పుట:SaakshiPartIII.djvu/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గట్టిగ నొక్కగ నామె క్రిందబడి చచ్చెను. తండ్రికి మతిపోయి యున్నదని వంక కల్పించుకొని తండ్రినిఁ గ్రిందబడద్రోచి గొంతుకపై ద్రౌక్కి తలగడ క్రిందనున్న నోట్టకట్టను దీసికొనుచుండెను. ఇంతలో నాడుపిల్లల యేడుపువిని దొడ్డిలోనున్న రెండవకొడుకు వచ్చి నాకు లేకుండ నీవే యంతసామ్మును దీసికొందు వాయని చేతిలోఁ జెంబు దీసికొని యన్నగారి నెత్తిపై గొట్టఁగ నాతండు చచ్చెను. అంతలోఁ గ్రిందనున్న తండ్రి లేచి నాసామ్మ నీవు పట్టుకొని పోవుదువా యని రెండవ కొడుకు గొంతు గట్టిగాఁ బట్టుకొనెను. తనప్రాణము రక్షించు కొనుటకు దిరుగ నాకొడుకు తండ్రిగొంత పిసికెను. ఇద్ద ఆక్కడనే చచ్చిపడిరి. తల్లి యిదివఱకే చచ్చెను. ఆడుపిల్లలిద్దఱు మాత్రము నిల్చిరి. చేతగవ్వలేనప్పడున్న కష్ట మీకుటుంబ మనుభవించినది. లక్షలున్నప్పటికి కష్టము ననుభవించినది. సుఖసాధనములు లేకున్నను గష్టమే, మిగుల హెచ్చైనను గష్టమే.

అమిత మనుచు నభావంబు ననుచు రెండు
కష్టదశ లెప్డ సుఖము ప్రక్కలనె యుండు
నడుమను సుఖార్జి యూగక నడవవలయుఁ
దాటిబద్దపై నేటిని దాటినట్లు.

ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః