పుట:SaakshiPartIII.djvu/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ యుపన్యాసము స్త్రీలకై యుద్దేశింపఁ బడినదైనను, దానిలోఁ బురుషులకుఁ బుంఖానుపుం ఖముగాఁ దిట్లుండుటవలనను, భర్తపై గోపమున వెల్లడించిన యభిప్రాయములకు భారతీయజాతి పరిశుద్దితో లంకె యుండుట వలనను దానిని స్త్రీపురుషులందఱు చదువలవల సినదని యెంచి భారతిలోఁ బ్రకటింపించితిని. అట్లు ప్రకటించుటకు మీ సెలవులేదని యెఱుఁగుదును. కాని మీ రెవ్వరో నే నెఱుఁగనప్పడు మీ సెలవు నొందకపోవుట లోపము కాకపోవచ్చును. అదికాక జాత్యుపద్రవ మేదో వచ్చినదని మీరు భావించుచు మహాందోళన మొందుచుండ నట్టి యాపత్కాలములో ననుజ్ఞ యక్కఱలేదని యనుకొనుట కూడ లోపము కాకపోవచ్చును. ఎటులైనను భారతీసేవకై సంకల్పింప బడినది భారతినే చేరినది.

అమ్మా! నీయుపన్యాసము నామూలాగ్రముగ బండిలోనే చదివితిని. అది నాల్గుభాగ ములుగా విభజింపబడినట్టు స్థూలదృష్టికిఁ గానబడుచున్నది. మొదటిభాగము మగవానికిఁ దిట్టు; రెండవ విభాగము మగవానికిఁ దిట్టు; మూడవవిభాగము మగవానికిఁ దిట్టు; నాల్గవ విభాగము మగవానికిఁ దిట్టు; మగవాడు వట్టి వ్యర్డుడని మీ యభివృద్దికిఁ బ్రతిబంధకారుడని, పరమశత్రుడని, ప్రత్యక్షమారకుడని, యాతనిఁ దృణీకరించి స్వప్రయత్నముననే మీ రిట్టిమహోన్నత దశకు వచ్చితిరని, మగవాని నేల నడఁచిత్రోక్కినను బాపములేదని మొదలగు ప్రారంభ శాపవాక్యములు మొదటి యధ్యాయమునందుఁ బ్రకాశించుచున్నవి. మీ బుద్దిచేత మీకర్ణములని యుపయోగ కరములని మీరెంచిన బాహ్యవేషములను ధరించుచు నభినవశోభావి రాజమానలై యార్యావర్తకల్యాణ దేవతలై యలరారు చుండంగ, బాహ్యవేషధార ణమునఁ దన్నేమో మీ రనుకరించుచున్నారని బ్రాంతిపడి మగవాఁడు మి మ్మెంతయో యల్లరిపెట్టినాఁ డను కోపమున మీ రాతనిని జెడమడ దిట్టినతిట్టు రెండవ యధ్యామున నేర్చిన రత్నాలవలె భాసిల్లుచున్నవి. మగవాఁడు కోక కట్టుకొని, కాటుక పెట్టుకొని, సవరపుబుట్ట నెత్తిని గట్టుకొని, బూడిద మొగమునఁ గొట్టుకొని కోడె పెయ్యయై రంగమున నవతరించి నందులకు కాతని కడ్డమైన. తిట్లు— మాయదారిచూపులు-మంగళపు టారతిచూ పులు-చూడలేకపోయెనని మఱిమఱితిట్లు–ఆడుది నిలువఁ బడినట్లు నిలువబడనైన లేకపోయినాఁడని నిలువెల్లఁ దిట్టు-మానినీ తత్త్వము ననుకరింపలేక పోయెను. గాని మగయొు డలి పొంకములు, మనస్తత్త్వము కూడ మన్ను చేసికొనినాడని-ఓ-హద్దుపద్దు లేనిత్తిట్టు -మూడవయధ్యాయమునఁ బ్రచండధాటీ పరిపాటితో విజృంభించుచున్నవి. సంకర రూపన మార్దనమున సంసారకృత్యమున కర్జుఁడు కాని యాతడా నాటకరంగమందే పడియుండి మగవాఁడు కాకుండ, నాడుది కాకుండ నేదో మధ్యమమార్ గగామియై దేహము చాలించు కొనక, సిగ్గులేక, యిల్లుచేరి, తగుదునమ్మా యని తనవంటి మందభాగ్యుల నింక నవతరించ పజేయుటకుఁ బ్రయత్నించుచున్నాండని, దేశద్రోహియని, జాతి ద్రోహియని తిట్టినతిట్టు -హరిహరీ!- తురీయాధ్యాయమున నప్రతిహతములై యనిర్వర్ట్యము లైయున్నవి. వేదోచ్చారణమును వదలి చతుర్ముఖుఁ డగు బ్రహ్మదేవుడు తిట్టకు లంకించుకొన్నయెడల నింతకంటె నెక్కువ తిట్టలేఁడేమో యనుసందేహమును గలుగఁజేసితివి. ఈనాలు గధ్యాయములలో నాలుగు వర్ణములవారికి, నాలుగాశ్రమముల వారికి, నాలుగు యుగములవారికిఁ దలమున్కలైన తిట్లు ప్రసాదించితివి; తల్లీ శాపాలాపశారదావ తారమవు!

వెఱ్ఱితిట్టకు విమర్శన మేమున్నది? స్వరమగునెడల గాంధారమా మధ్యమమా