Jump to content

పుట:SaakshiPartIII.djvu/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నారు. పిల్లలందరు దైవభక్తి గలవారు. మాతృపితృభక్తిగలవారు. ప్రజాహిత తత్పరులు. వినయవంతులు, వివేకులు, సత్ర్పవర్తనులు, ఇట్టియుత్తమ సంతాను మామె కాంచెను. ఆ కాంతాలలామ చేసికొన్న పూర్వమహా పుణ్యముచేత నిసత్సంతాన మామెకుఁ గలిగినదని చెప్పఁదగదు. పిల్లలు చేసికొన్న పూర్వజన్మ సుకృతముననే వీ రామెగర్భమునఁ బడుట సిద్దించెనని చెప్పఁదగినది.

ఎన్నినెలలు ప్రయాణమైనను సరే యన్నినెలలలోను, నన్ని పట్టణములలోను, నెప్పటి కేవస్తువు కావలయునో యని ముందుగ దెలిసికొని వాని నెచ్చటెచ్చట భద్రపఱుపవ లయునో భద్రపఱచి, యవసరానుసారముగ నుపయోగించి యొక్కవస్తువైనం బోకుండ నన్నియు నింటికిఁ దీసికొని రావలసినదే. ప్రయాణపు బెట్టెల నామెయే సర్దవలయు నని చెప్పదురు. ఎంతదూరదృష్టియో, యెంత వివేకమో, యెంతయవసరజ్ఞానమో, యెంతమేధా శక్తియో, యెంతభద్రప్రవర్తనమో చెప్పటకు నాకు శక్తి చాలదు. కోటలో, బొమ్మల మేడలో, నెడమవైపున, రెండవగదిలో కుడిగోడమీది గుండ్రనిగూటిలో నున్న యావస్తువును భద్ర పఱుపవలసిన దని జ్ఞాపకార్డముగా నిక్కడిదాసులకు రెండువేలమైళ్ల దూరముననుండి వ్రాయుట నెక్కడనైన వనియుండిరా? నేను వినలేదు. లక్షలకొలది రాబడి గల మహాసంసారపు భారమును భర్తకు లేశమైనఁ దగులకుండ నంతయుఁ దాను వహించి యవలీలగ నిర్వహించి పరమసుఖముగ బ్రవర్తించి వ్యవహారపుఁగాగితములు చూచుకొనుట, చదువుకొ నుట, సుఖముగ మిత్రులతో సంభాషించుట మాత్రమే భర్తకు వదలివైచి యాయనను నిర్విచారస్థితి నుంచిన యా యిల్గాలి ఘనతకు, నుదారతకుఁ బ్రేమకు హద్దున్నదా! ఆహా! పరాతత్పరుడా! ఎట్టియాత్మను సృష్టించితివోయి!

ఆమెయొద్ద నున్నసందడి కెన్నడైనఁ దెఱపియున్నదా! సంగీతములవారు, సాహిత్య ములవారు, పురాణములవారు, కవిత్వములవారు, నుపన్యాసములవారు, మంగళపుటూరతు లవారు, హాస్యసంభాషణలవారు, నగరులోఁ దనచుట్టునుండి గౌరవింపఁ బడుచుండ, పహరామీద బట్టలు తెచ్చినవారు, బంగారువస్తువులు చేసి తెచ్చినవారు, చేపలవారు, నడవి పందులవారు, పండ్లగంపలవారు, బట్టలుకుట్టువారు లోపలకిఁ బంపిన దాసులు లోనుండి వార్తలు వస్తువులు మోచికొని పోవుచు వచ్చుచుండ, నోహోహో కన్నులవైకుంఠము కదా! చూచి తీరవలసినదే-ప్రతిదినము పెంట్లియింటవలె నుండెడిదే. నిత్యకల్యాణమును పచ్చతోరణము కనబఱచినదే! దైవవశమునఁ బిల్లల కెప్పడైన జబ్బు చేసినను భర్తకు దెలిసినయెడల నాయన బెంగ పెట్టుకొను నని యెంచి సాధ్యమైనంతవఱకు రహస్యముగ నుంచెడివారు. తనసౌఖ్యము కొఱకు తా నొక్కపనియైనఁ చేసియుండ లేదని కంఠోక్తిగా బలుకఁగలను. Self అను తత్త్వమును బూర్తిగాఁ దుడిచి పాఱవైచినవ్యక్తి నెప్పడైన వింటిరా! ఇప్పడు విని పవిత్రత నొందుఁడు.

ఆమెకు మృతి యనంగ భయము లేశమైన లేదు సరికదా మహానందము కూడను. భర్తప్రోత్సాహముచేతను దొరసానుల తొందరవలనను operation చేయించు కొనవలసివచ్చి నప్పుడు బల్లమీఁదఁ బండుకొని, తన్నుఁ గోయ దెచ్చిన కత్తులవాడిని బరీక్షించి, యిది యెందులకది యెందుల కని యన్నిటి యుపయోగమును దెలిసికొని నవ్వుచు మత్తుమందు తీసికొన్న మానినీశిరోమణికి మరణభయ మున్నదా?-ఏదైన నవ్వుకున్న యెడల దోష