పుట:SaakshiPartIII.djvu/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకృతినన్ని భోవోమువంకబోయి కష్టమైనది. అమితత్వమువంకఁ బోయి కష్టమైనది. అందుచేత సుఖము, బాధ యనునవి వస్తుతత్త్వమున నొక్కటే యని స్పష్టపడుటలేదా? బుద్ధభగవానుఁ డేమి సెలవిచ్చినాఁడు?

గీ. ఉభయదిశల గష్ట ముండు సౌఖ్యమునకు
నదియె నడుమ జేరి యగును సుఖము
బాధ సుఖము నొకటి వస్తతత్త్వమునను
గతినిబట్టి భేదకలన కలిగె.

ఉభయమధ్య సుఖావస్థనే The golden mean అని పాశ్చాత్యులభినందించినారు. ప్రకృతి సత్యము సృష్టిసంబధమైన Economy తో సంబంధించి యుండవచ్చును. తక్కువవ స్తుసామగ్రితో నెక్కువజన మెక్కువసౌఖ్య మొందుటకంటె కావలసినదేమి?

నాయనలారా! నేనిదివఱకుఁ జెప్పినయంశములను మీ మనస్సులకుఁ బట్టఁజేయఁగల యొకచిన్నకథను జెప్పెదను. కథయనుటచే అది యసత్యమని యెంచకుఁడు. అది సత్యగాథయే.

ఒకమూర నొక బీదకుటుంబము. దానిలో భార్య, భర్త, ఇద్దఱు కొడుకులు, నిద్దఱుకూఁతులు. భార్యాభర్తలు నడికాలమున నున్నవారె కాని వృద్దులు కారు. వారి పెద్దకొడుకునకు 18 సంll ములు వయస్సుండును కాని తరువాతీపుత్రునకు 16, మొదటికూఁతునకు 14, రెండవ కూఁతురునకుఁ బండ్రెండుండును. మగపిల్ల లిద్దఱకు మెడలలో జందెములున్నవి. కాని యవి పొరుగూర వేయఁబడిన దొంగజందెములు. 14 సంవత్సరముల పిల్లవివాహము కాకుండ రజస్వల యగుటచే వారికుటుంబ మొక్కసంవత్సర మునుండి బహిష్కరింపబడియున్నది. ఎవ్వరును వారి యింటికి రారు. వా రెవ్వరింటికిని బోరు. తిండిలేక మలమలమాడి పోవుచుండిరి. బహిష్కృతునకు ముష్టిమాత్రము పెట్టువారె వ్వరు? పైయూరికిఁ బోవుదమనన నడచిపోవుటకు శక్తిలేదు. బండియెక్కుటకు పైసలేదు. దినమున నొక్కపూఁట తిన్నను నార్గుఱకు భోజ్యము కావలయును గదా! అరసోలెడు నూక లింటియొద్దలేవు కదా! ఎట్టు కుటుంబము జీవింపవలసినది? దంపతులు శ్రీరామనామస్మ రణ చేసికొనుచు గూరుచుండుటతక్క నంతకంటె నేమి చేయలేరు. మగపిల్ల లిద్దఱు పైయూళ్లకుబోయి కూలినాలి చేసికొనివచ్చి తల్లిదండ్రులను బోషింపరాదా? వారిల్లు కదలువారుకారు. పౌరుషవంతులు. ఇంక బ్రదుకు టెట్టు? మగపిల్లలకు జదువులేదు వారు పరమమూర్ఖులు. అందుచేత వారి తల్లిదండ్రులొక్క పని జేసిరి. రాత్రి యెనిమిదిగంటలకుఁ దండ్రి పదునాలుగేండ్ల కూఁతును, దల్లి పండ్రెండేడ్ల కూఁతును దీసికొని చెఱికి యొక కుండ చేంతబుచ్చుకొని ముసుగులువైచికొని రూపములు దాచివైచికొని సందెబిచ్చ మెత్తు కొని రాత్రి పదిగంటల కింటికి వచ్చి యాయన్నమును కొడుకులకుఁ బెట్టి తాము దినుచుండెడివారు. ఈసంగతి యెవ్వరికిని దెలియదు. ఇట్లు జరుగుచుండ నొకరాత్రి వేఱువేఱు కుండలలోనున్న యన్నము నొక్కచోట నుంచుచుండఁగాఁ దనకుండలో నొక బంగారు గాజుపిల్లల తల్లికిఁ గనఁబడెను పాపము! ఏసంసారిణియో తనకుండలో నన్నమువేసి నప్ప డాగాజు జాఱిపడెనని యామె యూహించు కొనెను. కాని యెవరిదని యెవరి కీయంగలరు? ఎందఱు సంసారిణు లామెకుండలో నన్నమువైచిరో ఎవరి గాజో కాని నాయొద్ద