పుట:SaakshiPartIII.djvu/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుపేక్షించుచున్నారు? రోగముతోనే కాని చావఁ గూడదా? భార్యకు విపరీతమైన.జబ్బు. భర్తయే రేయంబవళ్ళామె కుపచారము చేయుచుండెను. నిద్రహారములు లేక మొద్దువంటి భర్త చచ్చినాడు. చావునకు సిద్దమైన యిల్లాలు భర్తసాపిండపుగారెలతొ సంపూర్ణమైన సాపాటు. కొడుకునకు వెఱ్ఱికుక్క కఱచినది. తండ్రి టారున జచ్చినాడు. ఆత్మావైపుత్రనా మాసి యున్నది నిదర్శనమైకదా. నామాల సుద్దపట్టు మూత్రబంధమునకు మిగుల దురా కట్టు. వడహల సంప్రదాయము పురుషులలోఁ బదఖండనము, స్త్రీలలో శిరోముండనము. మండన మిశ్రుని భార్యతో వాదించుటకు శంకరాచార్యులకుఁ బరకాయప్రవేశము కావలసివ చ్చినది. కాని ఏది? మన మక్కడ నుండినయెడలఁ దమాషా కనఁబఱచి యుందుము. అడుదనంగా మనకు నల్లేరుమీఁద బండిగాదఁటోయి! ఓ గిరగిరగిరగిర గంపసిడి యాడిన ట్లాడనంటోయి.

ఏడ్చినట్లేయున్నది. ఈదిక్కుమాలిన గొడవయంతయు నెందులకు? మరణశాస నము "చదువుదువా" పోవుదునా యని కఠినముగా నడిగితిని.

అటులైన విను ఖరః ఓం ఖరఃఓం

అదేమి అదేమి ఖరఃఓం అనెదవేమి. అని నేను మొత్తుకొంటిని.

ఉండవోయి తొందరపడకు. 'శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవ దనం థ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే' యను విష్ణు బోధకమైన యీశ్లోకమును గాడిదెపరముగా నన్వయించిన వారెవ్వరో యెఱుఁగుదువా? మాగురువుగారు. గాడిదా! నీవును గవివిగావుగదా యన్నవాఁడు కవియేనా? అందుచేతఁ గవికి గాడిదకు నవినాభావసంబంధము న్నదని తేలుచున్నది. గాడిదె కావైపున విష్ణువుతో సంబంధమున్నది. ఈవైపునఁ గవితో సంబంధమున్నది. అందుచేత సృష్టికి మూలతత్త్వము గాడిదయే యని నిశ్చయింపక తప్పనట్టగపడుచున్నది. కావున హరిః ఓం అని ప్రారంభంచేయకుండ బరమార్ధజ్ఞానము గల నేను 'ఖరః ఓం' షని ప్రారంభించితిని? బుద్దుని కింత ఖ్యాతి యేల కలిగెను? అతని కాలమందున్న వేదాచారములను ఖండించుటచేత. అప్డే చిరకాల ప్రారంభపద్దతిని ఖండించి క్రొత్త త్రోవ సహేతుకముగాఁ ద్రొక్కినందులకుఁ గూడన యందువా లేదా? వితంతువివా హమున కున్న వైభవము, జనాకర్షణము పూర్వానారవివాహమునకు లేదు. బాపనకోమ టులు, మాలమాదిగ, చచ్చట జంగాలు కలసిచేసిన విందులో నున్న తేజస్సు పరిపాటిగ జరుగుచున్న యన్న సంతర్పణలో లేదు. ఎందుచేత పద్దతికి విరోధమగుటచేత, పద్దతి నియోగమనంగా నెఱుఁగుదువా? గోపరాజు రాముఁడు ప్రధానిగారు “చాలులే అంతటితోఁ గట్టిపెట్టుము. నీ వీనడుమ నింత బుద్దిహీనముగ మాటలాడలేదు. ఇంత క్రమశూన్యముగ మాటలాడుచుంటి వేల? ఇంతలో నిట్టు చెడుటకుఁ గారణమేమి?" అని నే నంటిని.

కారణ మెందులకోయి fool! కార్యమునకుఁ గారణ మెంతమాత్రమక్కఱలేదు తెలిసినదా? ప్రపంచసిద్దికంటె నెక్కువ కార్యము లేదు గదా! దీనికిఁ గారణమున్నదా? లేదు అంతవఱ కక్కఱలేదు. కుండయున్నది. దీనికిఁ గారణమున్దా? లేదు. మట్టియే కారణమందువా? మట్టికి కుండకు భేదమేమున్నది? " అదియేమి కుమ్మరివాఁడు ప్రధానకారణము కాదా యని" యడిగితిని. ఓరి fool కుమ్మరివాడు మాత్రము మట్టి కాదంటోయి! Dust thou art to dust returnest” అన్నమాట నెమరనకు దెచ్చుకో. అందుచేత గారణము