పుట:SaakshiPartIII.djvu/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందుపై స్త్రీ-అందుపై రాజకాంత-అందుపై మహాసుకుమారి-అందుపై బూర్ణగర్భవతి. భగవత్కటాక్షమున నామెచూలు నిలిచెను గాని నిలువఁదగినదా? అట్టు తటస్టించునెడల సీత బ్రతుకునా? రామలక్ష్మణులు కూడ నామెగతియే పొందకుందురా?

రాముఁడప్ప డేడ్చిన యేడు పెందులకో “జానకీదేవి విరహమెంత దుస్సహమైనను శత్రుని సాధింతమను తీవ్రవాంఛచేత దానిని వెనుక నడఁచుకొంటిని. ఇప్ప డడఁచుకొనుట యేలాగు? అని యేడ్చెను. ఈ కారణముచేతమాత్ర మింతగా నేడ్వ దగదని నామనవి 'పూర్వమున నాకుఁ కలిగిన దుఃఖ మొకకారణముచేఁ గలిగినది. దుఃఖమున కేదో కారణమున్నది కదా యని వెనుక దానిని సహించుకొంటిని. ఇప్పడేడ్చుటఁకు దగిన కారణము లేకుండనే కలిగినయేడుపు నెట్లు సహించు కొనగలనని యేడ్చుచున్నా" నని యొకడు మనతోఁ జెప్పిన నెట్టుండునో రాముఁడనిన మాటకూడనప్డేయున్నదనియనవల సివచ్చినందుకలకు విచారించుచున్నాను. 'ఏడ్చుటకు గారణము లేనిదే. యేడు పేలకలుగ వలయు" నని మన మాతని నడిగిన ఫ్టే “శ్రీరామచంద్రమూర్తీ పూర్వము మహాశత్రు వుండుటచేతనే సీతావిరహము కలిగినది. ఆ శత్రువును జంపు వాంఛచేతనే విరహమును సైచికొంటమి. నిజమేనా? ఇప్పడో శత్రువునే కాక సర్వశత్రువులను జంపితివే. శత్రువే లేనప్పడు విరహమని యేడ్చుట యెందుల"కని యడుగవలసినది కాదా? పోనిండు. ఈ గొడవ యేల?

ఇంతపుట్టి మునిఁగినను బట మావల బాఱవేయుమని రాముడనలేదే, ఏమో.

గర్బవతుల వేడుకలకై జరిగించుట కెన్ని వినోదము లున్నవి. వీణాగాన మొనరించవ చ్చునే. ప్రహసనము లాడింపవచ్చునే భక్తిభోధకములగు గ్రంథములు వినిపించపవచ్చునే. భయము కలుగునని యింద్రజాలము లాడింపవచ్చునే. పగటిభాగవతుల కాలక్షేపములు జరిగింపవచ్చునే. లక్షలకొలఁది గ్రామములుండఁగా వెనుక లేనిదియు, ముందెవ్వఁడు ననుక రింపనిదియు నగు చిత్రపటమును రచియింపించి గర్బవతి యెదుట బెట్టి బొమ్మలవివరము చెప్పదురా? సంతోషముకొఱకు చేసినయినాపని సీతారామలక్ష్మణుల మహాదుఃఖమునకుఁ గారణమైనదే. పటమిప్పడైనా విసర్జింపఁ దగదా?

వాల్మీకి యొకఁడు, వశిష్ణుఁ డొకఁడు, విశ్వామిత్రుఁడొకడు వీరు మువ్వురు మాత్రమే సీతారామలక్ష్మణుల హృదయప్రకృతుల నెఱింగినవారు. మిగిలిన రామకథాకర్తలందఱు తమతమ ప్రకృతులనే యామహావ్యక్తల కారోపించి మాటలాడించినవారే. అందుచేత భవ భూతి మాట లాడించినట్టు సీతారామలక్ష్మణులు మాటలాడినారు. వారి కిందుతో నేమీయు సంబంధము లేదు. పటమర్డునుడు వ్రాసినాఁడు. ఆతడు శ్రీరామ కాలములనో నుండిన చిత్రలేఖకుఁడు కాంబోలు. పటములో దోషమేమియు లేదు. ఇంక భవభూతి ప్రకృతి జ్ఞానమున గుణమెచ్చట నున్నదో లోపమెచ్చట నున్నదో మనవి చేయుదును.

వ్యాకులచిత్తయై యున్న సీతాదేవి కుత్సాహమును గలుగఁ జేయుటకుఁ జిత్రపటము సమర్ధమని గొప్ప ప్రకృతిజ్ఞానముచేత భవభూతి కనిపెట్టినాఁడు. అంతేకాక చిత్రపటము కొన్ని కొన్ని సన్నివేశములందు విచారము హెచ్చుచేయునన్న సంగతిగూడ దనప్రకృతిజ్ఞాన ముచేతనే కనిపెట్టినాఁడు. కాని యే సన్నివేశములందు విచారమును దగ్గించునో వేనియందు