Jump to content

పుట:SaakshiPartIII.djvu/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇదికాక, కప్పకూత నిత్యము కూయువానికిఁ గప్పకున్న గొంతు వంటి గొంతు రాకున్నను బురుషునికుండవలసిన తన గొంతులో మాత్రము కాసంతమార్పు కలుగక తప్పదు. ఆడుదానివలె జూడదలచి చూడఁ దలంచి పట్టుదలతోఁ బ్రయత్నించిన మగవాని కాడుదానిచూ వలవడకున్నను మగచూపులో మార్పుకల్గుట సిద్ధాంతము. ఆడుదాని కంఠరవము ననుకరింపఁదలఁచి విశాలమైన గంభీరమైన తన గొంతును సన్నపఱచుకొని కుదించుకొనిన మగవానికి సహజలలిత మధురమృదులమగు స్త్రీకంఠము రాకున్నను మగగొంతు చెడుట నిశ్చయము. అట్లేసిగ్గుపడిన యాడుదానిబుగ్గ యెఱుపులు, కంటి వ్రాలుటలు, తలయోరలు, మొగపుఁ దళుకులు, నొడలి ముడుపులు సంతతము ననుకరింపఁదలఁచి ప్రయత్నించిన మగవానికి లలనాజన సహజిలజ్ఞా సౌభాగ్య లీలాకలాపము పట్టుపడదు. కాని మగయొడలిపొంకములు థ్వస్తములగుట తప్పదు.

మనసే సర్వసృష్టికిఁ గారణమని పెద్దలనిన మాటలో సత్యము లేకపోలేదు. చూడవల యును జూడవలయున నని మనస్సు వాంఛించుట చేతనే కదా శరీరమునకుఁ గన్నులు కలిగినవి! తినవలయును తినవలయునవి సంతతవాంఛ కలుగటచేతనే కదా శరీరమునకు నోరు వచ్చినది! ప్రాతిపదికమగు జంతువున కివి యేమియు లేవుకదా! తరువాత మనస్సు లోని సంచలనములవలననే కదా దేహమున కవయవవైవిధ్యము కలిగినది. మనఃప్రవృత్తులు శరీరమందలి మార్పుల కెట్లు కారణములో, సంతతాభ్యాసమున దేహమునందు కలిగించు కొన్ని మార్పులు మనస్సులో మార్పుల నెందులకుఁ గలుగఁజేయఁగూడదు? నుదుట బూసికొన్న విభూతిరేఖ శివదర్శనమునకై బుద్దిపుట్టించు చున్నది. ఒడలిపై ధరించిన మల్లెదండ బోగమువీధికై మనస్సును లాగుచున్నది. యోగశాస్తానుసారము దేహమున కిన్ని ముద్రలు, నాసనలు, కఠినములగు గరిడీపద్దతులు నేల కలిగినవి? మనశ్చాంచల్యనివృత్తికే కదా! ఐహికతుచ్చ వాంఛాలంపటతను వీడి వైరాగ్య జ్ఞానసంపత్తిని మనన్సు గ్రహించుటకే కదా! దేహపరిణామ భేదములు చిత్తవృత్తులలో మార్పులు కలుగఁజేయకుండు నెడలం బాతంజల యోగశాస్త్ర మంతయు బారిశుద్ద్యసంఘమువారి బండితుక్కువలె బరశురామ ప్రీతి కర్దమేకాదా? దేహములోని మార్పులు మనన్సులో మార్పులు కలుగఁజేయక యెట్టుండ గలవు? తా నాడు దాననని యనుకొని యనుకొని, పరపాత్రచే నాడుదివలె సంబోధింపఁ జేసికొని, యూడుదాని పోడుములు తెచ్చిపెట్టుకొని, యాండుదానివలెఁ జూచి, మాటలాడి, తక్కి, తారి, యిగిలించి, త్రిప్పకొని యేడ్చిన మగవాని దేహములో సంతతాభ్యాసమువలనం గలిగిన మార్పు లాతని మనస్సులోఁ దదనుగుణములగు మార్పులను గలుగఁ జేయక తప్పదు. అందుచేత నాడుదాని మనస్తత్త్వ మాతనికి రాదుకాని మగవాని మనస్తత్త్వము మట్టిలోఁగలసినదనుట నిశ్చయము.

నాయనుభవములోనున్న యొకచిన్నయంశమును జెప్పెదను. నేనొకరోజున వీథిగు మ్మములో నిలువబడితిని. ఆవీథి నప్ప డొక్క స్త్రీపాత్రధారి బజాలులోఁ గొనినకూర లంగవస్త్రమున మూటగట్టు కొని యామూటఁ జేతితోఁ బట్టుకొని, యొడలిపైఁ జొక్కాలేకుండ గట్టుకొన్న బట్టతో మాత్రమే యింటికిఁ బోవుచుండెను. ఆతని నే నెఱుఁగుదును. ఆతడు జన్మమున నాడారివాఁడు కాని పది సంవత్సరములనుండి స్త్రీ పాత్రముల ధరించుచున్నాడు. ఇంతలో నాతని కెదురుగ నొక పెద్దమనుష్యుడు వచ్చుచుం