ఆడినది యాట, పాడినది పాట, పలికినది పలుకు, చేసినది చేఁత, ముట్టినది ముత్యము, పట్టినది బంగారము-ఇట్టు లిరువదియేడు సంవత్సరము లఖండ విజయముతో జరిగినది. ఆమె సంసార మెట్టు జరుపుకొనెనో ప్రతి కాంతయేకాక, ప్రతిపురుషుఁడు గూడ తెలిసికొన వలసినదే. మనుష్య లోకమునకంతకు నాదర్శప్రాయమైన యీమెవర్తనముఁ దెలిసికొనుటవలన దోషశమన మగును. పూర్వమహాపతివ్రతల కథలందువలె నీ మెచరితమునందు దావానలభక ణములు, సూర్యగ్రహనిరోధనములు, మృతసంజీవన శక్తులు మొదలగు నమానుషప్రజ్ఞలు లేవు. ఆకాల పరిస్థితులబట్టి యాసన్నివేశములు సిద్దించినవి. ఈకాలమున నవి యేమియు గలుగవు. ఇప్పడు సర్వసాధారణముగా సర్వసంసారములందు జరుగు సన్నివేశములలోఁ బతివ్రతయైన గృహిణి యెట్టు ప్రవర్తింపవలయునో యాపాఠమును దేశమునకు శాశ్వతముగా నేర్పిన యామహాపతివ్రత కనేక నమస్కారము లర్పించి మఱి చెప్పెదను.
సతికిఁ బ్రథమగణ్యమైన గుణము పత్యనురాగము. ఇదియే పునాదిగ సంసారభవన మంతయు నిర్మింప బడుచున్నది. ఇది యెంత బింకముగా నుండునో భవన మంత నిలుకడ కలదై యుండును. దీనితత్త్వ మెట్టిదో రవంత పరిశీలింతము. భర్త పలికిన పలుకుల బట్టి, యిచ్చిన యీవిని బట్టి, చేసిన చేష్టనుబట్టి, చూపిన గౌరవమును బట్టి భార్యయనురాగ మూసరవెల్లితలవలె గ్రిందికి మీదకి నూగులాడు చుండును. అట్టి హెచ్చుతగ్గులు పత్యను రాగమున నెప్పడు భార్యకుఁ గలిగినవో యది యనురాగము కాదని భావింప వలసియున్నది. భార్యకు బతిని జూచిన మొదటి దినమున నెట్టియనురాగ ముండువో యట్టియను రాగమే విష్ణు దూతను జూచువల్ కుండవలయును. ఇట్టి యనురాగము కేవలము నిశ్చలమైనది. దీనికి హెచ్చుతగ్గులుండుట కవకాశము లేనేలేదు. తనకొఱకుఁ దా నెప్పడు భర్తను బ్రేమించునో యప్ప డాయనురాగ మను రాగము కాదు. భర్తకొజకే భర్తను ప్రేమించు పడతిమాత్రమే పత్యనురాగము కలది. పతివ్రత యని కొనియాడఁదగినది. అనగా నైహిక వాంఛాశూన్యమైన యనురాగము పత్యనురాగము. దేశమందున్న స్త్రీలందఱుఁ గూడ నిట్టియనురాగము నాకు నాభర్తపై నున్నదా యని ప్రశ్నించు కొనఁగ యథార్డ మేదియో తెలియును. నే నెఱిగినంతవఱ కొక్కయినాయిల్లాలి పత్యనురాగమే యట్టు నిశ్చలమైనది. సూర్యకాంతికి హెచ్చుతగ్గు లున్నవి; చంద్రతేజమునకు వృద్దిక్షయము లున్నవి; సముద్ర మునకుఁ బోటుపాటు లున్నవి. కాని, యీమె యనురాగమునకు హెచ్చుతగ్గులు లేవు. మొదటితత్త్వ మైనయూకాశ మెట్టు మార్పు లేనిదో యీమె యనురాగ మట్టిది. నీ కెట్లు తెలియు నందురా-నే నద్బుతశక్తులను సంపాదించిన దానను గాన మీరు విశ్వసింపవల యును. పదునెనిమిదధ్యాయములలో భగవంతుఁడు బోధించినయానసక్తియోగ మీమె సర్వ సౌఖ్యసంపూర్ణమైన సంసారమునఁ బ్రత్యక్షముగ నాచరణ మందుఁ జూపించిరి. స్త్రీ కిదియే మోకమునకు మొదటిమె ట్టని గ్రహింపవలసినది.
ఇంక మఱియొక సుగుణమును గూర్చి చెప్పెదను. పతివ్రతలు సాధారణముగా గర్వభూయిష్ణులై యుందురు. కాని బీదలపాలిటి కల్పవల్లియైన యీమహాలక్ష్మీకి గర్వ మనునది గంధగంధలేశమైన లేదు. ‘‘గీ. వినయ కారుణ్యబుద్ది వివేకలక, గాదిగుణముల కాటపట్టయినవాని" అని ప్రహ్లాదునిఁగూర్చి పోతరాజుగారు చెప్పినారు. సర్వశుభ గుణము లలో వినయ ముత్తమమైనది. అట్టిగుణ మీమెకుఁ గలదు. ఎంతబీదపిల్లలైన సరే, యెంత