యగును గావున మనము కన్నులు మూసికొనవలసి దని యభిప్రాయము కాబోలు! అరుంధతినాడో ఆదిశక్తినాడో కల్పింపబడిన యంద మాకారములేని యాప్రాంతయెుడ్డాణమే మనము ధరింపవలయును గాని నడుమునకుఁ బటకా పెట్టుకొనఁగూడదదట! ఈయధిక్షేపణములో హేతువున్నదా? నీతి యున్నదా? మనుష్యధర్మమైన యున్నదా? షరాయి తొడిగికొని చర్మపాదరక్షలు మనము ధరించినపుడు తానెంత వెకవెకలాడెనో మీ రెఱుఁగనిదా? అంత వెకవెక లెందులకు? అదేమి హానియా, అపకీర్తియా? తన్ను మన మెంతమాత్ర మనుకరింప గూడదంట! ఆ ప్రధాన రోగమునకు బాహ్యలక్షణములే యీతలయూపులు, నీవెకవెకలు, నీ సకిలింపులు, నీ కటకటలు, ఎన్ని నవ్వులు నవ్వినసరే యెన్ని యేడ్పు లేడ్చినసరే మనము మానదలఁచుకొన్నప్పడే కదా యాతండు విధిలేని వైరాగ్యమును వహించి యూరకుండినాఁడు. మనము సైకి లెక్కగూడదని సంఘమర్యాద, వ్యాకరణమునం గ్రియాపరిచ్చేదమునఁ బ్రథమసూత్రము వ్రాయుటకు దా నెవడు? ఇది మన వారి పంచమహా పాతకములలో నొక్కటా? ఏసుక్రీస్తువారి పది యాజ్ఞలలో నొక్కటా? ఇది కాక మన డబ్బిలోనిది ముక్కుపొడి, తనడబ్బిలోనిది శ్రీపాదరేణువునా? ముక్కు భగవంతుఁడు తనకే ఇచ్చినాఁడా? ఇంతతేగనీలు గెందైన న్నునదా? మనజేబులోనివి సిగరెట్టా? తన జేబులోనివి తులసికట్టలా? ఇంతకు నో సోదరీమణులారా! కారణము చెప్పియే యుంటని. ఆడుది మగవాని ననుకరించుటకంటె మగవానికి రోత వేఱొక్కటి లేదు. మన కుచితమైనదియు, నుపయోగకరమైనదియు, నర్హమైనదియు, నవసరమైనదియు మనము చేయుచున్నాము కాని తన్ననుకరించు నుద్దేశ మెంతమాత్రము మనకు లేదని తా నేల యెఱుంగడు? తా నెవరి ననుకరించి యిన్ని వేషములు తెచ్చుకొనినాఁడు? ఆమాత్రపు టూహ తనకేల యుండగూడదు? అతనికి మొదటినుండియు మనయోడల సదూహయే యున్న యెడల మనకిన్ని పాటులెందులకు? తనకిన్ని తిట్లెందులకు? మనము తన్నెంత మాత్ర మనుకరింపఁగూడదు. కాని తాను మనలఁ బూర్తిగా ననుకరింపవచ్చును గాఁబోలు! అది తప్పలేదు కాఁబోలు! అందులకు మన మాతని నేమియు ననఁగూడదు కాబోలు! నాటకములలో స్త్రీపాత్రములను ధరించి తాను మనల నేల యనుకరించుచున్నాఁడో చెవిపట్టుకొని జాకాయించి నిలువబెట్టి యేల యడుగరాదు? మంగురులు వింతయైన సొగసుగా నుండునని మన మీ చెంప నా చెంప నొక్క యంగుళముమాత్రపు వెడల్పున వెండ్రుకలు కత్తిరించుకొన్నప్పడు తానెంత యల్లరి పెట్టినాడో తలవెండ్రుకలు పూర్తిగా తీయించుకొనినట్టుగా నింటిపెంకు లెగిరిపోవున ట్లెంత హంగామా చేసినాఁడో అయూత డిప్పడు మీసములు పూర్తిగా గొరిగించుకొని సవరములు నెత్తికిఁ గట్టుకొని నాటకరంగమునఁబోఁతు పేరంటాలై నిలువంబడినప్పడు 'నీకిదియెవఁడుచెప్పినాడు రా! యని మన మాతని మూతిపై నేల యీడ్చికొట్టరాదు? కోటులాగున నుండునెడలం గ్రమ్ముదలకుఁ గ్రమ్ముదల, సొగసునకు సొగసుగా నుండునని రైకకు బొత్తాము లంటించి చేతులు రవంత పొడుగుచేసి ధరించి సహజమైన సిగ్గుతో నూత్నమైన శోభతో మనము ప్రకాశించుచుండ దన కన్నులలోఁ జీలలు కొట్టుకొనినాఁడే అవా డిప్పడు మనరైక తొడిగికొని దానిలో మఱేవో తగులఁబెట్టుకొని సిగ్గులేక, యుభయభ్రష్టత్వపుఁ బాడురూప ములతో రంగమున మగముతైదువై నిలువబడి మనల బరాభవించుచున్నప్ప డాతని నేమి చేసిననైనఁ బాపమున్నదా? కఱ్ఱపడి యొడలిపై నడ్డుకట్టుకోకతో, నడ్డుచీలల ముంజే
పుట:SaakshiPartIII.djvu/224
Appearance