పుట:SaakshiPartIII.djvu/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మగవాని కనర్హమైన స్త్రీపాత్ర ధారణము వలన వారు చెడిపోవుచున్నారు. వారట్టుపాడై జాతినిగూడ భ్రష్టసఆచుటకు సంకల్పించు కొనియున్నారు. వ్యక్తివినాశకమైన, జాతివినాశక మైన యీ కృత్యమును మీరు ప్రోత్సహింపఁ దగదు. కావున మా భర్తలను మీసంఘముల నుండి బహిష్కరింప వలయును. ఇంతటినుండి పురుషులచే స్త్రీవేషములను వేయింపమని మీరు శాసన మొసర్చు కొనవలయును. నాట్యకళాభివృద్ది మా కిష్టమే. స్త్రీలకే స్త్రీపాత్రము లిప్పించి మీ రాకళను బరిపోషించి, పరిపూర్ణకీర్తి నొందవలయును, నాగరికతగల యన్నిదే శము లందుఁగూడ నదియే పద్దతి. మీరు దానికి విరుద్దముగ నడువఁదగదు. సహేతుకమైన మా యాజ్ఞాపత్రమును మీరు సన్మానింప వలయును.”

ఇట్లు వ్రాసి స్త్రీలందఱుచే సంతకములు చేయించి వారికిఁ బంపవలయును. అటుపిమ్మటఁగూడ మనభర్తలు చీర రైక సొగసు చిత్తగించుట మానకపోవునెడల నింక నంతే-వారికి వారే, మనకు మనమే వారితో మనము పూర్తిగ విడిపోవలసినదే. రాజకీయ ప్రపంచమున Non-Co-operation యెట్టు పుట్టినదో శృంగార ప్రపంచమున నిప్పడు Non-Co-operation అట్టు పుట్టవలసియున్నది. మనకు జాతిపరిశుద్ది ప్రధానము కాని సంసారవృద్దికాదు. దేశసేవ ప్రధానము కాని భర్తసేవ కాదు. భారతదేశ సేవ ముందుఁబతిసేవ యెంత? మనకుఁ బతులు శాశ్వతులు కారు. వారికిష్టత తప్పినను బోవుదురు. మన కిష్టత తప్పినను బోవుదురు. కాక మృత్యువున కధీనులైపోవచ్చును కాని భారతదేశము శాశ్వతము! ఆమె యిప్పడు పుత్రపుత్రి కాసేవ నపేక్షించుచున్నది. పూర్వసౌభాగ్యము, నాగరకత, విజ్ఞానము, సంపత్తు, స్వాతంత్ర్యము, గౌరవము నశించుటచే దీనమై, శోభారహితమై, దాస్యశృంఖలానిబద్దమై పరితపించుచున్నది. శీతజ్వర మారికాది మహావ్యాధులచేతను, గూటికి గుడ్డకుకూడఁ గఆవైన దారిద్ర్యములచేతను, రక్తపాతములకుఁ గారణము లగు చున్న వర్ణవైషమ్యములచేతను జాతియంత యథాయధ లగుటవలన, నాకంటికొలికినీరు బంగాళాఖాతముగనా కంటికొలికినీరు పశ్చిమసముద్రముగ మహాసంక్షోభ మొందు భారతదే శమును సేవించి పూజించి మనతనువులు కృతార్ధము లగునట్టు చేసికొనవలయును-సు.స.

"భారతీపత్రికాధిపతీ! ఈకాంత వ్రాసిన సాహసపు వ్రాంతలలో నొకటి రెండశములు నేను విమర్శింపవలసియున్నది. ఆవిమర్శనము త్వరలోఁ బంపెదను. ఆశ్వయుజమాసమునఁ బ్రకటింపఁబడు భారతిలో దానివి బ్రకటింపఁగోరుచున్నాను.

చిత్తగింపుఁడు,

పా. ల. నరసింహారావు.

('భారతి" నుండి పునర్ముద్రితము).