Jump to content

పుట:SaakshiPartIII.djvu/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డెను ఆతడొకనాటక సంఘమున కధికారి. ఆతనిఁ జూచుటతోడనే యీమందభాగ్యు డట్లెసిగ్గుపడి, యట్టెముడుచుకొని, మూటగట్టిగా మిగిలినయంగవస్త్రపుఁ గొసను రవంత సైటగ వేసికొనబోయి యది చాలకపోవుటచేఁ తహతహపడి రెండుచేతులను గత్తెరమాదిరిగ ఱొమ్ముపై వైచుకొని తలవంచుకొని నిలువంబడినాఁడు. ఆహా! అత డెంతలో మగరూపమును మన్నుచేసి కొవనినాడో యని నా కెంతయైన జాలికలిగినది.

ఎంతకాల మలవలచుకొన్నను స్త్రీపాత్రధారి కాడుదానిబహిరంత స్తత్త్వములు రావు కాని మగతత్త్వము భగ్నమగుట నిస్సందేహము. అందుచే నిప్ప డాంతం డెట్టివాఁడు? మగతనము చెడినవాడు. ఆడుది కానివాడు. ఆతడు పూర్తిగా నాడుదియే యైనయడల నేమో మనతోపాటు తానుగూడ నుండియే యుండును. ఇంటిలో వంటకుఁ బెంటుకు మనకుఁ జేదోడుగ నుండియే యుండును. అటుకాక యిటుకాక యిప్పడాతడు నడుమ నూగులొడుటచేత గిజగిజ లాడుచున్నాము. ఆతం డాండుది కాని హేతువుచేఁ జేపట్టునా? మగతనము మాసిపోవుటచే వదలిపెట్టనా? అడుగంటిన యనురాగము లడుగంటనే యంటడినవి. పోనీ! ఏలాగుననో సృష్టితంత్రమే జరుగుటకైయే యెడమొగము పెడమొగముగనో సంసారములో శేషభాగ మీడ్చివేయుదమని సిద్దపడిన యెడల మాకింకఁ బుట్టందలంచిన పిల్లలమాటు యేమి? మగవాఁడు కాకుండ నాడుది కాకుండ నడుమనున్న సంకరస్వరూపములను గనివారి నేడ్పించి మే మేడ్చుటకంటెఁ బడుగకది కొక్కనమస్కార మర్పించి వంటయింటన్లోఁ బ్రత్తిబుట్టముందో, సీతానగరములో నుపన్యాసపీఠమందో తనువు వెడలబుచ్చుకొనుట సర్వశ్రేయము కాదా? ఇప్పటి పరిస్థితులలో భారతదేశ మెట్టి కొడుకులను గనవలయునో యొవ రెఱుఁగరు? ఇనుపకండలవారిని, దేశభక్తులైనవారిని, విద్యాశాలులైనవారిని మన మిప్పడు కనవలసియున్నది కాని లంగా కట్టుకొని నాట్యమాడు మగరంభను, గోవులపంచెక ట్టుకొను పోతువితంతువును మన మిప్పడు కనవచ్చునా? ఇప్పడున్న స్త్రీపాత్రధారులు చాలరా? అదిగాక జన్మముచే నాడారిపెద్దమ్మ లెందఱున్నారో? వీరుచాలక, యిఁక నిట్టి యర్దపురుషసృష్టికి మనము పూనుకొనుట బుద్దిహీనత కదా? దేహద్రోహము కాదా?

"నీ వాఁడువేసము వేసితిని కావున నీతో నేను గాఁపుర మొనర్చ • నని స్పష్టముగ నేను నాభర్తతో-అదే అర్దభర్తతో-ఆడుమగనితోఁ జెప్పితిని–'నేనిప్పడే వైచితినా? ఆఱుమా సములనుండి వేయుచున్నా" నని యాతండు వెకవెకలాడెను. సోదరీమణులారా! చూచితిరా! ఆతని దుర్నయము! ఆతని దురాగతము! తాను జెడనే చెడినాఁడు; జాతిని సంకరపఱచుటకుగూడ సంకల్పించుకొనినాడు. ఇది నీకు నీతిగాదని మనము మందలింపబోగ మనలను బరాభవించుచున్నాడు. ఇంతకంటె నాడుదానికి విచారణ కారణమేమి యుండగలదు? ఇది మనము సహించి, నోరుమూసికొవని పడియుండవలసిన దేనా? నే నట్టినీచత కంగీకరింపను. విద్యావతులు, మానవతులు, దేశభక్తి యుక్తలైన నా సోదరీమణులందఱు నాయభిప్రాయముతో నేకీభవింతురని నమ్మియున్నాను. ముందు జరిగింప వలసిన పని యొకటి యున్నది. ఆంధ్రదేశమున నున్న నాటకసంఘాధికారుల కందఱకు మన మొక్క యాజ్ఞాత్ర మంపవలసియున్నది. దానిలోని యంశము లిట్టుండవల యును.

‘‘మీరు మాభర్తలచే మీ నాటకములలో నాడువేసములను వేయించు చున్నారు.