పుట:SaakshiPartIII.djvu/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని యాహా! ఏమిదుర్గమ్మ! దూపాటి సీమనుండి వచ్చినవాఁ డొకఁడు. నల్లమల నుండి వచ్చినవాడొకఁడు. కోనసీమనుండ వచ్చినవాఁ డొకడు. పలనాటిసీమనుండి వచ్చినవాఁ డొకఁడు. ఇందలలో యతిథులై రాగా, వారి కందఱకు బహు పరిశుభ్రముగా వండి భర్తకుపెట్టి సిద్దపఱచి యుంచిన యాకులలో వడ్డించి, వారు సంతుష్టిగ భుజించిన తరువాతఁ దాను భుజించును. ఇట్లొక్కదినమా? ఒక్కమాసమా? ఒక్క సంవత్సరమా? ఆడుదాని పరిపూర్ణ సహాయ్యము లేకుండ బ్రహ్మదేవుడైన నన్నప్రదాన మాచరింపలేఁడు. అన్నప్రదాన పుణ్యమంతయు నంగనదే!

ఇంక నీ యతిథులకు సాయంకాలమున మూడుగంట లగుటతోడనే-అనపుగాయదినములలో తంపటవైచిన యనుప గుగ్గిళ్లు, లేజోన్న కంకులదినములలో నూచబియ్యము. మొక్కజొన్న పొత్తుల కాలములో మొక్కజొన్నపొత్తులు. ఇట్లు ఏయే కాలములలో నేది వచ్చునో యది యల్పాహారముగా వారియెదుటఁ బెట్టి తాను చేగునపమంత గంటము చేతఁ బుచ్చుకొని, తాటియాకులపై భాగవతమో, హరివంశమో, మతే దియో యా సుబ్బరాజుగారు వ్రాసికొనుచుండును. ఇట్టాతం డెన్ని గ్రంథములో వ్రాసినాఁడు. కవీశ్వరు లాతనికిఁ గన్నుల గట్టినట్టుందురు. తిక్కన సోమయాజియాఱడు గుల పొడవగువాఁడని గ్రద్దముక్కుకల వాడని నడుము కట్టులో జురకత్తి కలవాఁడని, కాలిన మొక్కజీడిపప్ప రంగువాఁడని యాతండా యతిథులతోఁ జెప్పచుండును. చేతిలోనున్న యనుపపప్పుముందుం గథలోనున్న కాలిన మొక్క జీడిపప్పెక్కువ రుచింపకుండుటచేఁ గాఁబోలు వారామాటలను గణింపకుండెడివారు. తిక్కన సోమయాజిగా రిట్టుండెనని మీకెట్లు తెలిసినదని యాయన నెవ్వరు నడుగలేదు. అడిగిన యెడలఁ గారణ మాయనకు మాత్ర మేమి తెలియును? అట్టాయనకుఁ దోచుటయే కారణము, పింగళి సూరన్నగారికి ముందుదంతములలో నొకటి పొడుగని, యొకటి పొట్టియని చెప్పను. ఆయనకు ఆలాగునఁ గనబడుచుండంగ నెవరు కాదనఁగలరు? ఒకనాడు తాను తనభార్యయు బండుకొని యుండఁగాఁ దాను 'దుర్గా పోతరాజుగా రెట్లుందురని నీయభిప్రాయ"మని యామె నడిగెను. ఈప్రశ్నయామె కెందులకో బోధపడదు. 'పొడుగుగాను, సన్నముగాను నుందు రని నే ననుకొందు" నని యామె బదులుచెప్పెను. భర్త యడిగిన నడుగును కాక భార్య కీప్రత్యుత్తర మెందులకో యంతకంటె బోధపడదు. “అలాగునం గాదుసుమీ, పొట్టిగా నుండును. తగుమాత్రమైన బొజ్ఞ కలిగి యుండును,’" అని భర్త బదులు చెప్పెను. ఔనని, కాదని, భార్యా భర్తలిట్టోక్కనిముసము సంభాషించుకొన్నమీదట భర్త-'నేనన్న మాటయే నిజమగునెడల-నదిగో-గోడబల్ల మీదఁ బెట్టిన మద్దెల యున్నదే అది గణగణ మ్రోఁగును' అనుసరి కేదైన యెలుక దానిని గదల్చెనో మఱేమైన జరిగెనో తెలియదు. కాని, మద్దెల గణగణ మ్రోగెను. అంత నాఁతడు మహానందమున లేచి మద్దెలను గ్రిందిగి దింపి దానికిఁ బూజ లొనర్చి, పోతరాజుగారి మద్దెల యని దానికిఁ బేరిడి, పోతరాజుగారి గజేంద్రమోక్షాది గాథలలోని పద్యములన్నియుఁ గీర్తనముగాఁ బాడుకొనుచు మద్దెల వాయించుకొనుచుం డెను. ఇది జరిగి యిరువదేండ్డు దాఁటినది. అల్పాహారకాలమునందీకథ యతిథులకుఁ బ్రతిదినమును చెప్పను. అట్టు కొంతసేపు చెప్పి