దరిద్రకాంత లైన సరే, యెంతరోఁతగలుగు స్వరూప స్వభావాదులు గలవారైన సరే యెంతయో దయతో లాలించి, బుజ్జగించి, యాదరించి, ప్రేమించి, బహూకరించి తిరిగి రమ్మని పంపివేయును దారస్వభావ మామె యందుఁ దక్క నే నెక్కడ జూడలేదు. ఈ కాంతాశిరోమణి తనకు బరులకు దత్త్వమున నెంతమాత్రము భేదము లేదని త్రికరణశుద్దిగ నమ్మినయిల్లాలు. అట్టి పరమార్ద దృష్టిచే నామెకుఁ గలిగిన యీవినయ మామెను బరమపూజ్య రాలిగ జేసెను.
గీ. ఇతఁడు నాశత్రు డితని శిక్షింతు ననుచు
నతని నడఁచి త్రోక్కెడునాత డధమతముడు
అందఱకు నేను దాసుడ ననుచు శిరము
నవనతము చేయునాతడే యధికతముడు.
అని బుద్దుడు చెప్పిన నీతి నాచరణమునఁ జూపిన జ్ఞానవతి.
ఇంక గారుణ్యమును గూర్చి చెప్పెదను. దాదాపుఁగా నిరుది యేడు సంవత్సరముల నుండి యెన్ని వందలకుటుంబములకు గుప్తదానము చేసి పోషించెనో యెవరు చెప్పఁగలరు? చడువులకు గొందఱకు, భోజనములకుఁ గొందఱకు పుస్తకములకుఁ గొందఱకు, బట్టలకుఁ గొందఱకు, పత్రికానిర్వహణమునకుఁ గొందఱకుఁ, గవితా ప్రోత్సాహమునకై కొందఱకు, నిత్యభుక్తికై కొందఱకు, నలంకారములకై కొందఱకు, బుద్దిలేక పాడైనవారి కింతటినుండి బుద్ది కలుగుటకై కొందఱకు, పరీక్షాబహుమానములకై కొందఱకు-తెఱపిలేని యీవి, తెంపులేని యీవి, మెప్పకోరని యీవి, త్రికరణశుద్దియైన యీవి, ప్రచ్చన్నమైన యీవి, కృతజ్ఞతాలేశమైన నపేక్షింపయివి, పరమాత్మ ప్రీతికరమైన యీవి మనుష్యస్వరూప దేవతాకాంతయైన యీమెహస్తముననున్నది. ఎవరిమట్టునకు వారు నామీఁత నున్నదయ యామహాలక్ష్మికి మeకి యెవ్వరిమీఁతను లేదని నిశ్చయముగా నమ్మి యామెను బ్రేమించు చుండిరి. ఇట్టిభ్రమను గలిగించు ననురాగవైచిత్ర్యము శ్రీరామచంద్రమూర్తి హృదయమున నుండెను.
విద్య, జ్ఞాపకశక్తి మొదలగువానిఁగూర్చి చెప్పెదను. ఈమెకు మూఁడుభాషలలో నసాధారణపాండిత్య ముండెను. ఆంధ్రసంస్కృత భాషాగ్రంథముల లెక్కయేమి? మహాగ్రం థాలయములం దున్నయన్ని యాంగ్లగ్రంథము లీమె చదివినారు. చదివిన దంతయు జ్ఞప్తిలో నున్నది. ఈమె బుద్ది యేకసంత గ్రాహిత్వము కలది. వీరికుటుంబము పశ్చిమఖండప్రయా ణము చేసినప్ప డీమె యాంగ్లేయ భాషాధోరణి, యాంగ్లేయ భాషాజ్ఞానమును గాంచి యచ్చటి గొప్పగొప్ప విద్యావతులాశ్చర్య మంది యీమెను గౌరవించిరి. ఆంధ్రభాషలో నమ్బత ప్రాయమై, ధారాశుద్ది యైనకవిత్వ మీమె చెప్పఁగలిగియుండెను. ఈమె కవితా చాకచక్య మెట్టిదో విమర్శన ప్రాగల్ప్యమట్టిది. కథాసంవిధానము నుందుగాని పూర్వోత్తరసం దర్భమునందుఁగాని, వాగ్వ్యవహారము లందుఁగాని యవలీలగ దోషము కనిపెట్టిదిద్దగలమ హానైపుణ్య మీమెకున్నది. ఈమె స్త్రీలసభలలో నెన్నిసారులో యుపన్యాసము లిచ్చి యుండెను. శారదాదేవివలె నుపన్యసింపగల విశాదరత యీమెకుఁ గలదు. ఇదికాక వీణావాద నమందు నేర్పరి. తనకుగల్గిన యిద్దఱు మగపిల్లలను, నల్గురాడుపిల్లలను మూడు భాషలందుదనవలెఁ బాండిత్యము గలవారిగను, వీణావాదనమందు శక్తిగలవారిగను జేసి