పుట:SaakshiPartIII.djvu/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షాజ:- క్షమింపుము. క్షమింపుము. చేసికొంటిని.

ముంతాజ్ - ఐనది కదా. నీ వుంచుకొన్నదానిని నాయొద్దకు దెచ్చితివేమో యని నే నంత తీవరించితిని. ఇంకనేమి! నీయెడల నామెకును నాకుఁ గూడ, సమానమైన హక్కేకదా? ప్రాణనాథా! లెమ్ము! మనశాస్త్ర, మంగీకరించిన పనిని చేసితిని. కాని నీవు తప్పచేయలేదే? చెల్లెలా? ఇటు రమ్మ, (కౌఁగిలించుకొనును.) మన మొక్కతల్లిబిడ్డల వలెఁ గాలక్షేపము చేయుదము. నీ యిష్టము వచ్చినప్పడు నీ విక్కడకు రావచ్చును. నాకు వీలగు నెడల నేను నీ యంతఃపురమునకు వత్తును. ప్రాణనాథా! నీవు నీ క్రొత్తపెండ్లి కూఁతును గౌగిలించి యుండఁగాఁ జూచియుండలేదు. కావున నా చెల్లెలిని నాయెదుట గౌంగలించు కొనుము.

షా:— అక్క చెల్లెండ్ర నిద్దరి నొక్కసారి కౌగలించు కొనుటకు, రెండు బాహువులుండ వేరువేరుగఁ గౌంగలించు కొనుట తప్పకాదా? (ఇద్దరను గౌంగలించును.)

ఇంతలో లోనిగదిలో నుండి యొక రవంత కీచుగొంతుకధ్వని యయ్యెను.

ముంతాజ్:- రోషనార్ నన్ను బిలుచుచున్నది. నేను లోనికిఁ బోవుదును. చెల్లెలికిఁ బ్రశస్తమైన అంతఃపుర మీయక తప్పదు. నోటివెంట మాటయైన నెఱుఁగని ముద్దరాలు. ఆమెను జూడ నాకు జాలియగుచున్నది. మీవంటి ముసలి తొక్కుదొరుకుట యామె దురదృష్టము. కాని పడుచు ప్రాయపు పసలచే బెసంగకుండ గసిమసపు బంగారు బొమ్మ ప్రక్కలోని కమరుట నీ మహాదృష్టమే కదా? ఆడుదానికర్మ మెట్టయిన సరే మగవాఁడు సుఖపడినఁ జాలును కదా. (షాజహాను లెంపపై బరిహాసముగఁ గొట్టును. లోనికిఁ బోవుదును.)

షాజ:- మే మిక్కడ నెందులకు? మేముగూడఁ బోయెదము. (షాజహాను, క్రొత్త పెండ్లికూతురు పోవుదురు.)

ముంతా:- ఇద్దరు గూడఁ బోవుదురా? నే నీముండను దెల్లవాఱకుండ బరాభవించి చంపింపనా? అంతేకాని వీరిని గాంపురముచేయ నిచ్చెదనా? ఈ పెండ్డిసంగతి నాకు పదిహేనురోజుల క్రిందటనే తెలిసినది. రోషనార్ యీసరికి తగిన మాయ పన్నియే యుండును. రోషనార్ (అని పిలుచును) (రోషనార్ ప్రవేశించి) మీకు జరిగిన సంభాషణ వింటిని. ఈమె నీరాత్రి చంపించుట కేర్పాటు చేయించితిని. నీవు విచారము వదలుము. రమ్ము లోనికిఁ బోవుదము. సంగతులన్నియు వివరముగాఁ జెప్పెదను.

ముంతాజ్ - కాని నాపేరు మాత్రము పైకి రాంగూడదు సుమా.

రోష:- రానేరదు. వచ్చినను మరేమియు దొందరలేదు. లోనికి రమ్ము. (ఇద్దరు పోవుదురు.)

అంతలో నాస్టలమంతయు గిరగిర దిరిగిన ట్లయ్యెను. నాకుఁ గన్నులు స్వప్నము లోనే చీఁకటులు పడినవి. అంతలో షాజహాను తన నూతన భార్యచెఱగు బట్టుకొని లాగుచున్నాడు. ఈమె పేరు కిన్నెత్.

కిన్నెత్:- అబ్బే! అబ్బే! ఇప్పడుగాదు. పాదుషాసర్కార్ క్షమింపవలెను. నాక్రొత్త