Jump to content

పుట:SaakshiPartIII.djvu/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని ప్రాపంచికసుఖమే పరమార్ధము కాక పోవుటచే నట్టు పెద్దలు నిర్వచించిరని యనుకొన వలసియున్నది.

సౌఖ్యమును రోసి, సంసారమును త్యజించి, ప్రాపంచిక సుఖమును వదలుకొని యే కొండగుహలనో, యేనిర్ఘరతీరముననో తపమొనర్చి తానొక్కడుమాత్రమే తరించి యద్వ యానందము నొందుట కంటేు జనుడు మనుజులలో దిరుగుచు వారిని గష్టములనుండి యుద్దరించుచు వారి సుఖసాధనము లభివృద్ది పఱచుచు స్వార్డపరిత్యాగియై వారిని సేవించుచు తనువు కృతార్ధము జేసికొని తరించుటయే విశేషము కాదా? తానొక్కడు తరించుటయే పరమార్థమగునెడల గురు ధిక్కారపాపమున కొడిగట్టి గోపురమెక్కి తిరుమంత్రార్ధమును త్రిదండి శిఖామణి ప్రజల కేల యుపదేశించి యుండును. ప్రేమమతమును బుద్దు డేల ప్రపంచమున వెదజల్లియుండును. ఇతరులను దరింపఁజేయుచు తాను దరించువాడు భగవంతుని ప్రతినిధి యనకతప్పదు. ప్రజాపాపనివారణమునకై ప్రాణము లర్చించిన పవిత్రాత్ముఁడు భగవంతుని కొడుకు కాక మరెవ్వఁడు.

నాయనలారా! ప్రధానవిషయమును వదలివైచి మారుదారిని బోవుచున్నాను. ఈ దినమున దేహమునకు మనస్సునకుగూడ నస్వస్థతగా నున్నది. నాయనలారా! ఒక్క మనవి. నేను చెప్పఁబోవునది శ్రద్దగా వినుడు.

ఇదిగో ఈ యెఱ్ఱరాల ముఖాద్వారపుమేడక్రింద నిలువంబడి 'తాజ్మహలు" వంకజూతము. తెల్లనిగుమ్మటమువలె శారదా భ్రసంచయమువలె నగపడుచున్న యారజత గిరి శకలమే దర్శనీయమైన 'తాజ్మహలు'. ఇక్కడ నుండియే యొక్క వింత సంగతి కనిపెప్టెదను. తాజ్మహలు మనకిక్కడనుండి రెండు ఫర్గాంగుల దూరములో నున్నది. దాని నిక్కడనుంచి చూచు మనకది యసలు భవనముకంటెఁ జిన్నదిగాఁ గనఁబడక తప్పదు కదా! ఎంతచిన్నదిగా గనబడు చున్నదనఁగాఁ దాని చిన్న పరిమాణముతో నది మనయెు ద్దకు వచ్చునెడల నది యీ మేడలోనికి సులభముగాఁ బ్రవేశింపదగినట్టున్నది. అత్యంతము సున్నితమగు దూరదృష్టి సంబంధమైన పరిమాణజ్ఞానముతోడ నీ సింహద్వారము సృష్టింప బడినది.

మనమింక ముందునకుఁ బోయెదము. దారిలో నీప్రక్కనా ప్రక్క జక్కనితోట యున్నది. ఎదుటి మహాదర్శనము ముందీతోటవంక జూచువాఁడెవ్వడు. ఇంకొక్క యద్బుత నన్నివేశమిక్కడ కనబడుచున్నది. మనము తాజ్మహలు వద్దకు వెళ్లుచుండగా నది మనవద్దకు వచ్చుచున్నట్టుగుపడుచున్నది. ఇది మాయయో, కనుకట్లో తెలియదు. ఆభవన సంబంధమైన సౌందర్యశక్తిమన మింత దూరమున నుండగనే మన మన స్సానందవశ మగునట్టు క్రమ్మివేయుటచేత మనము కదలకుండ నుంటిమనియు, నాభవనమే మనయొద్దకు వచ్చుచున్నదనియు బ్రాంతి కలుగుచున్నదేమో. అత్యంత సౌందర్యవంతమైన వస్తువును జూచునప్పడు భ్రమయేమి, నిశ్చేష్టతయేమి, యస్వాధీన మనస్కతయేమి, గలుగఁదగని వికారమేదైనా నుండునా? పార్థసారధిస్వామి దర్శనమునకు బోవు యాత్రికుడు ప్రాకారము వెలుపల నింకనుండగనే పరమేశ్వరుని పవిత్రాతాశక్తి యాతని యొద్దకుపోయి పాపసంకులమైన యతని మనస్సునకు బరిశుద్దినిచ్చి మఱి లోనికి దీసికొని పోవును.