పుట:SaakshiPartIII.djvu/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాతఁడందజఁ గఆచును. కవిని దిట్ట జాలనంత మొద్దు ప్రపఖచమున లేదు.

సీ. బండిఆయన నెద్దుబండియా పోతుల
బండియా యనెడు మొద్దుండవచ్చు
గుక్కగొడు గనగ గుడ్డదో దాటాకు
దోయని యడుగు మొద్దుండవచ్చు
దాండ్రబెత్తనం దాటితాండ్రయో, మామిడి
దోయని యడుగు మొద్దుండవచ్చు
జాముండి యనగ ముసలిముండ యొుబాల
రండయొు యడుగు మొద్దుండవచ్చు

తే, నుర్వి నెటువంటి మొద్దయిన నుండుగాని
యాధునికకవి కవితయం దన్ని దోష ఉ
ములె యటంచుఁ బల్కగలేని మొద్దు లేడు
సర్వదేశంబులను సర్వజాతులందు.

పనికిమాలినకవి పస్తుపడుచునైన బద్యమల్లకమానడు. అల్లిన వాఁడు తనలో దాను సంతోషించి యూరకుండునా? ఉహూ! ప్రత్యాసక్తిగ పనికట్టుకొని బండికర్చుపెట్టుకొని బత్తెము మూట గట్టుకొని పోయి పదిమందికి వినిపించినదాఁక కొట్టుకొనునే కాని యితని దిక్కుమాలిన సోదె యెవఁడు వినును.

సీ. తలను గొట్టుకొని మెదడు జింపుకొని యొక్క
గద్యమో పద్యమో కవిత యల్లి
జనులకు వినిపింపఁ గనుబొమ చిట్టించు
నొకఁ డడ్డముగ మొగ మూఁపు నొకఁడు "
ఒక్కఁడోష్టము విఱుచు నొకఁడు వంకగ వవ్వు
నొక్కడు పూర్వగవుల సుబ్బిపొగడు
ఎట్టున్నదండి యం చేడ్వగ సకిలించి
ఊ యున్నదని సాగఁదీయు నొకఁడు

ఆ.వె. వ్రాయుచుండ బాధ వ్రాయుపిదప దిట్టు,
కడుపుమంటు మిగులు గలుగు కవిగ
బుట్టుకంటె ఘోరజన్మారు
కఠినఫలము లేదుగాదె యకట!

అని ఒక్కకవి కూనురాగమునకు బెద్దయేడ్పునకు నడుమనున్న కంఠమాధుర్యముతో నేడ్చెను.

భవభూతికూడ ను ప్రజలవలనఁ దిట్టు తినినవాఁడే. కోపము పట్టలేక యతఁడు ప్రజలఁ దిరుఁగబడి తిట్టినాఁడు.