పుట:SaakshiPartIII.djvu/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పైకిఁ బొమ్మ-నీకొఱ కెంత యాందోళన మందుదురో నీవు లేకుంటచే నీ భవన మెంత గగ్లోలై పోవునో నీవు వినోదముగఁ దెలిసికోవచ్చును. ఒకవేళ సేవకులు నిన్ను గొరడాతీసి కొని కొట్టుట సిద్దించునెడల ప్రజలు ప్రభువును నిరాకరించి తామే పరిపాలించుకొన ప్రయత్నించుట ప్రస్తుత కాలానుగుణమైన పరిస్థితి యని భావించి సాధ్యమైనంతవఆకు నీభటులతోఁ బోరాడుము. మనుజుని కాటునకు మందు లేకపోవుటచే నీవు వారిని కఱచుట కంటె నుపాయం లేదు. ఇక వా రెప్పడు నీజోలికి రారు. కాంతా ప్రశంసలో గరవెంత సుఖదాయకమో కలహ ప్రయత్నములో నది యంతదుఃఖ దాయకము. ఇదిగో రవంతసేపు చదువుమాని పూర్వసంగతి చెప్పదును.

వలదు వలదని నేను మందలించినను నాతడు మానక యిట్టు చెప్పెను. దంతక్షత నఖక్షతసంప్రదాయము మన శాస్త్రములోనిది. నేనొకనాడు చిన్నతనములో బైనరసపు బసందేదో పరిశీలింతమని పడుచు దాసియింటికి బోయితిని. అచ్చట గుమ్మములో వేంచేసియున్న వేశ్యా మాతను జూచి సాష్ట్రాంగ మాచరించి -

పదము.
చేతిలోనిగజ్జ యూతోయి నా దేవి
నడుముచుట్టు గోనెపాత
మాతలందఱలోను మాతోయినారాణి
అడ్డునడకను గారుపీత.

అని ధ్యానించినది. ఆమె ప్రసన్నురాలై సరసానికి వచ్చితివా తండ్రీ! ఏదీ చేతిలో నొకకాసు పడవేయవోయి యని సెలవిచ్చినది. అది నాయొద్ద లేదంటని. పోనీలే. అందఱు నీయఁగలుగువారే యుందురా' అని" ప్రక్కచీకటికొట్టులో మంచముమీద నామనుమరాలు పండుకొన్నది. అది సరిక్రొత్త కుఱ్ఱది. మొన్నను సూర్యగ్రహణము నందు మంచి బింకమైన పట్టులో నది వెళ్లబడినది. అది భయమున నటునిటు పాఱికిపోకుండ గట్టిగఁ గౌఁగలించుకొని సుఖపడు బాబా' యని నన్ను బ్రేమమున హెచ్చరించెను. అంత గదిలోనికిఁ బోయి గట్టిగా గౌగలించుకొంటిని. బొయ్యిమని యఱచి నులకమంచముమీఁది కుక్క నాగొంతుక పట్టుకొనెను. ఏడ్చుచు గిజగిజ కొట్టుకొనుచుండగా చీచీయని యఱచుచు, వేశ్యమాత లోనికి వచ్చి కుక్కను గొట్టదలచి కాబోలు నావీపుపై గఱ్ఱపుచ్చుకొని కొట్టెను, పెద్దగోలయయ్యేను. చుట్టుపట్టులవారు లేచివచ్చి కుక్కను విడపించి నేను దొంగనని నన్ను బట్టుకొని కొట్టిరి. వేశ్యమాత పాతచీరగుడ్డ ఆరణాలు విలువగలదానిని హరించుటకు వచ్చినానని నాపై నేరము మోపిరి. మైత్రిలోను కరువు మంచిదే, వైరములోను కరువు మంచిదే యని చెప్పితినే అది యిది, ఎట్టయిననేమి, అప్పటినుండి యాడు దనంగా గడగడ. భూశయనము.

సరే గొప్ప ప్రయోజకుడవే. కాని యిక సోదె కట్టిపెట్టి మరణ శాసనమను జదువుమని నే నంటిని. ఇదివఱ కెన్నిసూత్రములు చెప్పితినని యాతఁ డడుగఁగా రెండు చెప్పితివి.

3. సరేమూడవ సూత్రము-నీతత్త్వమేదో యెఱుంగక నిన్నులోకులు గేలిసేయు దురు. నీతత్త్వ మేదో నీకుగూడ బాగుగాఁ దెలియదు. కావున నేను జెప్పదను.