పుట:SaakshiPartIII.djvu/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధ్యస్థితిలో నున్నవారిబ్రతుకు సుఖవంతమని చెప్పవచ్చునని దీనివలనఁ దేలుచున్నది కాదా? మొదట కవి చెప్పినదానికిని నేవేదాంతి చెప్పినదానికిని నెంత యేతము పెట్టుగా నున్నదో చూచితిరా! ఈరెండు బోధనములకు తేజస్తిమిర న్యాయ మున్నట్టగపడుటలేదా? వీనిలో నేది సత్యమో రవంత పరిశీలింతమా? సదానందయోగి పాడిన తత్త్వమును గూర్చి యిప్పడు చెప్పదును.

వర్షములు లేకపోయినయెడల పంటలు లేవు. అతివర్షములైనందిరుగ పంటలు లేవు. జీర్ణక్తి తగ్గిపోయినయెడల మనుజునకుఁ గష్టము. అతి జీర్ణశక్తి గలుగుటకూడ నట్టికష్టమే. అనఁగ మందాగ్ని యెట్టికష్టమో అత్యగ్ని యట్టికష్టమే. రక్తపుపోటు మనుజునకుఁ గొంతసహ జముగ నుండవలయును. అది మిక్కిలి తగ్గిన శరీరము నిలువదు. మిక్కిలి హెచ్చినను శరీరము నిలువదు. జనునితనువుగాక 98.4 బదులు 98 ఉండినను జావే; 107 ఉండినను జావే. గాలి హెచ్చనుగూడదు, తగ్గనుకూడదు. రక్తములో నీరు హెచ్చనుగూడదు. తగ్గనుగూడదు. ప్రకృతిస్థితి మధ్యమార్గమున నడచుచున్నంతసేపే మనుజునకు సుఖము.

ఇదివఱకు మనము బాహ్యప్రకృతినే పరిశీలించినాము. బాహ్యప్రకృతికంటె బహువిచి త్రమైన యత్యద్బుతమైన యువర్ధ్యమైన యాంతరప్రకృతి మనుజునకు లేదా? ఇంతవఱకు మనము విచారించినది శరీరసుఖమేకాదా? మనస్సుఖము మాత్రము సుఖముకాదా? అందువ లన మనస్తత్త్వముగూడ బరిశీలింప వలసియున్నది. ఈతత్త్వమునుగూర్చి జంఘాలశాస్త్రీ తన యుపన్యాసములలో మిగుల విపులముగఁ జెప్పినాఁడు. నేనుచెప్పట హాస్యాస్పదముగ నుండును. కాని బాహ్యప్రకృతి కెట్టి సూత్రములున్నవో ఆంతర ప్రకృతికిగూడ నవియే సూత్రములు. బొత్తిగ లేకపోవుట, అత్యంత మెక్కువయగుట, బాహ్యప్రకృతిలో గష్టములై నట్టే యాంతరప్రకృతిలోగూడ నవియే కష్టములు. బాహ్యప్రకృతిలో మధ్యావస్థ యెట్టిసు ఖమో, ఆంతర ప్రకృతిలో గూడ నదియే సుఖము. ప్రేమతత్త్వ మేమనస్సున లేదో యామ నస్సు పశుమనస్సుకంటె నధమ మైనది. అత్యంత కష్టనిష్ణురమైనది. అమిత మగు ప్రేమ (ఐహికము) యెవనికుండునో వాఁడు పామరుఁడై బానిసయై తుచ్చుఁడై సంతత దుఃఖమప రంపరచేతఁ జచ్చుట యంతకంటె మేలన్నట్లుండును. ఒకనియందు లేశము నమ్మకములేనివాఁడు పొందుబాధ యాకాశమువోలె హద్దులేనిది. అత్యంతము నమ్మకము గల్గినవాఁ డందఱకాళులధూళి తలయందుంచు కొనుచు నష్టకష్టముల బడచు నేడ్చినయే డుపు అనంతమై యుండును. విద్య బొత్తిగలేనివాఁడు, తినున దన్నమని చెప్పవచ్చునా? అమితమైన విద్య గలవాఁడుగూడ దినునది గడ్డియే. ఎందువలన? చదువు కొననియప్పడు మనస్సులో నున్న జ్ఞానము మిక్కిలి చదువుకొనిన తరువాత ముక్కలై కాలి బూడిదయై యెగిరిపోయినది. బ్రహ్మరంధ్రము మొదలు పాదాంగుష్టమువఆకు నిప్పడున్న వన్నియు సందేహములే. అన్నియు నన్యోన్యవ్యత్యస్తములైనవే. ఏఏదియు మనస్సునకెంత మాత్రము పట్టనిదే. బొత్తిగా సత్యములేనివాని నూరివారు రాతివిసరులతో కఱ్ఱదెబ్బలతో వెఱ్ఱికుక్కను గొట్టినట్లు గొట్టుదురు. అత్యంత సత్యనియమమున్నవాఁ డాముష్మికసుఖమును దరువాత బొందుఁగాక! ఇచ్చట మాత్రము బంధువిరోధియై, ప్రజాశత్రువై పడవలసినబాధ లన్నియుఁ బడును. ఉభయమధ్యావస్థయందే మనుజజాతికి సర్వ ప్రపంచమునకు సౌఖ్యమున్నది. అందు చేత సుఖము, బాధ యనునవి ప్రకృతిస్థితులుగాని స్వతంత్రత్త్వములు గావు. ఒక్క