పుట:SaakshiPartIII.djvu/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ దుఃఖకరసన్నివేశము చూడ గుండెలు పగిలిపోవుచున్న వని లోన లక్మణుడగ్ని పర్వతమువలెదపించుచున్నాఁడు. కాని జానకీదేవి యేమిచేయుచున్నది.

సీత:-(సబాష్పయై) తనలోను) అక్కటా! దినకరకులనందనుఁడు కూడ నాకారణ మున నట్టు క్షేశపడెను గదా!

భర్త తన కొఱకు వెనుక నేడ్చినాడని యామె యిప్పడు లోన నెంతైన నేడ్చుచు న్నది. బాష్పములు కన్నులవెంట ప్రవహించుచున్నవి. కాని పెదవులు విప్పకుండ లోలోననే యామె యేడ్చుచున్నది. ఈ యేడ్పు మఱింత యపాయకరము కాదా! తొమ్మిది నెలలు నిండిన చూలాలిట్టి మహాదుఃఖము నడచిపెట్టుటకై చేసిన యస్వభావప్రయత్నము వలన నేమిపుట్టిమునుంగునో యని భర్తగాని మఱదిగాని యాలోచించినారా? లేదు కాని రాముఁ డేమి చేయుచున్నాడో ఏమిచేయు చున్నాండో లక్ష్మణుడే చెప్పచున్నాఁడు విందుము.

లక్ష్మ:-(రాముని బరికించి సాభిప్రాయముగ) ఆర్యా! ఇదియేమిటి?

ఆ. సరము పెరుగ రాలు వరమూక్తికములు నా
దొరలు నశ్రు లివ్వె ధరణిమీఁదఁ
గదలుచున్న నాసికాపుటాధరములు
బిగియఁ బట్టి నట్టి వగపుఁ దెలుపు,

“వియోగగ్రస్తులారా! ఇది చిత్రము సుమా!' యని సీతాదేవికి ధైర్యము బోధించిన రామచంద్రమూర్తి యుత్తరరక్షణముననే కన్నీరు భూమిమీఁదఁ బడి నిల్చి గుర్తులైయుండు నంత విరివిగ విస్తారముగ నేడ్చినాఁడు. ఎటువచ్చినను ధీరోదాత్తుఁడు గావునఁ బెదవులు బిగఁబట్టినాఁడు. పోనీ యీబిగఁబట్టుట మాత్ర మెంతవఱకు నిల్చినదో చూతము. ఉత్తరపం క్తియే చదువుచున్నాను వినుఁడు.

రాము:- వత్సా!

తే. ప్రియను బాసిన దుఃఖంబు పెద్దయైన
శత్రు సాధించువాంఛచే సై చినాడ
మరల దుఃఖాగ్ని యధికమై మండుచుండి
మెండు బాధించు నెదలోని పుండువోలె.

ఇట్టు రాముఁడు పండ్లపట్టు విడిచి బారుమనెను. జనార్ద నవృత్తాంతమును బటమునఁ జూచినప్పడే 'దినకరకులనందనుఁడు నాకారణమున నెంతయేడ్చినాడో" యని జానకీదేవి యేడ్చియుండఁగఁ నిలువున నెగిరి పోవలసినదే కాదా? అప్పడు సీత యేమన్నది.

సీ:- అతిమాత్ర భయావేగముచేత నే నిప్ప డార్యపుత్రునిఁ బాసినట్లు తోఁచుచున్నది.

అక్కటక్కటా! చూచితిరా! దుఃఖము భయము నతిమాత్రములైనవి సహించుకొనఁ దరమా? ఎదుటనున్న భర్త యామెకన్నుల కగపడుటలేదు. తనకు రామునితో విరహము కలిగినదని భ్రమమునఁ బడియున్నది. దృఢశరీరులు దృఢమనస్కులే సహింపలేరు కదా?