Jump to content

పుట:SaakshiPartIII.djvu/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్ణము మనము చెప్పఁగూడదా? దీనిని జిత్రపట మన్న వారెవరో నాకుఁ దెలియదు. శిల్పకళావైచిత్ర్యమునకు ఫలమైన యీ భవనమును శిల్పకళ కూడ సేవించుచున్నదనుట తప్పకాదా? అందుచేత నీ స్తంభము లెందుకున్నవో చెప్పలేము. ఈసాగారు మొదట వ్రాసినపటమందు నివియుండెనో లేదో ఉండునని నిశ్చయముగాఁ జెప్పలేము. ఉండినయె డల వానికేదో పరమార్థ ముండి తీరవలయును. తెలియ రాని విషయమును గూర్చి యీ ప్రయత్నమెందులకు?

Lord Roberts అనునాతడు Boer యుద్దమున వీరాగ్రేసరుడని మిరు వినియు న్నారు. అతఁడు నలువదియొక్క నంవత్సరములు హిందూ దేశమం దుండెను. ఆతఁడు తన గ్రంథమున నిట్లు వ్రాసినాడు. ‘‘కవిత్వమువలనఁగాని, చిత్రలేఖనము వలనఁగాని, యెంత భావనాధార్ద్య మున్నవానికైనా నీ విచిత్రకల్పన యొక్క న్వచ్చత యెట్టిదో, సర్వజన సంతోషప్రధాన ప్రతిభ యెట్టిదో, రవ్వంతయైన తెలియజేయుటకు సాధ్యము కాదు. హిందూదేశయాత్ర తాజ్ దర్శనమువలన సార్థకమగుచున్నదని తాజ్ ను గూర్చి వ్రాసినాడు

పండు వెన్నెలలో నీభవన మత్యంత శోభాయుక్తముగ నుండునని పెద్దలవలన విని రాత్రికూడ నటకుఁ బోయి కూర్చుంటిని. రవ్వంత సేపటి కింటికి వచ్చి నిద్రపోయితిని. ఒక చిత్రమయిన కల వచ్చినది. దాని వైచిత్ర్య మింతింతనరాదు. దానిని పైవార మెప్పడైనా జెప్పెదను.

"ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః"