Jump to content

పుట:SaakshiPartIII.djvu/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19. సభావ్యాపారములు

ప్రత్యేకించి ఉపన్యాసం ఈ రోజు లేకపోయినా, జంఘాలశాస్త్రి ఒక చిత్రమైన ఉత్తరం చదివి వినిపిస్తున్నాడు.

ఒక అమ్మాయి గురించిన ఉత్తరమది. ఆమెకు పదో ఏట పెళ్ళి, పధ్నాలుగో యేడు దాటింది లగాయతు కాపరానికి యోగ్యంగా తయారైంది. తండ్రి ఇచ్చిపోయిన డబ్బు వుంది. భర్తకి ఈమె మీద వల్లమాలిన మమకారం. ఆమెకి మాత్రం భర్తంటే అంత వెర్రి లేదు.

ఇలా వుండగా ఒకసారి ఆమె తండ్రికి మేనమామికి మనవడు ఈమెను చూడడానికి వచ్చాడు. కొన్నాళ్ళున్నాడు. ఆమెకి క్రమంగా అతనితో చనువు పెరిగింది. భర్త మీద విముఖత కూడా పెరిగింది.

ఇలా వుండగా భర్త, పెద తండ్రికి ప్రాణం మీదికి వచ్చిందంటే, అతను చూడడానికి వెళ్లాడు. ఆ వెళ్లిన వాడు మళ్లీ తిరిగి రాలేదు.

చిత్రం-భర్త అడ్డు తొలగగానే తన ప్రణయ వ్యవహారంలో విజృంభించ వలసిన ఆమె, తన తండ్రి మేనమామ మనవణ్ణి అదే వూళ్లో వేరే యింట్లో వుండమంది.

మరి కొంతకాలానికి ఈమెకు పక్షవాతం వచ్చింది. ఆమె ప్రియుడు తరచు వచ్చి చూసేవాడు. చేతనైన సేవలు చేశాడు. పక్షవాతం పూర్తిగా తగ్గింది. కాని, భర్త బ్రతికి వుండగా, ఈ ప్రియుణ్ణి దరిజేర నివ్వని ఆమె, భర్త మరణించాడని తెలిశాక పెళ్లి చేసుకుంది. కాని పెళ్లినాట రాత్రి, గర్బాధాన సమయంలో-ఆమె, తన పూర్వ భర్త తన గొంతు పిసుకుతున్నాడని భయపడింది. చిత్రం-మరికొంత సేపటికి ఈనూతన భర్త, చచ్చిపడివున్నాడు,–ఇదే ఉత్తరం సారాంశం.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:

ఈదినమున నుపన్యాస మేమియు లేదు. సభలోఁ జదువఁబడుటకై వచ్చిన యుత్తర మొక్కటి మాత్రమే యున్నది, దీనిని జదివెదను. ఇది కొంత చిత్రముగానే యున్నది. దీనిని వ్రాసినయతనిపే రేదో తెలియదు. ఏయూరనుండి యిదివచ్చినదో యంతకంటెఁ