నీవులోకులవలె బామరుఁడవు కావు. గుడుగుడుగుంచము లాడుచు లొడితెడగు బాహ్యప్ర కృతిలో మిడుకువాఁడవు కావు. నీవు జగత్పూజ్యడవు లోకాతీతుడవు. ఐహికపుదేవులాట నీకేమియులేదు. ఏదిపోయినను నీయానందము నీ జన్మధనమైయున్నది. పంచభూతములు స్వస్వరూపములతో నీకుఁ బ్రత్యక్ష ములగుదురు గదా! ముక్కోటిదేవతలు కింకరులవలె నీ చుట్టుచుట్టు తిరుగుచుందురు గదా! అప్సరస్త్ర్సీల యాటపాటలతో మైమఱచి యుందు వుగదా!
కాలేన పంచత్వమితేషు కృత్స్నతో
లోకేషు పాలేషు చ సర్వజంతుషు
తమస్తదాసీర్గహనం గభీరం
అన్తస్యపారేభి విరాజతే విభుః"
అని వ్యాసుఁ డన్నట్టు,
క. లోకంబులు లోకేశులు
లోకస్టులు దెగినపిదప నలోకంబగు పెం
జీఁకటికవ్వల సతతము
నేకాకృతి వెల్గునతని నే సేవింతున్.
అని పోతరాజుగారు జెప్పినట్లు 'ఏకాకృతి వెల్గునతని" నీవెప్పడు సేవింతువు. నీ కింక మోక్షమున కడ్డేమి? కవికందని, భక్తునికందని, జ్ఞానికందని యాపదవిని నీవు సులభముగా..............
ఎవఁడురా అక్కడ డాక్టరుగారు వచ్చుచున్నారు. పో ఆవలికిబో అని పెద్దకేక లోనుండి వినఁ బడినది. వెంటనే పిచ్చివానిని విడిచి పోయితిని.
ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః