Jump to content

పుట:SaakshiPartIII.djvu/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరుగులిడుచుండం గ్రిందనుబడియుం గెరలి
మొండిత్రోపుగ ముందుకుఁ బోవువాఁడు
తన్నొకడు గొట్టం బదుగురు దాను మంచి
చెట్టఁగాంచ కెవ్వరినైనఁ గొట్టువాఁడు
నేడ్చుచునె పెండ్లివిం దారగించువాఁడు
స్వార్థమే పరమార్ధమై యలరువాఁడు
బ్రదుకఁదగినవాఁ డీప్రపంచమందు
సౌఖ్యవజ్జీవు లిద్దతే జగతియందు
మొండియొకఁడు వేదాంతియొకండుసుమ్ము
నడిమివారల బ్రదుకు వినాశకరము
గడియగడియకు మృతికంటె ఘనతరంబు.

కవి చెప్పినయినామాటలు బాగున్నవా? సుఖాపేక్షకు లందఱు Rowides కమ్మని యుపదేశించినడే. ప్రపంచమున వేదాంతులెంద ఱుందురు? ఒక్కచేతివ్రేళ్లయిన నన్నియు వంగవే మిగిలినవారందఱు మొండితన మవలంబింప వలసినదేనా? ఏమో! ప్రపంచతత్త్వమదియే యేమో, యెవరు చెప్పఁగలరు? సరియైన ప్రవర్తనకు న్యాయమైన ఫలమెవ్వరికైనఁ గలిగినదా? కలుగుచున్నదా? బిన్ మిల్లా యని కట్టబుచ్చుకొని లేవలేనిబక్కపాదూషాకు నల్గురు భార్యలు, పణ్యకాంత కొసరునా? నీతిసత్యసంరక్షణకై శపథముచేసికొన్న యేకప త్నీవ్రతుండైన ప్రభుశిఖామణికిఁ బడుచుదనములో భార్యవియోగమా! ఏమియిది!

సీ. సత్యసంధులు కష్టచయముల మున్లుటో
దొంగ లుప్పొంగుచుఁ ద్రుళ్ళిపడుటొ
తలగొఱగించు కోదాతకు లేకుంటో
కృపణుఁడు లక్ష్మీసమృద్ది గనుబొ
విద్వాంసు లుదరముల్ వెన్నంటి యేడ్చుటో
మూడులపొట్టలు పొణక లగుటొ

గీ. త్వత్పదారాధకులు ముష్టిదాసరయ్య
లగుట్! నాస్తికుల్ వారల మొగములందు
నుమియుటయొ! యేమి యిది! కన్నులున్నవె! మతి
యున్నదే యుంటివే చేయుచున్న దిదియె!

న్యాయవర్తనమునకు న్యాయఫలము గలుగపోవు నిట్టి మార్మెలి, యిట్టి వెలితి, యిట్టి తోరట సృష్టిలోనే యున్నదేమో. సత్యపాలకుఁడౌ హరిశ్చంద్రుఁడు భ్రష్టరాజ్యం డగుటా, శ్మశానవాసి యగుటా, భార్యావిక్రయసాహసి యగుటా, మృతపుత్రు డగుటా. ఆహా! ఏమి ప్రపంచధర్మము! పితృవాక్యపరిపాలకుఁడగు రామచంద్రుఁడు నాలచీరధారియగుటా, కందమూలాశి యగుటా, భ్రష్టరా ఫ్రుండగుటా హరిహరీ! అపహృతదారుఁ డగుటా, చీ! ఇంతకంటె నేమి వ్యత్యస్తఫలముండును? చిట్టచివఱకు వారు మహాసౌఖ్యాన్వితులు కాలేదా? పట్టాభిషిక్తులై భగవత్తుల్యులై ప్రభాభాసురులై వెలిఁగిపొలేదా? యనియందురా? వారు సంవత్సరములకొలఁది పడరానిపాటులు పడి చివఱకు వెలిఁగిన వెలుగిదియేనా?