మహారాజు పూర్వాహ్నకృత్యములన్నియు నెరవేర్చుకొని యగ్నిశాలనుండి సభాశాలకు వచ్చుచున్నాడు. బ్రహ్మవర్చసము క్షాత్రతేజము నాక్రమించు కొనియుండెను. కన్ను లెండ గాయు చున్నవి కాని చెక్కిళులు పండువెన్నెల లీనుచున్నవి. పరమశాంతతఫాల మంతయుఁ గప్పియుండెనుగాని కొలచినట్టున్నట్టి గడ్డము పట్టుదలను సూచించుచున్నది. శరీర మెఱ్ఱినీ టివఱదయందు బూర్ణచంద్రుఁడు ప్రతి ఫలించు చున్నట్టున్నది. కవులు భావించి యేదో వెఱ్ఱమొఱ్ఱగ వర్ణింపఁ దగినయంశము. నాకేల? జయా! జనకచక్రవర్తి యని వందిమాగధాదులు బిరుదావళుల బటించుచుండ, నొకవంక బారులుగట్టి మునులాశీస్సులతోఁ బుష్పాక తలు వర్షించుచుండ, సామంతరాజులు పాదాక్రాంతులగుచుండ, నుద్యోగులు నడుములు చేతులు కట్టుకొని యాజ్ఞలకై వేచియుండం, గవులు చక్రవర్తిపైఁ బ్రబంధములు పఠింపుచుండ, గాయకులు చిత్రవిచిత్రరీతుల గీతామృతములు వెదఁజల్లుచుండ, వారాంగన లుత్సాహమున నృత్యము లొనర్చుచుండం, జేతులు సాచి దోసిళులు పట్టి 'ఇటు దయచేయుఁడు, ఇటు, లనుచుఁ గార్యదర్శులు మార్గదర్శులైవెనుకకు నడచుచుండఁ గను సన్నలతోఁ జేతిజోడింపు లతో, శిరఃకంపనములతో, మందహాసములతో, వ్రేలియూఁపులతో, నభిప్రాయప్రకటనము లగు నాలోకన విలాసములతో, నెవ్వరి నెట్గాదరింప వలయునో యట్లాదరించుచు మొకమాలుమడుగలపై నడుగు లిడుచు, నిమ్మళముగ సింహాసనము నొద్దకు వచ్చి, కూరుచుండుఁ డని యందఱకు సంజ్ఞచేసి తాను గూరుచుండెను. రాజకార్యపు లెక్కలుద్యోగులు వినిపించు చున్నారు. కొందఱ కిచ్చుచున్నాడు. కొందఱకు బిగబట్టుచున్నాడు. కొందఱ కెగఁబె ట్టుచున్నాఁడు. సత్కార్యములందు ద్యాగమెంతయో నిరుపయోగ కృత్యములం దంతపిసిడి తన మగపఱచు చున్నాఁడు. న్యాయమెంతయో నిర్ధాక్షిణ్య మంతకనఁబఱచుచున్నాఁడు. ప్రజలందుఁ బ్రేమ మెంతయో భయంకరత్వ మంతకనఁబఆచున్నాఁడు. ప్రజలందు బ్రేమ మెంతయో భయంకరత్వ మంతకనబఱచు చున్నాడు. రాయబారుల బహుమానములు గొనుచున్నాఁడు. తాత్కాలికపు ద్రోపుడుమాటలచే వారిని బంపుచున్నాఁడు. ఇష్టమయ్యును గొందఱతో మాటలాడకుండనున్నాఁడు. అనిష్టమయ్యను గొందఱతో మాటలాడు చున్నాఁడు. ఉబ్బెత్తుగవచ్చిన నవ్వును బెదవులబిగింపుచే దబాయించు చున్నాఁడు. నడుమన డుమ కొన్నిగుల్లనవ్వులను జలామణీచేయుచున్నాడు. రాజ్యతంత్రమంతయు నెట్టు నిర్వ హింపవలయునో యట్టు నిర్వహించుచున్నాఁడు.
చక్రవర్తిని జూచుటకు వచ్చినాఁడని చెప్పియుంటినే ఆ విరాగితో నింక మాటలాడ లేదు. వేచియుండలేక యాతనిప్రాణము విసుగుచున్నది. రాజసభకుఁ బోయినపిమ్మట మనయిష్టమా? మన తొందర లక్కడం బనికివచ్చునా? సమయ మగువలకు నోరుమూసి కొని పడియుండవలసినదే కాదా? సెలవు తీసికొని పోవువారు పోవుచున్నారు. తుట్టతుద కందఱు పోయిరి. మన విరాగి యొక్కడుమాత్రమే కొందరు రాజభటులతో మిగిలియం డెను. అదిసమయ మని యెంచి యాతండు చక్రవర్తియొద్దకుఁ బోయి యాశీర్వదింప మీరెవ్వ రని యాతండు డడిగెను. నాతోఁ గొంత సేపు రహస్యముగ మీరు మాటలాడవలసియున్నదని విరాగి పలుక, భటుల నందఱ నావలికిఁ బొమ్మని చక్రవర్తియాజ్ఞాపించెను. వారిద్దలకిట్లు మూటలాడుకొనిరి.
విరాగి:-చక్రవర్తీ మంచుకొండలలోయలలోపలఁ గూడ నీకీర్తివిహరించుటచే దర్శ