Jump to content

పుట:SaakshiPartIII.djvu/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మట్టియే. కార్యము మట్టియే. కార్యకారణ భేదమింక నెక్కడిది? ఇదే అద్వైతమునకుఁ బ్రాతిపదిక, ఉన్నదొక్కటి. కార్య మదియే కారణము నదియే. 'కాశీతలవాసినీ గంగా” అదే ప్రశ్నము నదేయుత్తరము కాదా? ఈ సందర్భమున మాకవిత్వము చిత్తగించినావా? ‘‘ ఏ యక్షరము మొదలింగ్లీషుభాషకు" అదే ప్రశ్న అదే యుత్తరము కాదా?

"నాకీ దిక్కుమాలిన సోదె యెందులకు? నేను బోయెదను" అని వసారాలోనికి వచ్చుసరికి నన్ను బావాబావా యని యెవ్వరో పిలిచినారు. అదరిపడి ప్రక్కనుజూడగ నాగదిలో నొకపిచ్చిది యున్నది, నీవు మాబావతో నేమిమాటలాడుచున్నావని గట్టిగ నన్ను గద్దించెను. అంతలోఁ బిచ్చివాఁడు నెత్తినోరుకొట్టుకొని నన్ను లోనికి రమ్మని సంజ్ఞచేసెను. ఇది యేమో యని పోయితిని. అప్పడు నన్నాతఁడు ' గట్టిగ మాటలాడకు నన్ను బావా యని పిలిచినదే మృత్యుదేవత. ఇది నన్నను దినము నాహ్వానించుచున్నది. ఇంక దేహము చాలింపక తప్పదని నిశ్చయ పలుచుకొని యీమరణ శాసనము వ్రాసితిని. నేను జదివెదను ఆగుము" అని యాతండు నన్ను బతిమాలెను. సరే చదువుమని నేనంటిని.

ఈశరీర మికఁ బదునైదు సంవత్సరముల కంటె నెక్కువకాలము నిల్చునది కాదని నిశ్చయించి నాలోకానుభవమంతయుఁ బ్రజకు బోధింపవలెనని దీనిని వ్రాసినాను. నే నశాశ్వతుడను. ప్రజలు కూడ నశాశ్వతులే. గురుం డశాశ్వతుడు. శిష్యు డశాశ్వతుఁడైన ప్పడే ప్రయత్న మెందులకని యధిక్షేపము కలదు. బోధిం పదలచిన జ్ఞానము శాశ్వతము కావున నే నట్టు చేయవలసి వచ్చినది.

1. మొదటిసూత్రము:- ఎవ్వడైన నీకుఁ బిచ్చి యని యన్న యెడల నట్టు నిన్నన్న వానికేపిచ్చియని నిశ్చయింపుము. నిన్ను వెఱ్ఱవైద్యశాలయందుంచుటకు వారు యత్నింపఁగ బోవుచుంటినని యెంచవలయును. వారెవ్వరైన నిన్ను జూడవచ్చిన యెడల వారి తెలివితక్కు వమాటలు, బుద్దిహీన చేష్టలు చూచి వినోదించి వారు పొందుచున్న దుర్గతి నీకు లేకుండా నిన్ను భగవంతుడు రక్షించినాఁడని యెంచుము. నీకున్న ప్రపంచజ్ఞానము నప్పడప్ప డుపన్యాసముల మూలమున వారికివెల్లడింపుము. నీవిట్టు జ్ఞానబోధము చేయుచుండినగాని ప్రపంచోద్దరణము దుర్ఘటము.

2. రెండవసూత్రము:- నీవు మహాసంపన్నుఁడవు. మహారాజవు. నీ కోటలోని సేవకులందఱు నీ కుపచారములు చేయుటకు నియమింపఁబడినవారే. నీ గదినూడ్చుటకు వచ్చిన సేవకుఁడు. నిన్ను మోసపుచ్చి యేదియో పట్టుకొని పోవునని యెంచుము. సౌఖశాయనికుఁడైన, యారోగ్యమును గను గొనుట నుదయముననే వచ్చిన వైద్యసేవకుడు నీయందలి యసూయచే నిన్నున్మత్తుని జేయుటకు వచ్చిననాఁడని నమ్ముము, వాడిచ్చిన మందును దీసికొనకము. గొంతుకలోఁ బోసినను దానిని దాచి వాడటునిటు చూచునప్పడు గుడ్డతో మూతు తుడుచుకొన్నట్టు నటించు యాగుడ్డలోఁ జప్పడు కాకుండ నుమి యుము. నీకాహారము దెచ్చిన భృత్యుడు సమయమును జూచి నీకు విషము పెట్టి నీరము దెచ్చిన భృత్యుఁడు సమయమును జూచి నీకు విషము పెట్టి నీ సంపదను హరించుటకు వచ్చినట్టు నిశ్చయింపుము. సందిగ్రవస్తువని నీకుఁ దోఁచిన దానిని వానినోటఁ బెట్టుము. లేకున్నయెడల నాహారమును విసర్జింపుము. ఎవ్వడైన నిన్ను నీభవన పుటావరణములో గాలికై భటుఁడు వినయపూర్వకముగఁ ద్రిప్పినయెడలఁ జమత్కారమునఁ గనుమొఱఁగి