Jump to content

పుట:SaakshiPartIII.djvu/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తుల కదికింపుగాజులతోఁ గండలపై జేరుబొందులవంటి నరములుబికిన మొఱకు కంఠమున గాజుపూసలతోఁ, జుట్టపొగచేఁ బొక్కి మాడి చచ్చిన పెదవులపై లత్తుకతో, గూటితీయుటచేఁ గాయలుగాచి గీఁతలుపడిన దౌడలపై బూడిదెతో, వేంకటేశ్వర పాదములపై దుమ్మకాయ గొలుసులతో, నాడుదాని తలకంటె సహజముగఁ బెద్దదైన తలపై సవరముల జవునుకూర్పుచే భయంకరముగ నగపడు రాకాసితలతో, రంగముమీద సంకర స్వరూపమున నవతరించిన యీ జగన్మోహినీ దేవతను జూడగ నార్యావర్తదేశమంతయు నొక్కపెట్టున నేడువ వలసియున్నట్లున్నదే తా నాడుదానిని బూర్తిగ ననుకరించినట్లు లోలోపల నుత్సాహమున నుబికి యుబికిపోవుచున్నాఁడు. కాఁబోలు! తానా? ఆడుదాని ననుకరించుటా? తనతరమా? సహజలావణ్యముగల యాడుదానిని గనులకు సూటిగ నొక్కజేనెడు చూచి టంగున (Tangeal) కు మఱలిన చూపుగల యాడుదానిని-నెగడు దిగుడుగ దరంగ ఫక్కిగఁ జూడఁగల యాడుదాని-నెగడు దిగుడుగ దరంగ ఫక్కిగ జూడఁగల యాడుఁదానినినింద్రధనుస్సు వలె లోకమునకంత నొక్కసారి మంగళపుటారతి నీయంగల యాడు దానిని పాము మెలికల జిగజిగలతో మెఱపు గప్పన మెఱసి చప్పన మాయమైనట్టు చూడఁగల యాడుదానిని దానా? అనుకరించుటా? మతి యుండియే యీపని చేయుచున్నాడా? పెదవులపై లక్ష చందమామల పండు వెన్నెలల కలకలతో గానబడవలసిన మందహాసమును బెదవులపై మాటుపఱచి దానిని గంటికొసలో నొక (Geometrical point) లోఁ గేంద్రీకరణ మొనర్చుట కొక్కనిజమైన యాడుదియే తగును కాని యీ కొజ్ఞాస్వరూపమే-అందులకుఁ దగుటే! చచ్చియాడుదియై పుట్టినప్పటిమాట కాని యిప్పటిమాటయా?

సోదరీమణులారా! ఇంత యసాధ్యకార్య మాతనివలవం గాదు, పోనిండు! ఆది నిలువబడినట్టయిన దాను నిలులవబడలేనప్పడు తన మొగము, తనమోర, యిఁక, ననుక రణ మెందులకు? చనవు, ప్రేమ, రవంతమోతాదుమించిన వాల్లభ్యము గనబఱుపవలసిన భర్త యెదుట నాడుది యెట్టు నిలువంబడునో, కాసంత మాత్రమే గౌరవము గానం బఱుపవలసిన పెద్దబావగారి యెదుట నెట్టు నిలువబడునో, యధికభయ గౌరవములు గనబఱుపవలసిన మామగారి యెదుట నెట్లు నిలువఁబడునో, యీ భేదములలో నొక్క భేదమైన దాను గనబఱుపగలఁడా? నా భర్త యీ నడుమ నాటకము లోనికి వెళ్లేదని చెప్పటచేఁ బొమ్మంటివి. 'నీ భర్తకీరాత్రి నాటకములలో వేసమున్న దని మాయింటిపొరు గమ్మలక్కలలో నొక్కతె నాచెవి నూడెను. నా భర్త వెడలిపోయిన కొంత సేపటికి నేను నాటకశాలకుఁ బోయితిని. అభిజ్ఞానశాకుంతలమున నాభర్త ప్రియంవద వేసము కాంబోలు వేసినాఁడు. కణ్వమున్యాశ్రమములోని మొక్కలకు నీళ్లుపోయుటకై శకుంతలతోఁగూడఁ జేతిలో నొకయిత్తడి చెంబును బుచ్చుకొని నా భర్త రంగమునకు వేంచేసినాఁడు. నేనప్పడు కొంతసేపు డిల్లపడి కొయ్యనైపోయితిని. నాకప్పడు మనస్సునఁ గోపమే కలిగెనో, రోఁతయే పుస్టెనో, నవ్వే కలిగెనో యేడుపే వచ్చెనో నే నేమియుఁ జెప్పఁజాలను. ఒక్కనిమున మట్టున్నపిమ్మట నాభర్త నిట్టిస్థితిలోఁ జూచుటకంటెఁ జచ్చిపోవుటయే మంచిదని ప్రపంచ వాంఛా నిస్పృహతను జెందితిని. అంతలో సున్నపు గుల్లపొంగువలె రోస మెక్కడ నుండియో గుబగుబలాడుచు నుబికి నన్నుఁ గంపితురాలిఁగఁ జేసెను. రంగస్థలమునకుబోయి యాతని యెదుటబడి నెత్తిపైనున్న సవరపుబుట్ట లాగి “నీకువచ్చిన యేండ్లెవనికి వచ్చినవి? నీ కీ దిక్కుమాలిన సంకరపువాలకమేల?" యని యాబుట్టతో నెత్తిపై నాల్గు వాయింపవలయు