Jump to content

పుట:SaakshiPartIII.djvu/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నని బుద్ది పుట్టినది. కాని యారోసమును గష్టపడి శాంతిపఱచుకొని, పండ్లు గొఱుకుకొనుచు లోలోపల నెన్ని తిట్టయినఁ దిట్టుకొనుచుఁ గూరుచుంటిని. రంగమున నాభర్త యెట్లు నిలువఁబడెనో చెప్పనా? అయ్యయ్యో ఇంక నా భర్తయేమి? నాసవతియో నాయాఁడుబిడ్డయో యైన యాపురుష సువాసినీ స్వరూపము నిలువ బడినఠీవి యెట్టున్నదో చెప్పనా? ఎడమ చేయి నడుము మీఁదికి జారిపోయినది. కుడిచేత నిత్తడిచెంబు పట్టుకొని ప్రక్కనుండి పాఠము చెప్పవానివంక జూచుచున్నాఁడు. అప్పడు నా కాతం డెట్టుండినట్టుతోచెనో చెప్పనా? లెట్రీనులో నెవండో యుండుట చేత గుమ్మమువంకఁ జూచుచు నాతురతతోఁ గనిపెట్టు కొన్న వాడువలె నాకుఁ గానంబడినాండు. చీ! చీ! నడుముమీఁదఁ జేయివైచుకొన్న యెడల నాడుదాని ననుకరించిన ట్లే! బుగ్గమీఁద వ్రేలు పెట్టుకున్న యెడల నాఁడుదాని ననుకరించి నట్లేటే! పైట మాటమాటికి సవరించుకొన్నయెడల నాఁడుదాని ననుకరించినట్లేటే. వెఱ్ఱి వెఱ్ఱ ప్రక్కచూపులు చూచి ముసిముసి నవ్వులు నల్లి ముడుచుకొనిపోయినట్టయిన నాఁడుదియై పోయినట్టే! ఇంతయే యాతని యనుకరణము. కాంతల బాహ్యలక్షణములనే యనుక రింపలేని మగవా డింక నంతరంగలక్షణముల ననుకరింపగలడా? కల్గ నాటకర్తలే యాండువారిని జిత్రింపనెంచి మగతనముచెడిన మగవారిని సృష్టించుచున్నారే. అట్టిచో నాటకకర్తల మాటల ననుసరించి మిడుకవలసిన నటకులా యాడువారి ననుకరించుట? అసాధ్యము.

కాని, దమయంతి దమయంతియే యైపోయెననియు జంద్రమతిచంద్రమతిని గూడ దాటనదనియు బండితుల ప్రచురములకు లోపము లేదు. పాత్రధారుల బంగారుపతకము లకు లోపములేదు. మగవారు మగవారిని స్తుతింపక మానుదురా? ఏదీ జంఘాలశాస్త్రి యెందఱనో యధిక్షేపించినాఁడు కదా! కాంతల నధిక్షేపించుటలో నేమి, వారిచేఁ దిట్లు తినుటలో నేమి గట్టివాఁడేకదా! నిష్పక్షపాతముగ విమర్శింతు నని యనేక పర్యాయములు చెప్పిన యాతడు సైతము-మగవా డాడు వేసము వేసి జాతికంత కప్రతిష్ట తెచ్చుచున్నాఁ డన్న యంశమును విమర్శించినాడా? ఆతరడు మగవాడు. అట్లేలచేయును?

పక్షపాతన్వభావముచే బుద్దిపూర్వకముగ నాతండు విడిచిపెట్టిన యీయంశమును నేను విమర్శింపనెంచితిని. మగవాడు మగువ ననుకరింప లేఁడని నా సిద్దాంతము. అనుకరింపఁగలవాఁడైనను ననుకరింపలేని వాడైనను ననుకరించుటకుఁ బ్రయత్నించువా రెల్లజాతికి ద్రోహులని చెప్పకతప్పదు. అందులోఁ గొలఁదిగా ననుకరించవానికంటె బాగుగా ననుకరించువాఁడే జాతికిఁ బరమ ద్రోహి, మగతత్త్వము నాడుతత్త్వము నొక్కమందడినే యంటియున్నవైనను దానికి దీనికి నత్యంత భేదమున్నది. ఒకటి కఠినము, రెండవది మార్దవము. ఒకటి హేతుబద్దము, రెండవది రసస్థుతము. ఒకటి సంచలనము, రెండవది స్థిరము. ఒకటి బలీయము, రెండవది దుర్బలము. ఒకటి మలీమసము, రెండవది పరిశు ద్దము. ఇంకను మఱీ యెంతయోభేద మారెంటి కున్నది. ఈ రెండుతత్త్వములు నింత భిన్నములుగ సృష్టిలో నుండుట చేతనే స్త్రీపురుషుల కన్యోన్యాకర్షణము నన్యోన్యానురాగము లున్నవి. విజాతీయ విద్యుచ్చక్తి యుక్తములగు వస్తువుల కన్యోన్యాకర్షణము కాని సజాతీయ శక్తియుక్తమ్లులగు వానికిఁ బరిపూర్ణమైన ప్రాతికూల్యమేకదా! కావునఁ బురుషుడు. పొలఁతి ననుక రించునెడల నన్యోన్యానురాగము లిఁక ననుస్వారములు; సంసారములును చట్టుబండలు; బ్రతుకులు వ్యర్దములు.