పుట:SaakshiPartIII.djvu/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తనకున్న ధనముచేతనే ప్రజ లిట్టు తన్ను గౌరవించు చున్నారనియు, తన్నిదివఱ కనేక విధముల బాధలు పెట్టిన జనసంఘము నీతిజాతి మాలినదనియు, నీ బ్రాహ్మణుఁడు గ్రహింపలేదా! కష్టవిద్యాశాలలో గడితేఱినయాతం డామాత్రమైన గ్రహింపలేదా? తాను జావునకు సిద్దమైనప్పడు తనభార్యకుఁ గొడుకులకు దయ లేకపోయిన దని ప్రత్యకముగ వెఱంగినవాఁడు సభాధ్యకుల కర్పూరమాలలకుఁ, గవుల చంపకమాలలకుఁ గట్టువడునా?

ధనవిషయమై మనుజుని కున్న ససి యింత యంతయునా? అందులో దానిని గూర్చి న్యాయవాదికున్న పసి చెప్పదరమా? ముగ్గురు న్యాయవాదులు వారిలో వారు సంప్రతించు కొని ధనసందర్భములం దీకుటుంబమున కింకఁ గలుగదగిన కలహములను నివారణచేసి వారిని బాగుచేయుటకై వచ్చితి మని వీరి యింటికి వచ్చిరి. కిట్టినివా రింకొకరీతిగా ననుకొనిరి. అది గణింపఁదగినది కాదు. ఒక్క న్యాయవాదియే యనేకాస్థానములను దిబ్బలు చేసియుండ ముగ్గురు న్యాయవాదు లీబ్రాహ్మణుని సొత్తునేమి చేయలేకుందురు? ఒక న్యాయవాది తండ్రినీ జీలదీసినాఁడు-ఒక డొకసోదరుని పక్ష మైనాడు-మఱియొకఁడు మఱియొక సోదరున జేబులో నిముడ్చు కొన్నాడు. మీకుఁ గల్గిన యాస్తి న్యాయవాదుల యాస్తివలె కేవలము స్వార్జితమనియు, నది పంపకమునకు రారాదనియుఁ జల్లనిమాట బ్రాహ్మణునితో న్యాయవాది చెప్పఁగ నాతం డదివఱకే కొడుకలుపైఁ గోపమున్నవాఁడు కావునఁ జేటంత మొగము చేసికొని నాయనా! నాపంతము గెలిపింపుమని న్యాయవాదిని బతిమాలెను. 'అద్దే అవలీలగ గెలిపింతును. ఒక్క చిల్లిగవ్వ కొడుకులకీయ వలదు. ఏమి చేయఁగలరో చూతము. మీరాపట్టు మీఁదనే నిలువబడుడు. నాతమాషా చూపింతు"నని న్యాయవాది మీసములు దువ్వుచు జెప్పెను. మిగిలిన యిద్దఱు న్యాయవాదులు సోదరులతో నేమి మాట్లాడిరో తెలియదు. కాని వారు తండ్రియొద్దకు వచ్చి మనకున్న సాత్తును బంచుకొందమని తండ్రికి బోధించిరి. ఆతడు కఠినముగ నిరాకరించెను. ఈసంగతి యెఱుంగక 'నీవు నీ కొడుకులు పంచుకొన్నయెడల నడుమ నేను నాకూఁతులు చెడిపోవలసి నదా? వారి శుభకార్యములకు నా బ్రతుకు తెరువునకుఁ గావలసినంత సామ్ము ముందుగా వేఱుచేసి మిగిలియున్నదే పంచు కొన వలయును." అని భార్య భర్తతోఁ జెప్పెను. “నీకూతుల కేమి యిచ్చినను వారు తమ భర్తలకు గలుపుదురు. నీకేమి యిచ్చినను నీవు పుట్టినింటివారికిఁ జేర్తువు. కొడుకుల కేమి యిచ్చినను వారీకాసుల గోతములన్నియు గోడండ్రనెత్తి కెత్తెదరు. ఇదియంతయు నాకష్టార్జితమే. నే నొకరి కీయను. పొ"మ్మని భర్త బదులుచెప్పెను. ఈ సంగతి యేమియుఁ దెలియక లాటరీసామ్మంతయు దాను దనకూతులు హరింపఁ బ్రయత్నించుచున్నారని తల్లిపై గొడుకులు చెలరేగి కొట్టుటకు సిద్దమైరి. ఇంతలోఁ గర్మముచాలక యత్తగారు వచ్చినది. తనకు విషము పెట్టుటకుఁ బుట్టినింటనుండి భార్య తనతల్లిని బిలిపించిన దని బ్రాహ్మణుఁడు నిశ్చయ పఱచుకొనెను. ఆమె కీసంగతియేమియు దెలియక చనవుచే నల్లుని యొద్దకుఁ బోయి, “నాయనా! నీభాగ్యమునకు మూలాధారమును నేను. నేనా సొమ్ముతీసికొని వచ్చి నీచేత లాటరీవేయించుటచేత మనపుణ్య మాయని యింత మాహలక్ష్మి మనయిల్లు చేరినది. అందుచేత నీవు నాకెంత యిచ్చినను ఋణము తీర్చుకొనలేవు" అని పరిహాసముగ బలికెను. అత్త నల్గడుమాదిగ మంచము క్రిందఁ గొట్టఁగ భార్య యడ్డుకొనెను. భార్యను మెడఁబట్టిగెంటఁగ నామె గోడమీదబడి మూర్చపడియెను. అత్తగారు పెద్ద గోలచేయగఁ బెద్దకొడుకువచ్చి ముసలిదాని గొంతు