పుట:SaakshiPartIII.djvu/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంతనొక శాస్త్రులుగా రుపన్యాసరంగ మెక్కి కంటకి జోడు పెట్టుకొని యిట్లు చదివెను.

భవభూతి భారతీయ మహాకవులలో నొకడు. మాలతీమాధవీయము, మహావీరచరిత్రము, ఉత్తర రామచరిత్రము ననుపేళ్లుగల మూఁడు నాటకము లీతఁడు వ్రాసినాఁడు. వానిలో నుత్తర రామచరితము ముత్తమమైనది. ఈకవి యుత్తమ కవులలో నొకఁడు. ఆతని కవిత్వ మత్యంతలలితమైనది. మృదుల మృదులతర మృదులతమాధిక శబ్దములను వర్ద్యవిష యానుసారముగా కూర్చి కవిత్వము జెప్పిన మహామహుఁడు. శబ్దార్ధములు రెండును సమానగౌరవముతోఁ జాచునుద్దేశము కలవాఁడయ్యును నొక్కొక్కప్పడు శబ్దముల యింద్రధనస్సు రంగులకు వ్యామోహపడి సందర్భమును కొంచె మలక్ష్యము జేయును. అదిగాక నచ్చటచ్చట మనుష్యప్రకృతి పరీక్షయందుఁ దేలిపోయినట్లు గనఁబడుచున్నది. ఈతండెంత ప్రయోజకుఁడయ్యును సమకాలికులచే మిక్కుటముగాఁ దిట్లుదినిన వాడు. సమకాలికులచే దిట్టు తినుటకు ప్రయోజకతాప్రయోజకతాభేదము లేదు. పరోపకారవేశమున ద్యాగమును జేయువారిని కీర్తిభిక్షకులనియును, స్వగౌరవప్రకటకులనియుం బ్రజలు దూషిం చుచున్నారు. ప్రజాసౌఖ్యాభివృద్దికై భాషాగౌరవవృద్దికై పాటుపడు ప్రభువులను బరిపాలక బిరుదవాంఛాలాలసులని ప్రజలు నిందించుచున్నారు. దేవభక్తిచే మహాక్షేత్రములందు దేవాల యములను నిరత్నానశాలలను స్థాపించువారిని పూర్వకృత బ్రహ్మహత్యాదిదోషనివారణకై చేయుచున్నారని జనులు దూషించుచున్నారు. ఏపని యెట్టు జేసినను దిట్టు తప్పవు. చిత్రలేఖకునికిఁ బాంచాలికారచనయందుఁ గల్పన లేదనియు రహస్యముగాఁ దీసికొని దాఁయుంచిన ఫొటోలను బెద్దజేసి వ్రాయు దొంగయనియు ప్రజలు తిట్టుచున్నారు. తంత్రజ్ఞనికి గాత్రము లేదనియు, గాత్రజ్ఞానికి దంత్రములేదనియు, రాగకల్పన పూర్తిగా నున్నవానికిఁ బల్లవిజ్ఞానము తక్కువ యనియు, నందఱుకూడ ముండలముఠాదారులనియు గాయకులను దూషింతురు. ఇక గవిబద్రు కెట్టున్నదో చెప్పనా. కవిత్వమల్లిన వాని కొక్క ముసలిదియో, పడుచుదియో, యటునిటు కానిదియో, సువాసినియో, వితంతువో, యటు నిటు కానిదయో యొక్కతె ప్రక్కదాపుగా నుండక తప్పదని జనులనమ్మకము. దేవుడున్నా డను నమ్మకము కంటె జనుల కిది దృఢతరమై యున్నది. దేవీభక్తుఁడగు నమ్మకము కంటె జనుల కిది దృఢతరమై యున్నది. దేవీభక్తుఁడగు కాళిదాసునకుఁ గూడ నీనింద తప్పినది కాదు. కవియనఁగా సోమరి, ప్రపంచజ్ఞానశూన్యుడు. తిక్కతత్త్వము గలవాడు, స్వతంత్రమైనవృత్తిచే జీవించువాడు కాడు. ఒకని నీడను దిరిగి బ్రతుకువాడు, అందఱకు దాసుఁడు. కాని ఎవడు చెప్పిన మాటనువినువాడు కాడు. అందరిని దిట్టువాడు. కాని ఎవడు చెప్పిన మాటనువినువాడు కాడు. అందఱిని దిట్టువాడు, అందఱిచేత దిట్లు తినువాడు. దరిద్రతలో నింతతెగనీల్గు మఱి యొచ్చటనులేదు. చేతగానితనములో నింతగర్వము మఱియెచ్చటనులేదు. ప్రత్యక్షమందుఁ జేత రాగికాసు లేకున్నను భావనలోఁ తలక్రింద మేరుపుగలవాడు. ఆపూట కన్నము లేక చావు. ఆచంద్రార్కముగా శాశ్వతుడనను నమ్మ కము కలవాడు. బ్రహ్మదేవుఁడు తన్ను బాగుజేయు యత్నించినను బాగుపడువాఁడు కాఁడు. కాని ప్రపంచమునంతను బాగుచేయుటకు బ్రయత్నించువాడు. కవియిట్టివాడు. ఇంతకంటె దిక్కవాఁడు. మఱి యింతకంటె కొనవెఱ్ఱివాఁడు. ఆతని వెఱ్ఱకి ప్రజలే కొంత కారణము. ప్రజలాతని దిట్టి రేఁగఁగొట్టుచున్నారు. రేంగినప్పడు మాత్రము వెర్రికుక్కవలె