ఇప్పడు తాజ్ భవనపు మెట్లెక్కుచున్నాము. ఈమెట్లటమీద మన శరీరము మాత్రమే యడుగడుగునకుఁ బైకి లేఁచుచున్నదా? కాదు. మనస్సు కూడ నట్లే లేఁచుచున్నది. తాజ్ కెదుట నిలువఁబడి నాము. ఎదుటివసారాకున్న పాలరాతి తడకలమీది పనివానితనము ముందు చూడగూడదా? ఊహుం లోనికి బోయినదాక నొక్కటే తొందర. రెండు పాలరాతి గోరీలు రవంతయెత్తయిన పాలరాతి తిన్నెపై నున్నవి. ఇవి నిజమైన గోరీలు కావు. వీనికి దిగువ క్రింది యంతస్థులో భూమిలో నిజమైన గోరీలు కావు. ఈగోరీలే భార్యభర్తలిరువురవి. డాబా మీద గోరీలు జవాబు గోరీలు. వీనికిఁగూడ నాల్గువైపులను నాల్గు పాలరాతి తడకలున్నవి. పైని పెద్దగుమ్చీయున్నది. ఎక్కడ చూచిన పాలరాతి తలతల. రత్నముల మిలమిల. పచ్చరాలు, నెఱ్ఱరాలు, నీలపురాలు, నాకుపచ్చరాలు, పాలరాతి పూదీఁగల చిత్రవిచిత్రపుఁ బనులపై వరుసలుగాను, నడ్డుదిడ్డముగాను, తోరణములుగాను, పడుగు పేకలుగాను, అయి మూలవాటముగానుఁ జెక్కబడియున్నవి. నాయనలారా! చూచి యాసౌందర్య మనుభవింప దగినదే కాని చెప్పదగినది కాదు.
ఇది 1932 లో నిర్మింపబడినది. వీనిని మనస్సులో గల్పించుకొని పటము సృష్టించిన యాతఁడు ' ఉస్తాదు-ఈసా" యను పారశీకుఁడు Austen De Bordeany అను ఫ్రెంచియాతండు దీనినిఁ గల్పించెనని చెప్పదురు. కాని యది సత్యము కాదు.
కాని నాల్గువైపులను నాల్గు పాలరాతిస్తంభము లున్నవేల? సముద్రతీరమందలి దీపగృహముమాదిరిగా నున్నవి. అవి యెట్టున్న సరే వాని యాకృతిలో మనకుఁ దగవులేదు. కాని యవి యక్కడ నేల యున్నవి. ఈ ప్రశ్నమున కుత్తరము చెప్పవారెవ్వరు? తాజ్ భవనమునకు నాల్గువైపుల నాల్గుగు మ్చీలేల యుండ వలయును. అందుకై ఈ స్తంభములు గూడ నున్నవని మీకు న న్నదిక్షేపింతురా? నాల్గు క్రిందనున్నవి. కనుక గదికొక్కటి చొప్పన నాల్గుగుమ్చీలు కట్టవలసి వచ్చినది. అవి భవనములోని భాగములే కావా? తాజ్ పాడుకాకుండ నొక్క గుమ్చీయైన తీయఁగలమా? వెలుపలనున్న ఈ స్తంభములట్టా? వానితో భవనముతో నేమి సంబంధమున్నది? అవి తీసిపారవై చినవైన తాజ్ సౌందర్యము లేశమైనా జంకునా?
ఉన్న ప్రయయోజనము లేదయ్యెను. లేకున్న నష్టములేదయ్యెను. అటులయిన నుండనేల? మీరిండ్లు కట్టుకొనుచున్నారు కదా! ఇల్లు పూర్తియైన పిదప నింటికి రవంతదూర ముగ నాల్గువైపుల నాలుగు స్తంభములను ప్రాతి యూరకుండుటకు మీ మనస్సెప్పడైనఁ బోయినదా? ఎవడైనఁ జేసియుండినయెడల పెద్దలెవరైనా నధిక్షేపింపరా? కాకులు గ్రద్దలు పాడుచేయునేమో, పిడుగులవలని యుపద్రవ మేమికలుగునో యని తాజ్ పై నొక పెద్ద గుమ్చీకట్టుటకు నాల్గువైపులా నాల్గు స్తంభములు కట్టఁబడినవా? అప్డేయగునెడల ప్రధానభవ నముతో నీస్తంభములకు సంబంధమున్నది. అప్పడు స్తంభముల కర్దమున్నది. కాని యందు కొఱకేయని చెప్పగలిగినవాఁ డెవ్వడు. పిడుగుతో పైగుమ్చీ పగులు నప్పడు లోని దాగునా? గదాఘాతమును తలపై జట్టుకొన్న సేలు వాపఁగలదా?
కవులు దీనిని ప్రబంధమనలేదా? గాయకులు దీనిని గీతమనలేదా? చిత్రవిలేఖరులు దీనిని జిత్రపట మనలేదా? శిల్పకులు దీనిని కళానిలయమన లేదా? కవితా, గానము, చిత్రలేఖనము, శిల్పము నను నాల్గుకళలు గూడ దీనిని సేవించుచున్నవని యీ స్తంభముల