణస్థితులేమో, సాంఘిక నైతికాది స్థితులేమో, జాతియా దర్శమో, యన్యధేశీయ పద్దతి మన యీ పరిస్థితులకు సరిపోవునో, వికటించునో, మన తత్త్వములకు విరుద్దమైన మందును దీసికొనుటవలన నున్న రోగ మట్టుండ " మఱి యింక నేరోగము కలుగునో రవంత చూచుకొన నక్కఱలేదా? పాశ్చాత్యదేశములలో మిక్కిలి శీతల ప్రదేశము లందలి వారికి శీతోదకస్నానము స్వప్నమందైన లేదు గదా! ఉష్ణోదకస్నానమైన దినమున కెన్నిసారులని యడుగవలదు; వారమున కెన్నిసారులని యడుగవలదు; మాసమున కెన్నిసారులనియైన నడుగవలదు. సంవత్సరమున కయిదాఱు పర్యాయములు లైనంయొడల-ఓ