పుట:SaakshiPartIII.djvu/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వతంత్రత వచ్చును. కావున వేదపఠనము మొదలుగా చేయవలసిన కర్మములన్నియు భారతదేశము తిరుగ ననుష్టించునెడల సర్వసౌభాగ్యములు సిద్దింపఁగలవు. భారతదేశ మిప్పడు చేయవలసినకర్మ మిదియే. రాట్నపు సుతితో వేదగాన మొనర్చుటకంటె వేరుసాధనము లేదు. కాని యది నిశ్చలముగ నిర్మలమనస్కతతోఁ జేయఁదగినది. అంతేకాని స్వాతంత్ర్యము కలిగిన పిమ్మట తిరిగి చల్లచల్లగా వదలు కొనునేర్పాటు మీద వేదాదుల సాహాయ్య మపేక్షింప తగదు. మనకుఁ బరిపాలకులు చేసిన యపకృతి లేదనియు మనము మనదేశమునకు, మతమునకు చేసిన యపకృతి ఫల మనుభవించు చున్నా మనియు నమ్మవల యును. తిట్టుకోఁదలఁచుకొన్న యెడల నిన్ను నీవు తిట్టుకో. కొట్టుకో దలంచినయెడల నిన్ను నీవుకొట్టుకో. కోసికోదలఁచిన యెడల నిన్ను నీవు కోసికో. అంతేకాని పరులగూర్చి పల్లెత్తుపలుకైన పలుకఁదగదు. పరిపాలకుల లెక్కయేమి? మనకర్మముతో నీశ్వరునకే సంబంధము లేదు. ఏమియు సంబంధము లేదాయని యడుగు చున్నారా? లేనట్టున్నది. ఉండుటకంటె లేకుండుటయే మెరుగన్నట్లున్నది. మనకర్మముల ననుసరించి మనకీ శ్వరుడు తత్కర్మఫలమును బంచిపెట్టును. ఇంతకంటె నాతని ప్రయోజకత్వ మేమియు లేదు. ఆతఁ డందువలన మోతకూలి కాని దాతకాడు. ఆ వెట్టిపనికే జను లాతని దిట్టుచు న్నారు. సుఖానుభవకాలము రవంత పెంచుటకుఁగాని కష్టానుభవకాలము కాసంత త్రెంచుటకుఁగాని యీశ్వరునికి శక్తిలేదు. మనమే యొక ప్రపంచము. మనకు మనమే యీశ్వరులము.

దేవతలు హిరణ్యకశిపుబాధ పడలేక, నెత్తినోరు కొట్టుకొనుచు రోదసీకుహర మదర వలవల నేడ్చుచుఁ బ్రతిక్రియ చేయలేక పరుగు పరగున శ్రీమహావిష్ణువు సన్నిధికిఁజేరి యసురసంహార మొనర్పుమని ప్రార్డింపలేదా? ఆమహానుభావుఁ డేమనినాండు? మాఱుమా టాడక యిండ్లకుఁ బొమ్మనినాడు. ఎందుచేత? ఎందుచేతనో వినుడు.

శా, వేధోద త్తవరప్రసాదమహిమన్ వీఁ డింతవాఁడై మిమున్
బాధం బెట్టుచు నున్నవాఁడని మదిం భావింతు భావించి నే
సాధింపం దeటికాదు కావున గడున్ సైరించితిన్ మీఁదటన్
సాధింతున్ సురలార! యింక చనుఁడీ శంకింప మీ కేటకిన్.

అనియే కాదా భగవంతుఁడానతిచ్చినాఁడు. 'సాధింపందరికాదు కావున" నని కారణ మగపఱచినారు. అనంగా నేమి? దేవతల కష్టానుభవ కాలములో రవంతయైన దగ్గించుట కవకాశముకాని, శక్తికాని తనకు లేని కారణమున-నసురుని సుఖానుభవకాల మింకఁ గొంత జరుగవలసి యున్నది కావున దానిని దగ్గించుట కవకాశముకాని, శక్తికాని లేని కారణమునను దేవతలకు సైరణ బోధించి నివాసములకుఁ బొమ్మనినాఁడు. కావునఁ బ్రభువులకు మన కష్టసుఖములపై నధికారములేదు. భగవంతునికిఁగూడ లేదు. పోనిండు. మనకష్టములపై మనకైన నధికారమున్నదా? లేదు. ఏడ్చుచుఁ గష్టము పూర్తిగ ననుభవింపవలసినదే. ఏడ్పువంటినవ్వుతో సుఖముకూడ నట్లేయనుభవింపవలసినదే! కష్టములను మనము తగ్గించు కొనలేము పోనిండు. సుఖములను తగ్గించు కొనలే కేమి? అట్లుకూడఁ జేయలేమా? ఊహు, ఇందునుగూర్చి యొక గాథ యున్నది. దానిని జెప్పదును.

జనకమహారాజసభాశాలలోని కొక విరాగి యాతని దర్శనార్దము వచ్చెను. అప్పడే