Jump to content

పుట:SaakshiPartIII.djvu/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దెలియదు. ఉత్తరముపై నున్న ముద్రం జూడఁగ నస్పష్టముగ నున్నది. ఏయూరనుండి వచ్చిన నేమి? ఏవరు వ్రాసిననేమి? దానిలోని యంశములే మనకుఁ గావలసినవి కాదా? ఉత్తరమును జదివెదను.

సాక్షికి:- ఈయూర నొక బ్రాహ్మణి యున్నది. ఆమె కిప్పటికిఁ బదునాల్గు సంవత్సరములు. ఆమెతండ్రి మరణించి యొక సంవత్సరమైనది. ఆతడు శవవవహనాది క్రియలచేఁ గొంతసొమ్ము సంపాదించినాఁడు. బిడ్డను మేనల్లుని కిచ్చి వివాహము చేసి యాతనిని తనయింటనే పెట్టుకొనినాడు. ఆపిల్లకుఁ బదవయేట వివాహమైనది. పదునొక టవ యేఁట నామె యీడేరినది. రజస్వలాస్నానదినముననే గర్భాదానము గూడ జరిగినది. ఇట్లు తన బిడ్డయు నల్లుఁడును రెండు సంవత్సరములు కాంపుర యొనర్చినతరువాత నా బ్రాహ్మణుడు మరణించినాఁడు. ఉన్న సొమ్మంతయుఁ గూతు నధీనమైనది. తాను మగండుమాత్రమే యింటిలోనుండ లేక భటు నొక్కని సాయము కొఱకింటిలోఁ బెట్టుకొని నారు.

ఈబ్రాహ్మణికి భర్తయందు వెజ్జీమమకారము లేదు. భర్తకు భార్యయం దెంతయను రాగ మైన నున్నది. ఆమెకనుసన్నలను మెల గుచు నామెకు సమస్తోపచారములను జేయిచుండెను. తన్నాశ్రయించి సేవించిన కొలఁదియు నాతనిపై నామె మనస్సునం దనిష్టత హెచ్చుచుండెను. భర్త మిగుల దేహదార్ద్య సంపన్నుఁడే రూపవంతుడే. పరస్త్రీ పరా జ్మఖుఁడే. అయిననేమి? అతని యోగ్యతలన్నియు దోసములుగా నామెకు గనబడుచుం డెను. భర్త తలయెత్తియామెను చూడఁగనామె కనులు మూసికొని తలవంచు కొనుచుండెను. భర్త దగ్గఱకు రాఁగా నామె దూరముగఁ బోవుచుండెను. భర్త తనతో మాటలాడఁగ నామె విననట్టు భటునిఁ బిల్చి యేదియో చెప్పచుండెను. ఇట్టిభర్త కేమిసుఖమున్నది? వీరి దాంపత్యములోని చిత్రములను వాణీదాసుని వంటి కవి వర్ణింపఁదగినది. కాని నేను జెప్పఁజా లను. మీ జంఘాలశాస్త్రి వంటివాఁ డీదాంపత్య సౌఖ్యమును గూర్చి యుపన్యసింపవలయును గాని నావలన గాదు. చప్పనిమాటలతోఁ జచ్చుచచ్చుగా మాత్రమే వ్రాయంగలవాఁడను.

ఇది యిట్లుండఁగా నీమెతండ్రికి మేనమాయ మనుమ డొకఁడు వచ్చెను. ఆతని నీసంసారిణి గౌరవించి యాదరించుచుండెను. ఆతఁ డఫ్లై రూపవంతుఁడు కాడు. శరీరదారుఢ్యముకూడ బాగుగా నున్నవాఁడు కాడు. ఈమెభర్త కాకపోవుటయే యాతని సుగుణమని యెన్నందగి యున్నది. ఆమెకు నతనికిఁ గొంతకాలము కనుసన్నలు నడచెను. తరువాత గొన్ని దినములు ముసిముసినవ్వుల లావాదేవీలు' జరిగెను. కొన్ని దినములు చిన్నచిన్నమాటలు జరిగెను. తరువాత సావకాశముగా బుక్కిటి పురాణములలోను, లోకాభి రామాయణములోను, లొట్టాబట్టీయములోను కొన్నిదినములు నడచెను. అందుపైన ప్రమాదవశమునఁ జేతులు చేతులు కలియుటలు, నసైనొచ్చుకొనుటలు, నిట్టెక్షమాపణలు జరిగెను. అందుమీఁద తొందరతొందరగ వదలువదులు హస్తస్పర్శములు, పిమ్మట కొంతబి గింపులు, రవంత గిలిగింతలు, కాసంత యిగిలింతలు చెలరేఁగెను. అటుపైన బెదరుబెదరు నాలింగ్టనములు, అట్టెవిడిపోవుటలు కలిగెను. అందుపైన మూతి మూతి కలియుటలు, శిరకంపనములు మొదలైనవి జరిగెను. అంతటితోఁ గొన్ని దినములాగెను. స్వభావసిద్దముగ నద్భుతమైన యీశృంగార గ్రంథము యొక్క ప్రతిపదార్దమంతయు దనకు బాగుగఁ