పుట:SaakshiPartIII.djvu/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:-

నాయనలారా! నేఁ డుపన్యాసము లేదు. ఎవరో యొక కవి సాక్షిసంఘములోఁ జదువుటకొఱ కొకకథను వ్రాసిపంపెను. దానిని చదివెదను. సావధానముగ వినఁగోరుచు న్నాను.

నక్కదోసకాయ యూరుగాయ, గోంగుకూర పచ్చడి, బఱ్ఱె పెరుఁగు అంతే. అంతకంటె నక్కడ నేమి దొరకును? అవే పంచభక్య పరమాన్నములు. ఇట్టునుదినము వేళపాళయని లేక కొర్నిపాటి సుబ్బరాజుగా రన్నప్రదాన మాచరించుచుండిరి. అన్నము జొన్న యన్నము. విస్తరి బొడ్డుమేడియాకు విస్తరి. ఉప్ప ఱాతియుప్పు. నీరు దిగుడుబావి నీరు. ఇప్పటి మాటయా? దాదాపుగా నూజెండ్లక్రిందటిమాట, ముప్పది సంవత్సరము లీబ్రాణుడన్నప్రదాన మొనర్చినాఁడు. మహానుభావుడు. నిర్గర్వుడు. నల్వురు మోయఁదగిన చొప్పమోపును తానే పొలమునుండి తలపై బెట్టుకొని తెచ్చి బల్లెలకు వేయును. వానిపాలు పాలికాపులచేఁ బిలికింపక తానే పితుకును. ఇంట నందఱి కాతని భార్యయే వంట చేయును. వంటలక్కలు కాని, నీళ్ల బ్రాహ్మణులు కాని వారి కెవ్వరును లేరు. ఉంచుకొనవలసిన యావశ్యకతయు వారికి లేదు. తమయింటిపని నొకరిచేఁ జేయిం చుట వారు తప్పుగ భావించు చుండెడివారు, పచనాదికృత్యములను బైవారిచేఁ గూలిపెట్టి చేయించిన యెడల నతిథిపూజాఫలము పరిపూర్ణముగ దమకు సిద్దింపదేమో యని వారికి భయము. పాలుమాలికలేక, యొడలు దాఁచుకొనక భూతసంతుష్టిచేయుటయే పుణ్యకార్య మని నమ్మి వా రట్లు చేసిరి.

మగనికిఁ దనకుఁ దవ్వెడుబియ్యము కుతకుతలాడించుటకే యీ కాలపు గుల కాంతల కోపికలేదు. దొడ్డిలో దాసి. వీథిగుమ్మములో సేవకుడు. ఇంటిలో వంటలక్క ఇంత పై బలగమున్నఁగానియాలు మగనికంటె నెక్కువలేని యిద్దఱకాపుర మీ దినములలోఁ గడతేదఱకుండ నున్నది. పంచపాళిలో నాదఱవైచినబట్టు భటునిపాలు. పెరటిలోఁ బాదఱ వైచిన తప్పెల దాసిపాలు. పడమటింటిలోని పప్ప నేయి సామాను బాపనక్కపాలు. అమ్మగారు పడకటింటిలో నౌరంగజేబు నవలను జదువుచు నావులింతల పాలు. అయ్యగా రణాబిల్లపై సంతకములతో నప్పులపాలు. ఇంతేకదా యిప్పటి సంసారముల సౌభాగ్యము! అతిథిపూజ లేదు. సరేకదా పతివిస్తరిలోఁ బచ్చడి మెదుకులయినఁ జేసి పెట్టినదేది? వంటప్రొయ్యి యొుద్దం గూరుచుండు నెడల మొగము మెరుగు కరగిపోవునప్పడు మగనిమెుగాననింక మొద్దులేగాని మఱియేమున్నది! ప్రాసయతి మంజరీద్విపదలో నుండవచ్చునో లేదో తెలియును గాని, పప్పుడికిన తరువాత నుప్పవేయవలయునో-యుడుకకముందు వేయవలయునో తెలియదు. ఉండలు జిల్లెడు కాయలు కాకుండ నత్తెసరు వేయగల యమ్మగా రన్నపూర్ణాదేవి గారు. వంటయింటిలోని ప్రాణాహతులతోను, బజారులోని కారపుబూసతోను గాపురము లెట్లో జరుగుచున్నవి. జరుగక మానునా? కాలచక్రము వెవరడ్దగలరు? ఆయువుండగా నెవరేమి చేయఁగలరు? మగల బ్రతుకులే యిట్లు దిగ నాలునప్పడు మఱదుల, బావల, యత్తల బ్రదుకు లడుగవలయునా?