పుట:SaakshiPartIII.djvu/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షాజహాన్ చక్రవర్తి మం తాజ్ ను బతిమాలు కొనుచున్నాఁడు. మూటకంటె నెక్కువ పనికిరాదని యామె యనుచున్నది. ఆసెలవును బొంది ముద్దు పెట్టుకొనుట కాతండుపక్రమించినాఁడు, ఏక్ దో, ఏక్దో, ఔర్ ఏక్ ఔర్ దో, ఫిర్ ఏక్, ఫిర్ దో దోయనుచు మూడన్న అంకె నోటి వెంటఁ బలుకకుండ మూడువందల ముద్దులు టపాకచ్చేరిలో ముద్రల వలె నామెమాతిపై పెడిపెడి ముద్రించినాడు. అన్ని ముద్దులు పెట్టుకొనుట కాచక్రవర్ తికెంత ప్రేమయో. ఇన్ని మూతినొక్కుల నుభవించుట కాయమ్మ కెంతయోపికయో యని తెల్లబోయితిని. మూడుకంటె నెక్కువ పనికిరాదన్నప్పడే యింతకుంభవృష్టి కురిపించిన యయ్యవారు నీయిష్టము వచ్చినన్ని పెట్టుకొనవచ్చునని చెప్పి, “సర్వదుంబాల' చీట నిచ్చినయెడల పుష్కలావర్తకములు తెగి పడి జలప్రళయము చేయునట్టు ముద్దుపెట్టుకొ నుచు గాబోలు నని ననుకొంటుమి.

ఇంతలో బంగారు శలాకవంటి యొక చక్కని కాంత యెచ్చటి నుండియో గాని యచ్చటకు మేలిముసుంగుతో వచ్చెను. “నీవెవతెవు? ఇటు కేలవచ్చితివి" అని ముమ్తాజ్ ఆమెను గద్దించెను. 'ప్రియురాలా! ఆమెను బెదరగొట్టకుము నిన్నుఁ జూచుటకే గడగడలా డుచున్నది. నీవు నన్నేలిన యామెనుగూడ నేలికొనుము. నీకు సర్వతా విధేయురాలు' అని చక్రవర్తి మమ్తాజ్తో క్రొత్తయువతిని గూర్చి చెప్పెను. 'ప్రాణనాయకా! నీవు చెప్పిన మాటలలో నొక యక్షరమైన నాకుఁ దెలియలేదు. ఆమె యొవతె? ఇక్కడ కెందులకు వచ్చినది? నా యంతః పురములోనికి నాసెలవులేకుండ వచ్చుట కామెకేమి యధికార మున్న దని ముంతాజ్ తీవ్రపడెను. వారి కిట్టు సంభాషణ జరిగెను.

షా:- ప్రాణప్రియా! నీదర్శన మామెకు లభింపఁజేసి నిన్నామెపై సర్వాధికారిణిగ జేయుటకు నేనే యామె నిక్కడకు రమ్మంటిని.

ముంతాజ్ - ఏమీ! నేను లేనప్పడు నీ వీపడుచుకుర్రదానితో నేల మాటలాడితివి? మీకు మాటలు జరుగుటా! అది నీకు నచ్చుటా! నీవు దానిపై నిష్టపడుటా! దానిని నాయంతఃపురము లోనికి రమ్మని నీవు రహస్యపుమాట చెప్పటా! అది య చ్చటికి వచ్చుటా! నాయెదుటచే నీవు దానిచర్యను సమర్ధించుటా! అని నాకుఁ గూడ నీకైనయట్టే యిష్టపదార్థమగుటకు నీవు నన్ను బతిమాలుటా! నాకను బ్రామి యింతచర్య జరిగించితివా? దానిని నా యంతఃపురములోని కేల రమ్మంటివి? ఈయంతఃపురము నుండి నన్ను వెడలఁ గొట్టి యామె నిచ్చట సింగారింపఁ దలచితివా? నేను లేచిపోవుదును.

(ముంతాజ్ లేచి పోబోవును.)

షా:-(ఆమెకాళ్లపైఁబడి) నన్ను కమింపుము. నావలనఁదప్ప గలిగినది. మించిపోయి నదాని కేమిచేయఁగలము? నే నామె నాకస్మికముగఁ బైయూరఁ గాంచి “నాయొద్దకు వచ్చునెడల బదివేల అషరఫీ లిచ్చెదనని వార్త నంపితిని. "ఊరివారిసాలైన తొత్తు ననుకొంటవా? పదివేల అషరఫీ లిచ్చిననైన నేను నీ మొగమువంకఁ జూతునా? నాకు నాల్గషరఫీల యలంకారములైన నీయకుండ నన్ను వివాహము చేసికొనునెడల నా కంగీకారము” అని యామె తిరుగ వార్త నం పెను.

ముంతాజ్:- ఆ! ఆ! అంతవఱకు వచ్చినది? వివాహము చేసికొంటివా! చేసికొంటివా!