పుట:SaakshiPartIII.djvu/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మును జూచి యుత్సాహపడునా? అప్పడే యనంగ 24 సంవత్సరముల క్రింద సంతరించిపో యిన భార్గవుని బొమ్మఁ జూచి భయపడునా? అపాయమేదో దాటిపోయినది. ఆ ప్రయత్నము చేసినవాఁడు శాశ్వతముగా శక్తివిహీనుడై పోయినాఁడు. అపకారమునుండి రక్షించిన జగద్రక్షకుఁడు తనప్రక్కనే యున్నాఁడు. ఇఁక భయమెందులకు?

అదేమి మాట? స్త్రీలు సహజముగ భీరువులు. సహజముగా భయమునకు హేతుకల్ప నశక్తితాత్కాలికముగ నశించును. అందుచేత భయమిచ్చుట సహజమే యని యందురా? సహజమో కాదో తరువాత విమర్శింతము. ఇప్పటి వఱకు సహజమనియే మాటవజున కొప్పకొందము. మాసపూర్తి యగుటచేఁ గొలదిదినములలో సుఖప్రసవము కావలసిన సీతామహాదేవి కా సమయమున భయమను చిత్తావస్థ కలుగనీయవచ్చునా? పటదర్శనము సీతాదేవివేడుకకయి కదా చేయబడుచున్నది. భయము కలిగించుట వేడుకా? భయమువ లన నరములపట్టు లూడిపోవునని యందఱెఱిగినదే కాదా? అట్టి దురవస్థ పూర్ణ గర్భవతికిఁ గలుగనీయఁ దగునా? అది కలిగినతరువాత నయినను బటములో నావలి చిత్రములను జూపించుట లక్మణుడు మానినాడా? లక్మణుడు చిన్నవాఁడు కావున నాతనికిఁ దెలియక పోవచ్చును. గాని పట మింక మానుమని రాముఁడైనను లక్మణుని మందలింపలేదే! ఇది విరుద్దముగఁ గనబడుట లేదా? ఇప్పటి కంత విరుద్దముగా లేదనుకొందము. కాని రాముడింకమీద లక్ష్మణున కట్ జ్ఞాపించి పటము పాఱవేయించునేమో చూతము.

లక్ష్మణు డింక బటమును బఠించుచున్నాడు.

లక్మ:- ఇది శూర్పణఖావృత్తాంతము.

సీత:- హా ఆర్యపుత్రా! ఇంతవజకే నీ దర్శనము.

రాము:- వియోగ త్రస్తురాలా! ఇది చిత్రపటము సుమీ.

సీతాదేవి భయాకులచిత్తయై యుండెను. ఇప్పడు కూడ బటమాపవలసిన దని రాముఁడు లక్ష్మణునితోఁ జెప్పక “వియోగమును వచ్చునని జడిసెదవేల? ఇది చిత్రపటము సుమా" యని సీతాదేవికి ధైర్యము గెప్పినాఁడు. బొమ్మను జూచి భయముగాని దుఃఖముగాని పడనక్కఱ లేదు. లేదని రాముని యభిప్రాయ మైనట్లు స్పష్టము. కాని ఈ పంక్తికిఁ బైపంక్తియందే యనంగా నొక తెప్పపాటు కంటెఁ దక్కువకాలములోనే రాము డిట్టు పలికెను.

రాము:- అక్కటా! జన్మస్థానవృత్తాంతమిప్పడు జరుగుచున్న పొడకట్టుచున్నది నాకు.

లక్ష్మ:

చ. అలహరిణంబు రూపమున నట్టు మిషం బచరించి క్రూరులై
కులిశము ప్రక్కలౌ పగిదిఁ గొండలు సైతము నేడ్చునట్టు మి
మ్మలమజచేసినట్టి కుటిలానురవృత్తము నెల్ల బాపికోఁ
గలిగితి మైన నద్ది పొడగట్టినచో నెద ప్రక్కలయ్యెడున్.