Jump to content

పుట:SaakshiPartIII.djvu/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాతోఁ జిన్నతనమున నొకబాలుఁడు చదువుకొనెను. మాకుగ్రుడ్డి గోపాలశాస్త్రి యన్న యాతండు గురువు. ఆయన కొక్కగది, ఒక్కభార్య, ఒక్కకొడుకు, ఒక్కచొక్కా, ఒక్కకన్ను నెలతప్పడయనంగా నేమి యని మా గరువు నా సహపాఠిని బ్రశ్నించెను. నెలతప్పట యనంగా క్షౌరమని యాతండు ప్రత్యుత్తరమిచ్చెను. మాగురువుగారు కోపా విష్ణుండై యాతని కొక్క లెంపకాయ సంకల్పించి చేయియెత్తెను. గురువుగారొంటకన్ను వారగుటచేత నామిత్రునికిఁ దగులవలసినదెబ్బ నాకుఁ దగిలెను. పంతులుగారూ! నన్ను గొట్టనారేమయ్యా యనినే నేడ్వంగ, నిట్టి బుద్దిహీనునితోఁగూడఁ జదువుకొను దోషము నీది కావునఁ గొట్టితి నని గ్రుడ్డితనమును సమర్ధించుకొనెను. ఇట్టి బుద్దిహీనునికిఁ బాఠముఁ జెప్పిన మీమాట యేమని నే నంటిని, తరువాత నామిత్రుని బుజ్జగించి నెలతప్పట యనంగా క్షౌరమని యేలచెప్పితి వని నేను, గురువుగారుగూడ నడుగ, మా మామ్మ నెల కొక్కమాఱు కౌరము చేయించుకొనుటచే నే నట్టు చెప్పితినని యాతండు నిఘంటుకారునివలె శబ్దమునకు వ్యుత్పత్యర్ధముచెప్పెను. తరువాత నామిత్రుడు బి.ఎల్. పరీక్షలోఁ గృతార్డుఁడై జిల్లాకో ర్ధులో వకీలుగాఁ జేరినాఁడు. శ్రీరామరక్ష, శ్రీరామరక్ష, పైస బోణిలేదు. పట్టాసొమ్ము కట్టువేళ పాత్రసమాను తాకట్టు. మరియొకవృత్తి చేసేకొనవయ్యా యని నే నెన్నివిధముల జెప్పినను నీ కెందులకు, చూడవోయి నేనొక్కవెల్గు వెల్గక తప్పనోయియని నన్ను నిరాకరించుచు వచ్చినాడు. చిట్టచివరకు మూఁడు పుట్టకఱ్ఱతో అబ్బాసల్లిగడ్డమీద “ఆఖరు' వెల్లువెలిఁగినాడు. బ్రతికియున్నన్నాళ్లు పదునాల్గు బ్రతుకులకు సరిపోయినయే డుపు లేడ్చి ప్రాణావసాన సమయమునకు భగవత్కాటాక్షము గలిగి బాగుపడితిమని చెప్పిన సత్పురుషులందఱు వెలిగిన వెలుగుకూడ రవంతకంటె నెక్కువది కాదు.

ఇంతకుఁ జెప్పనదేమనఁగా సుఖపడుటకు మొండివాఁడైనఁ గావలయును, వేదాం తియైనఁ గావలయును. అటులైన, నీతి తీసివేసి యావలఁబెట్టుము. ఇంక న్యాయమంతయు గోదావరిలోఁ గలుపుము. సిగ్గుమాలిన తనమా! రా! అన్యాయమా! రా! అసత్యమా! రా! స్వార్దమా! రా! మొండితనమా! రా! పాపమా! రా! నా సౌఖ్యమునకే మిమ్మాహ్వానించుచు న్నాను.

ఏమిది? ఇట్లు జరుగఁదగినదేనా? దారుణముగ నున్నదికాదా? ఇది పరమార్ధమని నమ్మకుఁడు. ఇట్టి తుచ్చప్రవర్తనమునకు రాజశాసనమే యంగీకరింపదు గదా. భగవచ్చాసన మెట్టుంగీకరించును?

అది యిప్పటి కాలాగున నుండనిండు. సోదరులారా! మీరీతత్త్యమును వింటిరా.

పాట
వినరా సదానందయోగీ! నీవు విననేర్తువని విన్నవింతు బైరాగీl వినరాll
ధనము లేకున్న దుఃఖమురా-చాలధనము కల్గినదాని దాఁపదుఃఖమురాll వినరాll
ఆలు లేకున్న దుఃఖమురా-చాల నాండ్రు గల్గినవారి నడప దుఃఖమురాil వినరాll
బిడ్డ లేకున్న దుఃఖమురా-చాల బిడ్డలు గల్గిన పెంచ దుఃఖమురాll వినరాll

ఈజ్ఞాని పాడినతత్త్వమెట్టున్నదో వింటిరా? ప్రపంచసుఖసాధనములగు ధనసంతానాదిక వస్తుసామగ్రి బొత్తిగ లేకపోవుట యెట్టికష్టమో యని విశేషముగ నుండుట యట్టికష్టమే.