పుట:SaakshiPartIII.djvu/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32. శ్రీమతి సు.స. గారికి బహిరంగ లేఖ

డవేషాలు వేసే మగవారి గురించి దుమ్మెత్తి పోసిన సు.స. గారికి - కొన్ని విషయాల గురించి- సమాధానంగా పానుగంటివారు ఈ వ్యాసం వ్రాశారు.

ఉపన్యాసం స్త్రీలను ఉద్దేశించినదే అయినా, పురుషుల్ని ఉద్దేశించి పుంఖాను పుంఖాలుగా అందులో తిట్లున్నాయి. భర్తమీద కోపంతో వెల్లడించిన అభిప్రాయాలకు, భారతీయ జాతి పరిశుద్దితో లంకె ఉండడం వల్ల స్త్రీపురుషులంతా చదవాలని పానుగంటి వారు భారతిలో ప్రకటించారు.

సు.స. గారి వ్యాసంలో నాలుగు భాగాలున్నాయి. నాలుగింటా ఒకటే సంకల్పం, పురుష జాతిని తిట్టడం. స్త్రీపాత్రధారణం చేసే మగవారి మూలంగా కలిగే పిల్లలు సంకర స్వరూపులై ఉంటారనే వాదం సరైంది కాదు. కాదని చెప్పడానికి దృష్టాంతాలున్నాయి.

HERIDITY మూలంగా కన్ను, ముక్క, మూతి వంటి పోలికలు రావచ్చును గాని- గుణగణాలు రావాలని లేదు. మహాపండితుడి కొడుకు శుంఠ కావచ్చు. నిరక్షరకుక్షి వంశంలో మహామేధావంతుడు పుట్టవచ్చు. బహుపత్నీకుడైన దశరథుడికి- శ్రీరాముడి వంటి ఏకపత్నీవ్రతుడు కొడుకు కావడం, విష్ణుద్వేషి అయిన హిరణ్యకశిపునికి హరిభక్తుడైన ప్రహ్లాదుడు పుట్టడం గమనించలేదా!-జీవుడి పూర్వజన్మ సుకృత దుష్టాంతాలే ఈ జన్మలో గుణగణాలకు కారణా లవుతాయి. మగవాడు ఎలాంటివాడైనా, స్త్రీ భావన, బిడ్డల్ని కనడంలో ప్రముఖం. స్త్రీల భావన లోపం వల్లనే జాతిలో బానిసతనం ఎక్కువవుతుంది. ఆడవాళ్లు స్త్రీపాత్రల్ని ధరించడంలో గృహిణులైన వారికి చాలా సాధక బాధకాలున్నాయి. వేశ్యల్ని తెచ్చి వేషాలు వేయిస్తే ప్రమాద పరంపర ఇంకా హెచ్చు. స్త్రీ పాత్రధారణ చేసే పురుషులు బాగానే చేస్తున్నారు. ఈ సందర్భంలో, కొత్త సంస్కరణ లేమీవద్దని, సు.స. గారికి సలహా ఇచ్చారు.

మ్మా! శ్రద్దతో వ్రాసి యశ్రద్దతో విడిచిపెట్టిన నీయుపన్యాసము దైవవశమున నాకు దొరకుటచే దానిని సంతోషమునఁ జదివి విమర్శింప వలసివచ్చెనని విచారించితిని.