పుట:SaakshiPartIII.djvu/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మున్నయెడల దేవసన్ని ధానమునకుఁ బోవుటకు జంకుకాని, చంటిపిల్లవంటి నిష్కల్మషహృ దయ యగునామెకు జంకేమి?

ఈమెకంఠరవము మర్దళధ్వనితో సమమైనది. అదియే యీమెకు మహాదృష్ట లక్షణము. ఈమె మామగారిగొంతు మఱియొక విధముగా నుండెడిది. అది మందరధ్వనిలో మహాగంభీరమైనది. మాటలాడుచుండంగా నాయనధ్వని యెంతయో లావుగ నిండుగనున్న ట్టగపడుచుండెడిది. అది యాయన కదృష్టలక్షణము. అట్టికంఠధ్వని యిప్పటి యుత్తరాది మఠస్వాములవారి కున్నది కాని యీయిల్లాలిగొంతువంటిది నేను వినియుండలేదు.

తనకు రాఁబోవుమృతి నాఱుమాసములకుఁ బూర్వమే యీమె కనిపెప్టెను. ఎప్ప డది వచ్చునో జాముజాము గడియగడియా లెక్కపెట్టుకొనుచుఁ బాఠశాలను వదలి బాలిక యింటికిఁ బోవునట్టు మహోత్సాహమున నుండెను. ఆమె కన్యగ్రామములో మృతి సిద్దిం చెను. స్వగ్రామమునుండి వెడల బోవునప్పడామె మామగారి నిల్వువిగ్రహమునకు మోకాళ్ల నమస్కరించి యిట్టు మనవిచేసెను. 'మీవంశమును కొల్చునవకాశము నా కింక లేదు, మీపూర్వులవలన మీవలన వంశమునకుఁ గలిగిన గౌరవమును నేను జెడగొట్టలే దనుటకు నాయంత రాత్మ సాక్షి -మీ నిశ్శరీరాత్మ సాక్షి. పరమాత్మ సాక్షి. నాకు సెలవు. నమస్కా రము." అటుపిమ్మటఁ గొన్ని విష్ణుపటముల యొద్దకుఁ బోయి వానికి నమస్కరించి యిట్టు పలికెను. ‘నాకుఁ బరమేశ్వరునియందు దృష్టి నిలుకడగా నుండుటకు మీరు కొంత సాయము చేసినారు. ఇంక నేను బరమాత్మయొద్దకే పోవుచున్నాను. నాకు సెలవిండు." తరువాత దోట లోనికిఁ బోయి తాను పెంచినపూలచెట్టనన్నింటిని జూచి, స్పృశించి పుష్పముల ద్రుంపకుండ నాఫ్రూణించి "మిమ్మింక జూడను. మీకు నాకు ఋణము తీఱినది" యని పలికి, జయపరమేశ్వరా! యని యుత్సాహమునఁ బోయి తనకుటుంబముతో రైలైక్కెను.

ఆమె యిప్పడు వైకుంఠమున లక్ష్మీసన్నిధానమున నున్నది. అట్టి యత్యుత్తమురా లింతకాలము జీవించియుంటయే దుర్లభము. ఆంధ్రదేశమున నామెకొఱ కీప్పటి కేడ్చుచున్నారు. ఆమెకుఁ బునర్జన్మము లేదు. శాశ్వతమ హానందము నామె రమాసన్నిధి ననుభవించు చున్నది. కొందఱు స్త్రీ లామెను దేవతార్చనలో మహాలక్ష్మితో పాటు పూజచేసి కొనుచున్నారు.

విద్యాధర స్త్రీ లేమో మాటలాడుకొను చున్నారని చెప్పితిని కాదా! ఒకతె రెండవదా నితో నిట్లనెను. 'ఒక మహారాజు ధర్మపత్నియట. అత్యుత్తమురాఁట. మంచి వయస్సులో బవిత్రాగ్ని స్పర్శమువలన దేహము చాలించినదట. ఆమె మహాలక్ష్మీసన్ని ధానమున సావిత్రితో పాటు గౌరవింపఁ బడుచున్నది. హంసయాన మెక్కి యామె యుత్తర ద్వారము నొద్దకు రాగానే యప్పర స్త్రీలామెకు మంగళపుటారతులిచ్చిరి. కల్పవృక్షము జల్లునఁ బూవులామెపై గురిసెను. అమ్మా! అమ్మా! యని కామధేను నానందమున నఱచెను. అరుంధతీదేవి యామెతలపై గరముంచి యేదియో చదివెను. తనలో గలుపుకొనున ట్గామెను మహాలక్ష్మి కౌగిలించుకొనెను. నీ కప్పడు చూచుభాగ్యము లేక పోయెను. ఆమె పూర్వజన్మమున నొక్క మహాతపశ్శాలి యట. మోక్షమునకై తపస్సుచేయఁగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై యిఁక రెండుజన్మము లెత్తినఁ గాని వీలులేదని పలికెను. తపస్సునకు దిరుగ