పుట:SaakshiPartIII.djvu/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్లో. యేనామ కేచిదిహనః ప్రథయంత్యవజ్ఞం
జానంతు తే కిమపి తాంప్రతి నైషయత్న:
ఉత్పత్స్యతే మమ తు కోపి సమానధర్మః
కాలో హ్యయం నిరవధిర్విపులాచ పృథ్వీ.

ఈకవి గర్వభూయిష్టుడు. తన్ను స్తుతింపని వారిని నిందించు స్వభావము గలవాడు. ప్రజలు కవిదూషణము చేసినప్పడు కవి ప్రజాదూషణ చేసిన తప్పేమున్నది. కవుల కెంతసేపు నాత్మస్తోత్రము, పరహేళనము, వానితోపాటు గర్వము నసూయయు సాధారణ మగు నవగుణములు. కవులకున్న పౌరుషము యుద్దవీరులకు లేదు. వారికున్న యసూయ జారులకు లేదు. వారికున్న స్వస్తోత్ర పరనిందలు పడుచుసానులకు లేవు. తిట్టు తిట్టుటయందు దినుటయందుఁ గూడ మహాఘనులు. తన కవిత్వమును ప్రజలు నిందించు చున్నారని కడుపు మండుటచేత చిత్తము పుండగుటచేత భవభూతి యీశ్లోకమును జెప్పినాఁడు. దానియర్థమిది. 'ఎవ్వరైన మా తిరస్కారము బ్రకటింతురు గాక! వారుగూడ నేదియో కొంచెము తెలిసినవారే యగుదురు. అట్టివారికొఱకు నేనీ గ్రంథమును వ్రాయలేదు. కాల మంతములేని దగుటచేతను, భూమి విశాలమగుటచేతను, నేకాలమందైన నేస్థలమందైన నావంటి బుద్ధిధర్మముగలవాఁడు పుట్టగలండు' కాని దీని యాంతరంగికాభిప్రాయమేమనంగ, 'నా కవిత్వము మిగుల సారవంతమైనది. దానిలో నున్న విశేషమును, రసమును నాస్వాదిం చుట కీకాలపువా రశక్తులై పోయినారు. గుడ్లగూబ తన యక్షిరోగమును నిందించుకొనక యర్కతేజమును నిందించునట్టు లీయసమర్డులు తమ రస గ్రహణషండత్వమును నిందించు కొనక భారతీమండనాయమాన మగు నాకవిత్వమును దూఱుచున్నారు. ఇట్టి రసపీూనా గ్రేస రులను సంతోష పెట్టుటకు నేను గవిత్వము చెప్పినవాఁడనుగాను. నేను నాకవిత్వము నెంత కళాకౌశల విశేషముతోఁ జెప్పితినో యంత కళాకౌశలసామర్థ్యమున్నవాఁడు ముందెప్ప డైన నెక్కడనైనఁ బుట్టవచ్చును. వాఁడే నాకవిత్వమును గ్రహించి యానందించుగాక. వానికొఱకే యిప్ప డీ కవిత్వమును జెప్పచున్నాను. అట్టివాఁ డుద్బవింపఁగలఁ డనుని శ్చయ మేమిగల దందురేమో ధరామండల మత్యంత విశాలమైనది. కాలము పరిమితి శూన్యమైనది. ఎందులకుఁ బుట్టంగూడదు' ఇవి యేమి సాధారణ వాక్యములా? ఎంత యాత్మశక్తి విశ్వాసమున్న వాడిట్టు పలుకవలెను. ఎట్టి పాండిత్య మదమత్తు డిట్టు పలుకవలయును. జనులయం దెంతోరోంతగలవాఁ డిట్టు పలుకవలయును. ఆ మహాకవి యెంత బుద్దిశాలి, యెంత వికతా పటము కలవాఁడు. యెంత ప్రాణము విసుగకపోయిన యెడల నింతతేలికగ మాటలాడును. ఎంత రసస్పూర్తి గలవాఁడు, యెంతబాధపడకుండిన నెంత యొడలు చిల్లులుపడకుండిన నింత పేలవముగఁ బలుకఁగలఁడు. జనులను సంతోషపెట్టం దలఁచి తా నేడ్చువాఁ డొక్క కవియే. పుణ్యమునకు బోయి బూతులు తినువాఁ డొకకవియే. ప్రజాసేవకుఁ బోయి బడితె బాజా కధీనుఁడగువాఁ డొకకవియే. భవభూతివంటివాని బ్రతుకే కడతేఆనప్ప డిప్పటివారి మాట చెప్పవలయునా? కాళిదాసుఁడు మాత్రము జనులతిట్టగు రికి దాఁటిపోఁ గలిగెనా? ఆతని కవిత్వములోఁ బటుత్వము తక్కువయనియు నాతఁడు యమక కవిత్వమున నజ్ఞఁడనియు నింకనేమో ప్రజలు నోటికి వచ్చిన ఫైల్ల దూషింపలేదా? కాళిదాసుడు గంభీరుడు. భవభూతి బేలగుండె కలవాఁడు. కాళిదాసుఁడు గడుసుకవి. ఈతని వెందఱు తిట్టినను దన శాకుంతల నాందిలో 'శ్లో, ఆపరితోషా ద్విదుషాం న సాధు మన్యే