Jump to content

పుట:SaakshiPartIII.djvu/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నము చేయవలయునని వచ్చితిని. యాజ్ఞవల్క్య శిష్యుడవై కర్మయోగి వైన నీ వీజన్మముననే మోక మొందగలవని పెద్దలవలన విని మీ పుణ్యదర్శనమున నేనుగూడఁ దరింపవచ్చునని వచ్చితిని. మీదర్శనము నాకగునో కాదో, నేను వచ్చుసరికి నీవు ప్రబలసమాధి నిష్టాగరిష్టత బ్రచ్చన్నచైతన్యుడవై యుందువో, కాక బహిరంగముగఁ బ్రాణాయామము బట్టిపైకెగురు చునుందువో యని యనుకొంటని. నిన్ను జూచి డిల్టపడిపోయితిని. కర్మ యోగివని పేరొందిన నీవు భవభోగివని బిరు దొందుటకుఁ దగియున్నావు. ఏసంసారి కిన్ని భోగములు న్నవి? ఏపామరుని కింతభవలంపటత యున్నది? ఆహాహా! కిలిక్రిందనున్న పాదుకలక్రిందఁ గూడ పట్టుపురుపులు పఱపించితివే. పంచభూతములను బానిసలుగా జేసికొని వానిచేఁ గొలువు చేయించుకొనుచుంటివే. ఈపనికి మాలిన రాజ్యము నీ కెందుకు? శుఖపరవశుడవై నిన్ను నీ వేలుకొనలేక పోయినప్పడు నీవొకరి నేలుటయేల? అయ్యయ్యో! ఈయాత్రితు లేమి, ఈయుద్యోగులేమి, ఈరాయబారులేమి, ఈవిచారణములేమి, ఈశికలేమి, ఈధన కాంక్షలేమి, ఈవేశ్యావృత్తగీతాదులేమి, ఈకవిగాయక మాగధాదిస్తోత్రపాఠములేమి, నిన్ను జూడగ నాకు వెఱ్ఱి యెత్తుచున్నది. ఇట్లేలయుంటివో నాకుఁ జెప్పవలయును.

జన:-మునిచంద్రమా! నీవు బుద్దిమంతుఁడవు. నాయందలి మహాభిమానముచే నిట్టు పలికితివి. ఇది యంతయు లాంపట్యమని నే నెఱుఁగక పోలేదు. ఈ మహా సంసారతంత్రమునఁ జిక్కుకొని తిరుగుచుంటినని యెఱుఁగకపోలేదు. కాని మూడు నకు నాకు నున్నభేద మేమనఁగా నే నది వ్యర్థమని యెఱిఁగియుండియే తిరుగుచున్నాను. వాడిదియే పరమార్ధమని తిరుగుచున్నాఁడు. ఇద్దఆలో నేనే దోషినని తెలిసికొనకపోలేదు. ఎఱిగియుండియు నింక నేల యిందు దిరుగుచుంటి వని యడుగుదువా? తప్పనిసరి యగుటచేత నాసుఖప్రారబ్దముయొక్క శేష మింక నున్నది. అదికూడ ననుభవించువఱకు నేను దీనిని వదలుకొని నను నది నన్ను వదలదు. నాయనా! నే జేసినకర్మముయొక్క ఫలమును నే ననుభవింపక నాకుఁ దప్పనా? • శ్లోl అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటిశతైరపి' అని మీ వంటి విద్వాంసులే యానతిచ్చిరికాదా? అందుచేతఁ బ్రారబ్దఫలానుభవ పూర్తియగువఱకు నోరుమూసికొని చచ్చిన ట్లనుభవింపవలసినదే.

విరాగి:-చక్రవర్తీ! నీమాటలు నాకు నచ్చలేదు. నీవు వదలి వైచిన సౌఖ్యములు తిరుగ నీవెంట నంటివచ్చునా? రాజ్యమును దృణప్రాయముగ వదలివైచిన నీయల్లుఁడగు రామచం ద్రునితో సాకేతపుర రాజ్యము కూడఁ బోయినట్లు వినియుంటివా? స్వార్థపరత్యాగశక్తి నీ యొద్ద లేదు. అందువలన నిట్టు లాడుచున్నావు.

జన:- నాయనా! చాలసంతోషము. నా కీసౌఖ్యసంఘాతమంతయు వదలిపోయి తిరుగ రాకుండుటకు నన్నేమి చేయుమందువో చెప్పము.

విరాగి:- నీవు సౌఖ్యమును వదలుకొనుటకు సిద్దపడియుంటివా? మందది నాకుఁ జెప్పము.

జన:- ఈ నిముసమందు వదలుకొందును. ఆసౌఖ్యములు నాకు తిరిగి రాంకుడ నీవు చేయఁగలవా? ముందది నాకుఁ జెప్పము.